Popular Sports Bikes In India 2024 :స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టపడని యువకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మంచి స్టైలిష్ లుక్స్‌తో, అదిరిపోయే ఫీచర్లతో స్పోర్ట్స్ బైక్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలోని టాప్-9 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Yamaha MT 15 V2 Features :మంచి స్పోర్ట్స్ బైక్ కొనాలని అనుకునేవారికి ఈ యమహా ఎంటీ 15 వీ5 బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనికి బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, కేటీఎం 200డ్యూక్ బాగా కాంపిటీషన్ ఇస్తున్నాయి.
- ఇంజిన్ : 155 సీసీ
- మైలేజ్ : 47.94 kmpl
- మ్యాక్స్ పవర్ : 18.4 పీఎస్ @ 10000 ఆర్పీఎమ్
- మ్యాక్స్ టార్క్ : 14.1 ఎన్ఎం @ 7500 ఆర్పీఎం
- ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్
- గేర్స్ : కాన్స్టెంట్ మేష్ 6 స్పీడ్
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
- వెయిట్ : 139 కేజీలు
Yamaha MT 15 V2 Price : మార్కెట్లో యమహా ఎంటీ 15 వీ2 బైక్ ధర సుమారుగా రూ.1.70 లక్షలు నుంచి రూ.1.75 లక్షల వరకు ఉంటుంది.
2. Bajaj Pulsar NS200 Features : మార్కెట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్‌లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఒకటి. ఇది సింగిల్ వేరియంట్లో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనికి కేటీఎం 200 డ్యూక్, యమహా ఎంటీ 15 బైక్‌ల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంది.
- ఇంజిన్ : 199 సీసీ
- మైలేజ్ : 40.36 kmpl
- మ్యాక్స్ పవర్ : 24.5 పీఎస్ @ 9750 ఆర్పీఎమ్
- మ్యాక్స్ టార్క్ : 18.74 ఎన్ఎం @ 8000 ఆర్పీఎం
- ఫ్యూయెల్ కెపాసిటీ : 12 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
- వెయిట్ : 158 కేజీలు
Bajaj Pulsar NS200 Price : మార్కెట్లో ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 బైక్ ధర సుమారుగా రూ.1.48 లక్షలు ఉంటుంది.
3. TVS Raider Features :రైడింగ్ అంటే ఇష్టపడే వారికి ఈ టీవీఎస్ రైడర్ బైక్ చాలా బాగుంటుంది. ఇది 4 వేరియంట్లలో, 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ టీవీఎస్ బైక్‌కు బజాజ్ పల్సర్ 125, హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్‌కు మధ్య గట్టిపోటీ ఉంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మైలేజ్ : 67 kmpl
- మ్యాక్స్ పవర్ : 11.38 పీఎస్ @ 7500 ఆర్పీఎమ్
- మ్యాక్స్ టార్క్ : 11.2 ఎన్ఎం @ 6000 ఆర్పీఎం
- ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్
- గేర్స్ : 5 స్పీడ్
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
- వెయిట్ : 123 కేజీలు
TVS Raider Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్ బైక్ ధర రూ.99,984 నుంచి రూ.1.09 లక్షల రేంజ్లో ఉంటుంది.
4. Hero Xtreme 125R Features :హీరో బ్రాండ్ నుంచి వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ బైక్ ఇది. ఈ టూ-వీలర్ 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్ 125 ఉంది.
- ఇంజిన్ : 124 సీసీ
- మైలేజ్ : 66 kmpl
- మ్యాక్స్ పవర్ : 11.55 పీఎస్ @ 8250 ఆర్పీఎమ్
- మ్యాక్స్ టార్క్ : 10.5 ఎన్ఎం @ 6000 ఆర్పీఎం
- ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్
- గేర్స్ : 5 స్పీడ్
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
- వెయిట్ : 136 కేజీలు
Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్ట్రీమ్ 125ఆర్ బైక్ ధర సుమారుగా రూ.99,984 నుంచి రూ.1.05 లక్షలు ఉంటుంది.
5. Kawasaki Ninja ZX 10R Features : వెరీ పవర్ఫుల్ బైక్ కొనాలని ఆశించే యువతకు ఈ కవాసకి నింజా జెడ్ఎక్స్ 10ఆర్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది సింగిల్ వేరియంట్లో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనికి పోటీగా బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, డుకాటీ పానిగేల్ వీ4, సుజుకి హయాబుసా ఉన్నాయి.
- ఇంజిన్ : 998 సీసీ
- మైలేజ్ : 62 kmpl
- మ్యాక్స్ పవర్ : 203 పీఎస్ @ 13200 ఆర్పీఎమ్
- మ్యాక్స్ టార్క్ : 114.9 ఎన్ఎం @ 11400 ఆర్పీఎం
- ఫ్యూయెల్ కెపాసిటీ : 17 లీటర్స్
- గేర్స్ : 6 స్పీడ్
- టైర్ టైప్ : ట్యూబ్‌లెస్
- వెయిట్ : 207 కేజీలు