New Bikes Launched In 2024 : యువతీయువకులకు బైక్స్ & స్కూటీస్ అంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ నేటి యువతీయువకుల అభిరుచులకు అనుగుణంగా లేటెస్ట్ ఫీచర్లతో, సూపర్ మోడల్ బైక్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో 2024లో విడుదలైన బైక్స్, స్కూటర్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
1. Royan Enfield Shotgun 650 Features :ఈ ఏడాది లాంఛ్ అయిన బెస్ట్ బైక్స్‌లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ఒకటి. దీనిలో 648 cc సామర్థ్యం గల ఇంజిన్ అమర్చారు. ఇది 7250 rpm వద్ద 47.65 PS పవర్, 5250 rpm వద్ద 52 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 22 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Royan Enfield Shotgun 650 Price : మార్కెట్లో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 ధర సుమారుగా రూ.3.59 లక్షల నుంచి రూ.3.73 లక్షల ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
2. Revolt RV400 BRZ Features : ఈ రివోల్ట్ ఆర్వీ400 అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. దీనిలో 3.24 కిలోవాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంది. దీనికి 5 సంవత్సరాలు లేదా 75,000కి.మీ వారెంటీ ఇస్తున్నారు. ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
Revolt RV400 BRZ Price : మార్కెట్లో ఈ రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ధర సుమారుగా రూ.1.27 లక్షల నుంచి రూ.1.44 లక్షల వరకు ఉంటుంది.
3. Kawasaki Eliminator Features : ఈ కవాసకి ఎలిమినేటర్ బైక్‌లో 451 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 9000 rpm వద్ద 45 PS పవర్, 6000 rpm వద్ద 42.6 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ సింగిల్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
Kawasaki Eliminator Price : మార్కెట్లో ఈ కవాసకి ఎలిమినేటర్ బైక్ ధర సుమారుగా రూ.5.62 లక్షలు ఉంటుంది.
4. Jawa 350 Features :ఈ జావా 350 బైక్‌లో 334 cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 22.57 PS పవర్, 28.1 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ బైక్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
Jawa 350 Price : మార్కెట్లో ఈ జావా 350 బైక్ ధర సుమారుగా రూ.2.15 లక్షలు ఉంటుంది.
5. Husqvarna Svartpilen 401 Features : ఈ హుస్క్వర్నా స్వర్ట్పిలెన్ 401 బైక్‌లో 373 cc సామర్థ్యంగల ఇంజిన్ అమర్చారు. ఇది 9000 rpm వద్ద 44 HP పవర్, 7000 rpm వద్ద 37 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బైక్ లీటర్‌కు 29 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ నాలుగు వేరియంట్లో లభిస్తుంది.