New Bank Rules From May 1st 2024 :దేశంలోని పలు ప్రముఖ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్ సర్వీస్ ఛార్జీలతో పాటు, క్రెడిట్ కార్డ్ నియమాల్లోనూ పలు మార్పులు చేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంకు, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకులు ఆ జాబితాలో ఉన్నాయి. సవరించిన ఛార్జీలు మే 1 నుంచే అమల్లోకి రానున్నాయి. ఏయే సేవల ఛార్జీలు మారాయో బ్యాంకుల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం.
HDFC Bank Senior Citizen Special FD Scheme :హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ సిటిజన్ల కోసం 2020 మేలో ఒక 'స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం'ను ప్రవేశపెట్టింది. దీనిపై వయోవృద్ధులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ ఎఫ్డీ స్కీమ్‌కు మంచి ఆదరణ వస్తుండడం వల్ల, ఈ పొదుపు పథకం గడువును 2024 మే 10 వరకు పెంచింది.
ICICI Bank savings account charges :ఐసీఐసీఐ బ్యాంకు 2024 మే 1 నుంచి వివిధ సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలకు సంబంధించిన సర్వీస్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చెక్ బుక్ జారీ, IMPS ట్రాన్స్ఫర్స్, ఈసీఎస్/ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్‌లు, స్టాప్ పేమెంట్ ఛార్జీలను పెంచింది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఐసీఐసీఐ బ్యాంక్ పొదుపు ఖాతా ఛార్జీలు :
- డెబిట్ కార్డ్ వార్షిక రుసుము : ఏడాదికి రూ.200; గ్రామీణ ప్రాంతాల్లో రూ.99 మాత్రమే.
- చెక్ బుక్స్ : ప్రతి సంవత్సరం మొదటి 25 చెక్ లీవ్స్ పూర్తిగా ఉచితం. ఆ తర్వాత ఒక్కో చెక్‌పై రూ.4 చొప్పువ వసూలు చేస్తారు.
- డీడీ/ పీఓ - కాన్సిలేషన్/ డూప్లికేట్/ రీవాలిడేషన్ ఛార్జ్ : రూ.100
- IMPS విధానంలో డబ్బులు పంపిస్తే
- రూ.1,000 వరకు ఒక్కో లావాదేవీకి రూ.2.50;
- రూ.1,000 నుంచి రూ.25,000 వరకు ప్రతి లావాదేవీకి రూ.5;
- రూ.25,000 నుంచి రూ.5 లక్షల వరకు ఒక్కో లావాదేవీకి రూ.15 చొప్పున ట్రాన్సాక్షన్ ఫీజు వసూలు చేస్తారు.
- ఖాతా మూసివేత : ఛార్జీ లేదు.
- డెబిట్ కార్డ్ పిన్ రీజెనరేషన్ : ఛార్జీ లేదు.
- డెబిట్ కార్డ్ డి-హాట్‌లిస్టింగ్ : ఛార్జీ లేదు.
- బ్యాలెన్స్ సర్టిఫికెట్, వడ్డీ సర్టిఫికెట్ : ఛార్జీ లేదు.
- పాత లావాదేవీల పత్రాల పునరుద్ధరణ / పాత రికార్డులకు సంబంధించిన విచారణలు: ఛార్జీ లేదు.
- సంతకం ధ్రువీకరణ : రూ.100.
- చిరునామా నిర్ధారణ : ఛార్జీ లేదు.
- ఈసీఎస్ /ఎన్ఏసీహెచ్ డెబిట్ రిటర్న్స్ : రూ.500
- నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) మ్యాండేట్. వన్-టైమ్ మ్యాండేట్ ఆథరైజేషన్ ఛార్జీలు (ఫిజికల్) : ఛార్జీ లేదు.
- పొదుపు ఖాతా తాత్కాలిక హక్కు మార్కింగ్, అన్మార్కింగ్ : ఛార్జీ లేదు.
- ఇంటర్నెట్ యూజర్ ఐడీ లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) మళ్లీ జారీ చేయడం: ఛార్జీ లేదు.
- బ్యాంక్ శాఖల వద్ద చిరునామా మార్పు అభ్యర్థన : ఛార్జీ లేదు.
- స్టాప్ పేమెంట్ ఛార్జెస్ : రూ.100 (కస్టమర్ కేర్ IVR & నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉచితం).
Yes Bank Savings Account Charges From May 1, 2024 :యెస్ బ్యాంక్ కూడా తమ పొదుపు ఖాతాల ఛార్జీలను సవరించింది. అలాగే కొన్ని రకాల ఖాతాలను పూర్తిగా నిలిపివేసింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. కనీస బ్యాలెన్స్ రిక్వైర్మెంట్ (AMB) :
- సేవింగ్స్ అకౌంట్ ప్రో మ్యాక్స్ : మినిమం బ్యాలెన్స్ రూ.50,000. ఛార్జీ గరిష్ఠంగా రూ.1,000 ఉంటుంది.
- సేవింగ్స్ అకౌంట్ ప్రో ప్లస్ / యెస్ ఎసెన్స్ ఎస్ఏ/ యెస్ రెస్పెక్ట్ ఎస్ఏ : మినిమం బ్యాలెన్స్ రూ.25,000. ఛార్జీ గరిష్ఠంగా రూ.750.
- సేవింగ్స్ అకౌంట్ ప్రో : మినిమం బ్యాలెన్స్ రూ.10,000. గరిష్ఠ ఛార్జీ రూ.750
- పొదుపు విలువ / కిసాన్ ఎస్ఏ : రూ.5,000; ఛార్జీ గరిష్ఠంగా రూ.500
- మై ఫస్ట్ యెస్ : రూ.2,500; గరిష్ఠ ఛార్జీ రూ.250