తెలంగాణ

telangana

ETV Bharat / business

మల్టీబ్యాగర్​ స్టాక్​ - రూ.1లక్ష పెట్టుబడితో రూ.1కోటి లాభం - ఆ షేర్ ఏదో తెలుసా? - Multibagger Stock

Multibagger Stock : మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? మంచి మల్టీబ్యాగర్ స్టాక్​ కోసం చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. గత నాలుగేళ్లలో ఓ స్టాక్ ఇన్వెస్టర్లకు 105 రెట్లుకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. అంటే రూ.1 లక్ష పెట్టుబడి పెడితే రూ.1 కోటికి పైగా లాభం తెచ్చిపెట్టింది. ఇంతకీ ఆ స్టాక్ ఏమిటంటే?

TRIL Stock Price
Best Multibagger Stock (ETV BHARAT TELUGU TEAM)

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 12:05 PM IST

Multibagger Stock : స్టాక్ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టేవారు ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని పెట్టుబడులు పెడుతుండాలి. అప్పుడే పెద్దగా రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ అందుకునే అవకాశం ఉంటుంది. ఏదో ఇన్వెస్ట్ చేశామా? కొంచెం లాభం లేదా నష్టం రాగానే తీసేశామా? అన్న చందంగా కాకుండా అలాగే హోల్డ్ చేసి ఉంచాలి. లాంగ్ రన్​లో చాలా స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చిన చరిత్ర ఉంది. కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. మల్టీ బ్యాగర్ అంటే షేరు అసలు విలువకు ఎన్నో రేట్లు పెరుగుతుందన్నమాట. కొన్ని షేర్లు ఊహించని రీతిలో రాబడి ఇస్తుంటాయి. లక్షను కొన్ని కోట్లు చేసే స్టాక్స్ కూడా ఉంటాయి. అలాంటి ఒక స్టాక్ గురించే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాన్స్​ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్ (TRIL) షేరు గత నాలుగు ఏళ్లలోనే రూ.1 లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.1 కోటికిపైగా చేసిందన్నమాట. అంటే 105 రెట్లుకుపైగా పెరిగింది. ఇటీవలి కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్ సృష్టించిన మల్టీబ్యాగర్ స్టాక్స్​లో ఇదొకటని చెప్పొచ్చు. కొవిడ్ తర్వాతి కాలంలో అద్భుత రీతిలో ఈ స్టాక్ పుంజుకుంది. 2020 మే నెలలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ స్టాక్ ధర రూ.6.30 మాత్రమే. కానీ ఇప్పుడు దాని ధరను చూస్తే షాకవుతారు. బుధవారం నాటికి TRIL షేర్ ధర ఏకంగా రూ.658.45కు చేరుకుంది. అంటే గడచిన నాలుగేళ్లలో 105 రెట్లకు పైగా లాభాన్ని ఇన్వెస్టర్లకు అందించింది.

గత నెల వ్యవధిలో చూసినట్లయితే ట్రాన్స్​ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్ షేరు ధర రూ.415.50 నుంచి రూ.658.45కు పెరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు 50 శాతానికిపైగా రిటర్న్స్ లభించాయి. ఇక్కడ పెట్టుబడి పరంగా చూస్తే లక్షకు రూ.50 వేల లాభం వచ్చింది. ఈ స్టాక్ ఈ ఏడాది 4 నెలల కాలంలోనే 160 శాతం పెరిగింది. ఇక్కడ లక్షను రూ.2.60 లక్షలు చేసింది. ఈ నాలుగు నెలల్లోనే రూ. 238 నుంచి రూ. 658కు పెరిగింది. గత 6 నెలల్లో అయితే రూ.161 నుంచి రూ.658.45 కి చేరగా, ఇన్వెస్టర్లు 300 శాతానికిపైగా లాభం పొందారు. ఈ సమయంలో లక్ష పెట్టుబడి రూ.4 లక్షలైంది. ఏడాది క్రితం రూ.67.30 ఉన్న షేరు విలువ ఇప్పుడు రూ.658.45కు చేరింది. దీంతో రూ.1లక్ష పెట్టుబడి పెడితే రూ.9,50,000పైగా లాభం వస్తుంది.

ట్రాన్స్​ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.769.10 వద్ద ఉండగా, కనిష్ఠ ధర రూ.63.05 వద్ద ఉంది. మార్కెట్ విలువ రూ.9,367 కోట్లుగా ఉంది.

రిజిస్ట్రేషన్ కాని ఫ్లాట్లకు లోన్ ఇస్తారా? - నిపుణులు ఏమంటున్నారు? - Unregistered Flat get home loan

10 ఏళ్లలో చేతికి రూ.17 లక్షలు - పోస్టాఫీసు సూపర్​ స్కీమ్​! - Post Office RD Scheme

ABOUT THE AUTHOR

...view details