Most Powerful SUVs Under 10 lakh : భారతదేశంలో ఎస్యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో 2023 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో 63 శాతం ఎక్కువగా ఎస్యూవీ అమ్మకాలు జరిగాయి. మరి మీరు కూడా మంచి ఎస్యూవీ కార్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-5 ఎస్యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.
1. Mahindra XUV 3X0 :మహీంద్రా ఎక్స్‌యూవీ 3X0కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 18.4 bhp మ్యాక్స్ పవర్, 200 Nm మ్యాక్స్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే ఈ ఎస్‌యూవీకి నాలుగు డిస్క్ బ్రేకులు ఉంటాయి.
ఈ ఎస్యూవీ కార్లో 10.2 అంగుళాల ఫ్లోటింగ్ టచ్-స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7 స్పీకర్ హర్మన్ కర్డాన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్బీ-సీ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లు ఉన్నాయి.
Mahindra XUV 3X0 Price :ఈ మహీంద్రా కారు ధర రూ.7.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
2. Tata Nexon :టాటా నెక్సాన్ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లు ఉంటాయి. టాటా నెక్సాన్లోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 118 bhp పవర్, 170 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ , 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో ఇది వస్తుంది. నాలుగు విభిన్న ట్రాన్స్మిషన్లు ఉన్న ఏకైక ఎస్యూవీ కారు ఇదే.
ఫీచర్ల విషయానికి వస్తే, నెక్సాన్ స్పోర్ట్స్ ట్విన్ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 9 స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్.
Tata Nexon Price : ఈ టాటా నెక్సాన్ కారు ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
3. Maruti Suzuki Brezza :మారుతి సుజుకి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 103 bhp పవర్, 136.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ మోడల్ ఎస్యూవీ గతేడాది ఏప్రిల్ త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది 45 శాతం అమ్మకాలను పెంచుకుంది. ఈ ఎస్యూవీ 4 సిలిండర్ ఇంజిన్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్‌ను కలిగి ఉంది.
ఫీచర్లు విషయానికే సన్‌రూఫ్, 9 అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్ అప్-డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్‌హోల్డ్ అసిస్ట్.