Microsoft Hyderabad Campus Viral Video : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ 'మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్' తమ ఉద్యోగులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంటుంది. అందులో భాగంగా మన దేశంలోని హైదరాబాద్ క్యాంపస్‌లోనూ సూపర్ ఫెసిలిటీస్ అందిస్తోంది. వీటి గురించి వివరిస్తూ, మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఓ ఇన్స్టాగ్రామ్ రీల్ (వీడియో)ను పోస్ట్ చేశారు. అది సూపర్ వైరల్ అయ్యింది.
ఇంతకీ ఆ 'రీల్'లో ఏముంది?
మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ ఉద్యోగులకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా 54 ఎకరాల హైదరాబాద్ క్యాంపస్‌లో ఎనర్జీ-ఎఫీషియంట్ బిల్డింగ్స్ నిర్మించారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను, పటిష్టమైన హై-టెక్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటితోపాటు కార్యాలయంతో ఉద్యోగులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. వీటన్నింటినీ చూపిస్తూ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ రిలీజ్ చేశారు. దానిలో ఏమున్నాయంటే?
Microsoft Facilities For Employees :
ఫ్రీ ఫుడ్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ తమ క్యాంపస్‌లో 24x7 గంటలు కెఫెటీరియా (ఫలహారశాల)ను నడుపుతుంది. ఇందులో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల స్నాక్స్, డ్రింక్స్ ఉంటాయి. కాఫీ, టీ నుంచి లస్సీ, హెల్త్ డ్రింక్స్ వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. హాట్ ఫిల్టర్ కాఫీ ఇక్కడ ప్రత్యేకంగా లభిస్తుంది. ఇవన్నీ ఉద్యోగాలు కాస్త రీఛార్జ్ కావడానికి చాలా ఉపకరిస్తాయి. పైగా ఇవన్నీ పూర్తి ఉచితం.
మీటింగ్ ఏరియాస్ :ప్రతి అంతస్తులోనూ ఉద్యోగులు పరస్పరం కలుసుకోవడానికి అనధికార సమావేశ ప్రాంతాలు ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి, పునరుత్తేజం పొందడానికి ప్రత్యేకమైన గదులు కూడా ఉంటాయి.
జిమ్ ఫెసిలిటీస్ :మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల శ్రేయస్సు కోసం, వారి ఉత్పాదకతను పెంచడం కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తుంటుంది. అందులో భాగంగా క్యాంపస్‌లోనే ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేసింది. ఇందులో ట్రైనర్స్ కూడా ఉంటారు. అలాగే ఇక్కడ ఫిట్నెస్ క్లాసులు కూడా నిర్వహిస్తుంటారు.
హెల్త్ ఫెసిలిటీస్ :అత్యవసర సమయాల్లో వైద్య సహాయం అందించడం కోసం 24 గంటలూ అంబులెన్స్‌లు రెడీగా ఉంటాయి. అలాగే ఫార్మసీ కూడా ఇక్కడే ఉంటుంది. కనుక ఔషధాల కోసం బయటకు వెళ్లాల్సిన పనిలేదు.