తెలంగాణ

telangana

ETV Bharat / business

మారుతి స్విఫ్ట్​లో ఈ వేరియంట్​కే ఫుల్ డిమాండ్ - మీ ఛాయిస్ ఏంటి? - Maruti Swift Bookings

Maruti Swift Bookings : భారతదేశంలో మారుతి కార్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మారుతి కార్లలో న్యూ-జెన్​ స్విఫ్ట్​కు అయితే మరింత క్రేజ్ ఉంది. అందుకే దీనికి భారీ స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. అందుకే ఈ స్విఫ్ట్​ వేరియంట్స్, ఫీచర్స్, స్పెక్స్​, ప్రైస్ వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

maruti suzuki swift
maruti car (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 5, 2024, 5:00 PM IST

Maruti Swift Bookings :దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎప్పటికప్పుడు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడల్​ కార్లను మార్కెట్లోకి తెస్తూ ఉంటుంది. అందుకే వీటికి ఇండియన్ మార్కెట్లో ఎప్పుడూ ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే మారుతి కార్లలో 'స్విఫ్ట్​' (Swift)కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఫోర్త్​-జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ హవా నడుస్తోంది. 2024 మే 9న విడుదలైన ఈ కారు గత మోడల్స్ మాదిరిగానే పెద్ద సంఖ్యలో బుకింగ్స్​ సాధిస్తోంది. సేల్స్ ప్రారంభించిన మొదటి నెలలోనే ఏకంగా 19,393 యూనిట్లను డీలర్లకు పంపిణీ చేసినట్లు మారుతి సుజుకి కంపెనీ తెలిపింది.

భారీ స్థాయిలో బుకింగ్స్​
2024 మే 9న భారత మార్కెట్లోకి విడుదలైన ఫోర్త్ జనరేషన్​ స్విఫ్ట్​ కారు ఇప్పటి వరకు 40,000 బుకింగ్స్​ను సాధించింది. ఈ కారు ధర కేవలం రూ.6.49 లక్షలు మాత్రమే. అందుకే ఈ అఫర్డబుల్ కార్​కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది.

ఈ వేరియంట్లకు ఫుల్ డిమాండ్​"
మారుతి సుజుకి స్విఫ్ట్ మొత్తం బుకింగ్స్​లో మిడ్-స్పెక్​ VXI, VXI (O) వేరియంట్లే ఏకంగా 60 శాతం వరకు ఉన్నాయి. వీటి తరువాత ఎంట్రీ లెవల్​ LXI వేరియంట్​ 11 శాతం బుకింగ్స్​ సాధించింది. ఖరీదైన స్విఫ్ట్​ వేరియంట్లు ZXI, ZXI+లు మొత్తం బుకింగ్స్​లో 19 శాతం వరకు ఉన్నాయి.

ఆ వేరియండ్​కు డిమాండ్​ తగ్గిందా?
న్యూ స్విఫ్ట్​ ఏఎంటీ కార్లకు సాపేక్షికంగా డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం 17 శాతం మంది మాత్రమే ఈ మోడల్ కార్లను బుక్ చేసుకున్నారు. వీటిలో మిడ్​-స్పెక్​ VXI కార్లు కేవలం 10 శాతం బుకింగ్స్ మాత్రమే దక్కించుకున్నాయి. ZXI, ZXI+ ఏఎంటీ వేరియంట్లు అయితే కేవలం 7 శాతం వరకు బుక్ అయ్యాయి.

Maruti Suzuki Swift Features :మారుతి సుజుకి కంపెనీ 2024 మోడల్​ స్విఫ్ట్‌ కార్​లో ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, ఫీచర్ల పరంగా చాలా మార్పులు చేసింది. రీడిజైన్ చేసిన రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్​ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు, C-షేప్ టెయిల్‌ ల్యాంప్‌లతో ఈ న్యూ-జెన్​ స్విఫ్ట్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనిలో వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అప్డేడేటెడ్​ స్విచ్ గేర్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్‌తో కూడిన 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌ కార్​ అన్ని వేరియంట్లలోనూ ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉంటాయి. కనుక సేఫ్టీ పరంగానూ ఇది బెస్ట్ ఛాయిస్​ అవుతుంది.

ఈ న్యూ-జెన్ మారుతి స్విఫ్ట్ కారులో 1.2 లీటర్ త్రీ-సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 82 bhp పవర్​, 112 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్​ మాన్యువల్​, 5-స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్​మిషన్ ఆప్షన్​లతో వస్తుంది. ఈ కార్ ఫ్యూయెల్ ఎఫీషియన్సీ 25.75 కి.మీ/లీటర్​. త్వరలోనే సీఎన్​జీ వేరియంట్ కార్లను కూడా మార్కెట్లోకి తెస్తామని మారుతి సుజుకికంపెనీ చెబుతోంది.

మీ బైక్​ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్​లో పెరగడం గ్యారెంటీ! - Bike Mileage Increase Tips

స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయారా? ఈ టిప్స్ పాటిస్తే లాభాల బాట పట్టడం గ్యారెంటీ! - Stock Market Investment Tips

ABOUT THE AUTHOR

...view details