తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ కార్‌ కీస్‌ పోయాయా? డోంట్ వర్రీ - ఇలా చేస్తే మీ ప్రోబ్లమ్ సాల్వ్‌! - WHAT TO DO IF CAR KEYS ARE LOST

మీ కారు కీని పోగొట్టుకున్నారా? స్పేర్ కీస్‌ ఎలా పొందాలో తెలుసా?

Car Keys
Car Keys (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2024, 10:57 AM IST

What To Do If Car Keys Are Lost :పొరపాటున కారు కీ పోతే, ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కారు కీ పోతే మన ప్రయాణ షెడ్యూల్స్‌ అన్నీ తారుమారు అవుతాయి. విపరీతమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? కొత్త కార్‌ కీస్‌ను ఎలా సంపాదించాలి? అనే విషయాలను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

  1. కారు కీ పోయిన తరువాత మీరేమీ గాబరా పడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. మీరు ఎక్కడెక్కడ తిరిగారో, అక్కడంతా అణువణువూ వెతకాలి.
  2. కార్ కీస్‌ పోయిన తరువాత వీలైనంత త్వరగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. దీని వల్ల కారు దొంగతనానికి గురికాకుండా చూసుకోవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పరిహారం పొందడానికి వీలు ఏర్పరుచుకోవచ్చు.
  3. ఒక వేళ అప్పటికీ కీస్‌ దొరకకపోతే, వెంటనే మీ కార్‌ డీలర్‌కు లేదా మాన్యుఫాక్చురర్‌కు ఆ విషయం తెలియజేయాలి. వాళ్లు మీకు స్పేర్‌ కీస్‌గానీ, డూప్లికేట్‌ కీస్‌గానీ ఇస్తారు. అయితే ఇందుకోసం మీరు మీ కార్ ఛాసిస్‌ నంబర్‌, ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, కార్ ఇన్సూరెన్స్‌ పాలసీ నంబర్‌ మొదలైన ఓనర్‌షిప్‌కు సంబంధించిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
  4. కార్ కీస్‌ పోయిన విషయాన్ని మీ ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా విషయం తెలియజేయాలి. ఇలా కనుక చేయకపోతే, బీమా కంపెనీకి మీ కార్ కీస్‌ పోయాయని తెలియదు కనుక, ఒకవేళ మీ కారును ఎవరైనా దొంగతనం చేసినా పరిహారం అందించదు. అందుకే ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే, మీరు కారు కొనేటప్పుడే మంచి కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దానికి అనుబంధంగా రోడ్‌ సైడ్ అసిస్టెన్స్‌, కీ రీప్లేస్‌మెంట్ లాంటి యాడ్‌-ఆన్‌లను చేర్చుకోవాలి. దీని వల్ల ఎప్పుడైనా మీ కారు కీ పోతే, దానికి ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం అందిస్తుంది.
  5. ఎప్పుడూ మీ దగ్గర స్పేర్‌ కీస్‌ ఉండేలా చూసుకోవాలి. మీ ఒరిజినల్ కీస్‌ పోయేటప్పుడు ఇవి మీకు కచ్చితంగా ఉపయోగపడతాయి. ఉదాహరణకు మీరు మీ ఇంటి నుంచి చాలా దూరంలో ఉన్నారు. అప్పుడే కార్ కీస్ పోయాయి అనుకుందాం. మీ ఇంటి వాళ్లకు ఫోన్‌ చేసి స్పేర్ కీస్‌ తెమ్మని చెప్పవచ్చు. అలాంటి వీలు లేనప్పుడు, మీకు కనుక రోడ్‌ సైడ్ అసిస్టెన్స్‌ రైడర్‌ ఉంటే, సదరు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లే మీ ఇంటి నుంచి స్పేర్‌ కీస్‌ తీసుకుని వచ్చి మీకు ఇస్తారు.
  6. చాలా మంది కారు కీస్‌ పోయిన వెంటనే దగ్గరల్లోని డూప్లికేట్ తాళాలు చేసేవారి దగ్గరకు వెళ్తారు. ఆ డూప్లికేట్ తాళాలు ఉపయోగించి కారును నడుపుతుంటారు. కానీ ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. ఇవి మీ కార్‌ లాక్ సిస్టమ్‌ను డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత త్వరగా డీలర్‌ లేదా మాన్యుఫాక్చురర్‌ నుంచి కొత్త కీస్‌ తీసుకోవడం మంచిది.
  7. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒరిజినల్ కీస్‌ దొరకకపోతే, వెంటనే మీరు రీప్లేస్‌మెంట్‌కు వెళ్లాలి. మార్కెట్లో ట్రెడిషనల్ కీస్‌, ట్రాన్స్‌పాండర్‌ కీస్‌, కీస్ విత్‌ ఎఫ్‌ఓబీ (ఫ్రీక్వెన్సీ-ఆపరేటెడ్‌ బటన్‌), స్మార్ట్‌ కీస్‌ - లాంటి పలు ఆప్షన్స్ ఉంటాయి. మీ డీలర్‌కు చెప్పి, వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాలి.

How To Replace Lost Car Keys In India?
కారు కీస్‌ పోయినప్పుడు, దానికి రీప్లేస్‌మెంట్ పొందాలంటే, ఓ ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

  • మీ కారు పేరు, మోడల్‌, మాన్యుఫాక్చురింగ్ సంవత్సరం, వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ (వీఐఎన్‌) లేదా ఛాసిస్‌ నంబర్‌, ఆర్‌సీ వివరాలు, పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి.
  • తరువాత మీ కార్‌ డీలర్‌కు దగ్గరకు వెళ్లి, కీస్‌ పోయిన విషయం చెప్పి, అవసరమైన సమాచారం అంతా ఇవ్వాలి.
  • డీలర్‌ మీ కారు వివరాలు నమోదు చేసుకొని, మీ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్‌సీ, ఆధార్‌ కార్డ్‌లను తీసుకుని ప్రాసెస్ ప్రారంభిస్తారు.
  • ట్రెడిషనల్ కీస్‌, ట్రాన్స్‌పాండర్‌ కీస్‌, కీస్ విత్‌ ఎఫ్‌ఓబీ (ఫ్రీక్వెన్సీ-ఆపరేటెడ్‌ బటన్‌), స్మార్ట్‌ కీస్‌ - వీటిలో మీకు ఏది కావాలో ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా రీప్లేస్‌మెంట్ జరుగుతుంది. ఒక వేళ మీరు ట్రాన్స్‌పాండర్ కీని ఎంచుకుంటే - మీ కారు భద్రతా వ్యవస్థకు అనుగుణంగా ప్రోగ్రామ్‌ చేసిన కీని మీకు ఇస్తారు.
  • మీ కారు బ్రాండ్, మోడల్ ఆధారంగా కీ ధర మారుతూ ఉంటుంది. అంతేకాదు కీ మోడల్‌, ప్రోగ్రామింగ్‌, కటింగ్‌, అర్జెన్సీ, లొకేషన్ మొదలైనవి కూడా కారు కీ ధరను ప్రభావితం చేస్తాయి. కానీ యావరేజ్‌గా చూసుకుంటే కొత్త కీ ధర సుమారుగా రూ.1,500 నుంచి రూ.35,000 వరకు ఉంటుంది. మీకు కనుక ఇన్సూరెన్స్ ఉంటే, ఈ ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details