Life Insurance an Investment Tool : లైఫ్ ఇన్సూరెన్స్ ఇదొక రకమైన పెట్టుబడి! మారుతున్న కాలానికి అనుగుణంగా ఇది ఈ కాలంలో తప్పనిసరిగా మారిపోయింది. అనారోగ్యం పాలైనప్పుడు మన చేతిలో డబ్బులు లేకపోయినా మనల్ని ఆదుకునే ఆయుధంలా ఇది పనిచేస్తుంది. జీవితానికి ఒక రకంగా భద్రత, స్థిరత్వాన్ని కల్పిస్తుంది. అందుకే చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటానికి ఇష్టపడతారు. చాలా కంపెనీలు, తమ ఉద్యోగులకు సైతం జీవిత భీమా సౌకర్యం కల్పిస్తాయి. అందుకే ఇది చాలా అవసరమైన వాటిల్లో ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
జీవిత బీమాను చేయించుకునే ముందు అవసరాలను చూసుకోవాలి. అందుకు తగ్గట్లుగానే ఏ రకమైన కవరేజీ ఉత్తమంగా సరిపోతుందో తెలుసుకోవాలి. ఉదాహరణకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది నిర్ణీత కాలానికి మాత్రమే కవరేజీ అందిస్తుంది. సాధారణంగా 10-30 ఏళ్ల వరకు ఉంటుంది. మరోవైపు కంప్లీట్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే జీవిత కాలంపాటు కవరేజీ అందిస్తుంది. అంతేకాదు కాలం పెరిగే కొద్దీ నగదు విలువ కూడా పెంచుతుంది. ప్రొటెక్షన్తో పాటు పొటెన్షియల్ ఇన్వెస్ట్ మెంట్ విలువనూ పెంచుతుంది. సరైన పాలసీని ఎంచుకోవడానికి ఈ తేడాల్ని అర్థం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రీమియాలు
లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు వాటి ప్రీమియాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే వీటి ధర వయస్సు, ఆరోగ్య స్థితి, కవరేజీ మొత్తం, పాలసీ రకం తదితర అంశాలపై ఆధారపడుతుంది. ప్లాన్ ఎంపికలో మీ ఆర్థిక పరిస్థితి, పరిమితుల గురించి సైతం ఆలోచించాలి. తక్కువ ఖర్చుతో, మంచి ప్లాన్ను ఎంచుకోవాలి.