Jio New Prepaid Plans: రిలయన్స్ జియో మూడు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవన్నీ ఓటీటీ (ఓవర్ ది టాప్) సబ్‌స్క్రిప్షన్లతో కలుపుకొని వస్తుండటం విశేషం. దీంతో పాటు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ 'జియో భారత్ జే1 4జీ'ని కూడా విడుదల చేసింది. జులై నెలలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల రేట్లను పెంచిన జియో, అప్పటివరకు అందుబాటులో ఉన్న పలు ఎంటర్‌టైన్‌మెంట్ ఫోకస్డ్ రీఛార్జ్ ప్లాన్లను తొలగించింది. కొత్తగా తీసుకొచ్చిన మూడు రీఛార్జ్ ప్లాన్లు వాటి స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. వీటిని జియో యూజర్స్ రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నెట్ డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌కు అదనంగా ప్రముఖ ఓటీటీల కంటెంట్‌ను వీక్షించే అవకాశం కూడా దక్కుతుంది.
కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు
- రూ.1,049 రీఛార్జ్ ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 84 రోజుల వ్యాలిడిటీతో 'జీ5 - సోనీ లివ్' కాంబో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కాంప్లిమెంటరీగా వస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ.949 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 2జీబీ ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 84 రోజుల వ్యాలిడిటీతో 'డిస్నీ + హాట్ స్టార్' కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది.
- రూ.329 ప్లాన్ : ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ ఇంటర్నెట్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజూ 100 ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. వీటికి తోడుగా 28 రోజుల వ్యాలిడిటీతో 'జియో సావన్ ప్రో' కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.