IRCTC New Rules For Ticket Booking :సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఉత్తమ రవాణా మార్గం రైల్వే. ఎందుకంటే బస్సు, విమానాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రైలులో ప్రయాణించవచ్చు. అందుకే చాలా మంది ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారిక వెబ్‌సైట్ ఐఆర్‌సీటీసీను అప్డేట్ చేసింది. అవేంటంటే?
ప్రయాణికులు రైలు టికెట్‌లను సులభంగా, దుర్వినియోగానికి గురి కాకుండా బుక్ చేసుకోవడానికి వీలుగా ఐఆర్‌సీటీసీ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసే ప్రయాణికులు ముందుగా వారి ఫోన్ నంబర్, ఈ-మెయిల్‌ను ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వెరిఫికేషన్ ఇలా
- మొదటగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో వెరిఫికేషన్ విండోకు లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి.
- హోమ్ పేజీలో అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి మీ మొబైల్ నంబర్‌ని ధ్రువీకరించాలి.
- ఇక ఈ-మెయిల్ వెరిఫికేషన్ పూర్తి చేయడానికి ముందుగా మీ ఈ-మెయిల్ ఐడీకి వచ్చిన కోడ్‌ను నమోదు చేయాలి.
- ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ రైలు టికెట్ బుకింగ్‌లు చేయగలుగుతారు.
ఆర్ఏసీ ప్యాసింజర్లకు ప్రత్యేక బెడ్ రోల్
Bed Roll Kit For RAC Passengers In AC Trains : రైల్వే ఏసీ కంపార్ట్మెంట్లలో ప్రయాణించే ఆర్ఏసీ ప్యాసింజర్ల విషయంలో కొన్నాళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది ఇండియన్ రైల్వే. ఆర్ఏసీ టికెట్ కలిగిన ప్రతి ప్రయాణికుడికి ప్రత్యేక బెడ్ రోల్ కిట్‌ను అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే బోర్డు ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శైలేంద్ర సింగ్ చెప్పారు. ఈ కిట్‌లో ఒక బెడ్‌షీట్, దుప్పటి, టవల్‌తో పాటు ఓ తలగడ కూడా ఉంటుందని వివరించారు. అయితే ఈ నిర్ణయం ఏసీ ఛైర్ కార్ ప్రయాణికులకు వర్తించదని ఆయన చెప్పారు.
ఈ బెడ్ రోల్ కిట్‌కు సంబంధించిన ఛార్జీలను ఆర్ఏసీ ప్రయాణికులు బుక్ చేసుకునే టికెట్ రుసుములోనే చెల్లిస్తున్నారని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలతో కూడిన ఓ లేఖను ఇప్పటికే అన్నీ జోన్ల జనరల్ మేనేజర్లకు పంపినట్లు శైలేంద్ర సింగ్ తెలిపారు. ప్రతి ఆర్ఏసీ( Reservation Against Cancellation ) ప్రయాణికుడికి ఈ సదుపాయం అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన అన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
రైలు హారన్లు 11 రకాలని మీకు తెలుసా? వాటి అర్థాలు తెలిస్తే షాకే!
రైల్లో హాఫ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు - మీకు తెలుసా?