Interim Budget 2024 Expectations : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు, ఈ మధ్యంతర బడ్జెట్లో వరాల జల్లు కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి పథకాలను మధ్యంతర బడ్జెట్లో ప్రవేశపెట్టకూడదు. కానీ మోదీ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించేందుకు, కచ్చితంగా కొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం కాస్త ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం ఉంది.
- 2025-26 నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించడమే లక్ష్యమని మోదీ ప్రభుత్వం చెప్పవచ్చు.
- ఆర్థిక వృద్ధిపై దృష్టి సారిస్తూనే, పన్నుల భారం తగ్గించడానికి, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళికలను, వాటికి కావాల్సిన నిధులను కేటాయించవచ్చు.
- మౌలిక సదుపాయాల కల్పన కోసం మోదీ ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా, గ్రీన్ హైడ్రోజన్, విద్యుత్ వాహనాలు, బ్రాడ్‌బ్యాండ్ విస్తరణ మొదలైన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించవచ్చు.
- మోదీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆహారం, ఎరువుల సబ్సిడీ కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది! మధ్యంతర బడ్జెట్లో ఈ కేటాయింపులు చేయకపోయినప్పటికీ, తమ లక్ష్యం ఇదేనని చెప్పే అవకాశం ఉంది.
- పేదలకు తక్కువ ధరలో గృహ వసతి కల్పించేందుకు, మోదీ ప్రభుత్వం బడ్జెట్లో 15 శాతం కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంది. బహుశా దీని కోసం మోదీ ప్రభుత్వం ఒక లక్ష కోట్ల రూపాయలు వరకు కేటాయించవచ్చు.
- మోదీ సర్కార్ ప్రభుత్వ ఆస్తులను విక్రయించడం ద్వారా రూ.510 బిలియన్స్ సమీకరించాలని భావిస్తోంది. దీనిని కూడా బడ్జెట్లో పొందుపరిచే అవకాశం ఉంది.
సామాన్యులు ఏం కోరుకుంటున్నారు?
పన్ను తగ్గింపు : ప్రస్తుత పన్ను స్లాబ్‌ల ప్రకారం, రూ.3 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఇన్‌కం టాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. అయితే ఈ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచాలని ప్రజలు ఆశిస్తున్నారు.