How To Renew Passport Online : విద్య, ఉద్యోగం, వ్యాపారం, పర్యటన ఇలా పలు రకాల పనుల కోసం చాలా మంది విదేశాలకు పయనమవుతుంటారు. అలాంటి వారికి విదేశాలకు వెళ్లేందకు తప్పనిసరిగా ఉండాల్సింది పాస్‌పోర్టు. ప్రయాణికులకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉంటాయి. 18 ఏళ్లలోపు వయసు ఉన్నవారికి పాస్‌పోర్ట్ వ్యాలిడిటీ ఐదు సంవత్సరాలు, లేదా 18 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉంటుంది. ఆ తర్వాత పాస్‌పోర్టును రెన్యువల్ చేసుకోవాలి. ఇక 15 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు 10 సంవత్సరాల పాస్‌పోర్టును తీసుకోవచ్చు. అయితే పాస్‌పోర్ట్ గడువు ముగిసిన తర్వాత, దాన్ని సులభంగా ఆన్లైన్లో ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాస్పోర్ట్రెన్యువల్ ప్రక్రియ
- 'పాస్‌పోర్ట్ సేవ' వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- ఒకవేళ వెబ్సైట్లో మీరు ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే, సూచనలకు అనుగుణంగా రిజిస్టర్ చేసుకొని లాగిన్ ఐడీని పొందవచ్చు.
- ఆ తర్వాత మీ లాగిన్ ఐడీతో లాగిన్ అవ్వండి.
- Apply for fresh passport/Reissue of Possportను ఎంచుకోండి.
- తగిన వివరాలను నమోదు చెయ్యండి.
- తర్వాత Pay and Schedule appointment మీద క్లిక్ చేయండి.
- అక్కడ ఉన్న పేమెంట్ పద్ధతులలో ఏదైనా ఒక దాని ద్వారా పేమెంట్ పూర్తి చెయ్యండి.
- అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత మీ ఫాంను సబ్మిట్ చెయ్యండి.
- Print Application Receipt మీద క్లిక్ చెయ్యండి.
- నిర్ణీత తేదీన మీకు దగ్గరలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి అవసరమైన డాక్యుమెంట్లు, అప్లికేషన్ ఫాంలతో వెళ్లండి.
అపాయింట్మెంట్ ఇలా బుక్ చేసే విధానం
- మీ వివరాలతో 'పాస్‌పోర్ట్ సేవ' వెబ్సైట్ లాగిన్ అవ్వండి.
- View Saved and Submit Applicationను సెలెక్ట్ చేసి, Pay and Schedule appointment మీద క్లిక్ చెయ్యండి.
- పేమెంట్ పద్ధతిని ఎంచుకోండి. ఆ తర్వాత పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఎంచుకోండి.
- పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లోకేషన్, CAPTCHA కోడ్‌ను ఎంటర్ చెయ్యడం ద్వారా వెరిఫై చెయ్యండి.
- మీకు తగిన తేదీ, సమయాన్ని అపాయింట్మెంట్ కోసం సెలెక్ట్ చెయ్యడం సహా Pay and Book the Appointment మీద క్లిక్ చేయండి.