తెలంగాణ

telangana

ETV Bharat / business

'సాలరీ ప్యాకేజ్' గురించి డిస్కస్‌ చేయాలా? ఈ టాప్‌-10 టిప్స్ మీ కోసమే! - How To Negotiate Salary - HOW TO NEGOTIATE SALARY

How To Negotiate Salary : జాబ్‌ ఇంటర్వ్యూలో జీతం గురించి, అదనపు ప్రయోజనాలు గురించి మాట్లాడడం చాలా అవసరం. అందుకే మంచి ప్యాకేజీ పొందడానికి అవసరమైన టాప్‌-10 టిప్స్ మీ కోసం.

How To Negotiate Salary And Benefits
How to negotiate salary (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 6, 2024, 11:38 AM IST

How To Negotiate Salary And Benefits : ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేసేటప్పుడు సాలరీ ప్యాకేజ్ గురించి, అదనపు ప్రయోజనాల గురించి కచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ విషయంలో మొహమాటపడుతూ ఉంటారు. ఎక్కువ జీతం అడిగితే ఉద్యోగం ఇవ్వరేమో అని భయపడుతుంటారు. కానీ సాలరీ ప్యాకేజ్ విషయంలో ఎలాంటి మొహమాటాలు, భయాలు పెట్టుకోకూడదు. మీ సామర్థ్యానికి, అర్హతకు తగిన విధంగా మంచి జీతం, అదనపు ప్రయోజనాలు పొందే హక్కు మీకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ ఆర్టికల్‌లో జీతభత్యాల గురించి చర్చించేందుకు అవసరమైన టాప్‌-10 ఎక్స్‌పర్ట్‌ టిప్స్‌ మీకు అందిస్తున్నాం.

  1. రీసెర్చ్ చేయండి :మీరు జీతభత్యాల గురించి చర్చించే ముందు, కచ్చితంగా బాగా ప్రిపేర్ కావాలి. మీరు అప్లై చేసిన జాబ్‌ పొజిషన్‌కు ప్రస్తుతం మార్కెట్లో ఏ మేరకు జీతభత్యాలు అందిస్తున్నారో తెలుసుకోండి. మీరు ఉన్న లొకేషన్‌, ఇండస్ట్రీ, కంపెనీ సైజు, మీకు ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ కూడా సాలరీ ప్యాకేజ్‌ను ప్రభావితం చేస్తాయని గుర్తుంచుకోండి. గ్లాస్‌ డోర్‌, పేస్కేల్‌, లింక్డ్‌ఇన్‌ లాంటి వెబ్‌సైట్ల ద్వారా మీరు అప్లై చేసిన జాబ్‌కు ఏ మేరకు జీతభత్యాలు ఇస్తున్నారో తెలుసుకోండి.
  2. సాలరీ రేంజ్‌ గురించి మాత్రమే చెప్పండి : సాలరీ విషయంలో మీరు ఎగ్జాట్‌ ఫిగర్ చెప్పకూడదు. మీరు ఆశిస్తున్న సాలరీ రేంజ్‌ గురించి మాత్రమే చెప్పండి. అప్పుడే కంపెనీ మీ గురించి మరింతగా ఆలోచించడానికి, మీకు తగిన జీతభత్యాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు చెప్పే లోవర్ రేంజ్ సాలరీ కూడా మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చేదిగా ఉండాలి. అలా కాకుండా మీకు ఎంత జీతం కావాలో ఎగ్జాట్‌గా చెప్పారనుకోండి. కంపెనీ అంత ఇవ్వలేకపోతే, మీ ఉద్యోగ అవకాశం చేజారిపోయే ప్రమాదం ఉంటుంది.
  3. మీ విలువ ఎంతో మీరే తెలుసుకోండి :మీ సామర్థ్యాన్ని, మీ విలువను మీరే తెలుసుకోవాలి. మీ వల్ల కంపెనీకి ఏ విధంగా లాభం చేకూరుతుందో ఎంప్లాయర్‌కు చెప్పాలి. మీకు ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాలు (స్కిల్స్‌), మీరు సాధించిన విజయాలు, మీ అనుభవాల గురించి స్పష్టంగా చెప్పండి. అప్పుడే మీ సామర్థ్యం, విలువ గురించి కంపెనీకి తెలుస్తుంది. మీరు కోరుకున్న సాలరీ ప్యాకేజ్ మీకు అందుతుంది.
  4. సరైన టైమ్‌లో డిస్కస్‌ చేయాలి :జీతభత్యాలు గురించి సరైన సమయంలో మాత్రమే డిస్కస్‌ చేయాలి. సాధారణంగా కంపెనీ మీకు జాబ్ ఆఫర్ ఇచ్చిన తరువాత మాత్రమే సాలరీ ప్యాకేజ్ గురించి చర్చించడం మంచిది. ఎందుకంటే, కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చిందంటే, మీ పట్ల వారికి సదభిప్రాయం ఉన్నట్లే లెక్క. కనుక మీరు మంచి ప్యాకేజ్‌ పొందడానికి వీలుంటుంది.
  5. ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మాట్లాడండి : ఇంటర్వ్యూలో మీరు ఆత్మవిశ్వాసంతో, మర్యాదపూర్వకంగా, ప్రొఫెషనల్‌గా మాట్లాడాలి. మీ నైపుణ్యాలతో, పని సామర్థ్యంలో కంపెనీకి ఏ విధంగా సేవలు అందించగలరో చెప్పండి. అప్పుడే మీపై ఇంటర్వ్యూ చేసేవారికి మంచి ఇంప్రెషన్‌ కలుగుతుంది. మీకు మంచి ప్యాకేజ్ ఇచ్చే అవకాశం పెరుగుతుంది.
  6. అదనపు ప్రయోజనాలు గురించి కూడా మాట్లాడండి :కొత్తగా జాబ్‌ ఇంటర్వ్యూకు వెళ్లేవారు కేవలం జీతం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అయితే దీనితో పాటు పనివేళలు, బోనస్‌లు, సెలవులు, హెల్త్ ఇన్సూరెన్స్‌, రిటైర్‌మెంట్ ప్లాన్స్‌, ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఆపర్చూనిటీస్‌ లాంటి అదనపు బెనిఫిట్స్‌ గురించి కూడా కచ్చితంగా చర్చించాలి. ఒక్కోసారి కంపెనీలు మీరు కోరినంత జీతం ఇవ్వకపోవచ్చు. కానీ దానికి బదులుగా అదనపు ప్రయోజనాలు అందిస్తామని చెప్పవచ్చు. ఈ విషయాన్ని మీరు కచ్చితంగా గుర్తించుకోవాలి.
  7. చెప్పేది శ్రద్ధగా వినండి :సాలరీ గురించి చర్చించేటప్పుడు, ఎంప్లాయర్ చెప్పే విషయాలను చాలా శ్రద్ధగా వినాలి. అప్పుడే కంపెనీ లిమిటేషన్స్‌ గురించి, వారు ఇచ్చే ఆఫర్ గురించి మీకు బాగా అర్థమవుతుంది. కంపెనీ మీరు అడిగిన జీతం ఇవ్వలేకపోతే, అదనపు ప్రయోజనాలు (పెర్క్స్‌) అందిస్తామని కూడా చెప్పవచ్చు. మీరు మాత్రం స్ట్రిక్ట్‌గా ఉండకుండా, కాస్త ఫ్లెక్సిబుల్‌గా ఉండడమే మంచిది.
  8. ప్రొఫెషనల్‌గా, మర్యాదపూర్వకంగా నడుచుకోండి : కంపెనీ మీరు కోరినంత జీతం, అదనపు ప్రయోజనాలు అందించకపోయినా, మీరు మాత్రం ప్రొఫెషనల్‌గా, మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. దీని వల్ల మీపై ఎంప్లాయర్‌కు మంచి ఇంప్రెషన్‌ ఏర్పడుతుంది. ఇప్పుడు కాకపోయినా, భవిష్యత్‌లో సదరు కంపెనీలో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అల్టిమేటమ్‌లు జారీ చేయడం, విసుగు ప్రదర్శించడం, ర్యాష్‌గా బిహేవ్ చేయడం లాంటివి చేయకండి.
  9. సమయం తీసుకోండి :జీతభత్యాల విషయంలో మీరు సంతృప్తి చెందకపోతే, ఆలోచించుకోవడానికి కాస్త సమయం అడిగి తీసుకోండి. ఒకటి లేదా రెండు రోజుల్లో ఏ విషయమైనా ఆలోచించి చెబుతాను అని చెప్పండి. ఇందులో ఎలాంటి తప్పు లేదు. పైగా దీని వల్ల మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది.
  10. అన్నింటికీ సిద్ధంగా ఉండండి : కొన్నిసార్లు కంపెనీలు మీరు కోరుకున్నంత సాలరీ ఇవ్వవు. ముందుగా చెప్పిన జీతభత్యాలు మాత్రమే ఇస్తామని తేల్చిచెబుతుంటాయి. అలాంటప్పుడు కూడా మీరు ప్రొఫెషనల్‌గా నడుచుకోవాలి. మీకు నచ్చికపోతే, మర్యాదపూర్వకంగా ఆ జాబ్‌ ఆఫర్‌ను తిరస్కరించవచ్చు.

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సరైన ప్రిపరేషన్‌తో, స్ట్రాటజీతో, ఆత్మవిశ్వాసంతో మీరు ప్రయత్నిస్తే కచ్చితంగా మీ సామర్థ్యానికి, అర్హతకు తగిన జీతభత్యాలు లభిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details