How To Increase Credit Score : సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సులభంగా రుణాలు మంజూరు అవుతాయి. అలాగే వడ్డీరేటు కూడా దీని ఆధారంగానే విధిస్తాయి బ్యాంకులు. అయితే సకాలంలో చెల్లింపులు అనేది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లిస్తే సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉండదు. సాధారణంగా సిబిల్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. సగటున 750కిపైన ఈ స్కోర్ ఉంటే లోన్స్ తొందరగా లభిస్తాయి. మంచి క్రెడిట్ స్కోర్ కోసం క్రెడిట్ కార్డుల సంఖ్య ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈమధ్య కాలంలో లోన్స్ తీసుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బ్యాంకర్లు కూడా ఎక్కువగా నిబంధనలు పెట్టుకుండానే లోన్స్ మంజూరు చేయడం వల్ల అందరూ వీటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెట్టుబడిదారుడి ఆర్థిక అలవాట్లు, బాధ్యతలు, క్రెడిట్ మెయింటెనెన్స్ ఆధారంగా ఇది మారే అవకాశం ఉంటుంది.
సాధారణంగా క్రెడిట్ కార్డులతో సహా పలు రకాల క్రెడిట్ అకౌంట్స్ ద్వారా లోన్లు తీసుకుంటే వాటిని సకాలంలో చెల్లించినట్లయితే క్రెడిట్ స్కోర్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపకుండా ఉంటుంది. అయితే చాలామంది ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను తీసుకుంటారు. ఇలా చేస్తే మీ ఖాతాపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు చెల్లింపులను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.
ఉదాహారణకు ఒక వ్యక్తి జనవరి 2024లో రూ.10లక్షలతో క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు మరో క్రెడిట్ కార్డును ఉపయోగించలేదు. ఈ కార్డును వాడిన తర్వాత దాని గరిష్ట పరిమితిని పెంచుకునేందుకు మరోసారి బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే క్రెడిట్ కార్డు స్కోర్ పెంచుకునేందుకు పెట్టుబడిదారులు తప్పనిసరిగా కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి.
పేమెంట్ హిస్టరీ
క్రెడిట్ కార్డుపై రుణాలు సకాలంలో చెల్లించడం అనేది మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేసే కీలకమైన అంశాల్లో ఒకటి. మీరు క్రెడిట్ కార్డును బాధ్యతాయుతంగా సకాలంలో చెల్లిస్తే అది మీ పేమెంట్ హిస్టరీపై సానుకూలంగా ఉంటుంది.
క్రెడిట్ యుటిలైజేషన్
ఇది మీ క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్‌ల నిష్పత్తి, మీ క్రెడిట్ లిమిట్స్‌ను సూచిస్తుంది. మంచి క్రెడిట్ స్కోర్‌ను మెయింటెన్ చేయడానికి మీ క్రెడిట్ వినియోగాన్ని తక్కువగా (అంటే 30% కంటే తక్కువ) ఉంచడం ముఖ్యం. ఎక్కువ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించడం వల్ల మీ బ్యాలెన్స్ తక్కువగా వినియోగించడంలో సహాయపడుతుంది.