తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా! - International Driving Licence - INTERNATIONAL DRIVING LICENCE

How To Get International Driving Licence : మీరు విదేశాలకు తరచూ వెళ్తుంటారా? అక్కడ టూ-వీలర్​, ఫోర్​-వీలర్స్ నడపాలని ఆశపడుతుంటారా? అయితే ఇది మీ కోసమే. విదేశాల్లో కూడా హాయిగా బైక్స్​, కార్స్ నడిపేందుకు కావాల్సిన ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్​ లేదా ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ పర్మిట్​ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To APPLY FOR International Driving Licence
How To Get International Driving Licence (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 3, 2024, 4:54 PM IST

How To Get International Driving Licence :మీరు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్తున్నారా? ఫారిన్​లో ఉన్న అందమైన ప్రదేశాలను సొంతంగా కారు డ్రైవ్​ చేస్తూ చూడాలని అనుకుంటున్నారా? అయితే మీకు తప్పనిసరిగా ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే.

మీకు ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, విదేశాల్లో కూడా కారును అద్దెకు తీసుకుని ఫ్యామిలీతో కలిసి, మీకు నచ్చిన ప్రదేశాలను చుట్టిరావచ్చు. అంతేకాదు ఇది విదేశాల్లో మీకు ఒక గుర్తింపు కార్డుగానూ పనిచేస్తుంది. మరెందుకు ఆలస్యం ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఫీజు ఎంత ఉంటుంది? తదితర పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

How To Apply For International Driving Licence?
ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్​ కోసం అప్లై చేయాలంటే, మీకు స్వదేశంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా ఉండాలి. అలాగే కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. అయితే ఈ కనీస వయస్సు అనేది వివిధ దేశాలను బట్టి మారుతూ ఉంటుంది.

parivaahan.gov.in వెబ్​సైట్​ ప్రకారం, ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ లైసెన్స్ కావాలని అనుకునేవారు, తాము ఉంటున్న ఏరియాలోని ఆర్​టీఓ కార్యాలయానికి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • ప్రభుత్వ వెబ్​సైట్​ parivaahan.gov.in నుంచి ఫారం-4Aను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • లేదా ఆర్​టీఓ ఆఫీస్ నుంచి ఫారమ్​-4Aను తీసుకోవాలి.
  • ఈ ఫారమ్​-4Aలో మీ వివరాలు నమోదు చేసి, దానికి మీ డ్రైవింగ్ లైసెన్స్ కాపీని జత చేయాలి.
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి ఫారం-1ఏ కింద చెల్లుబాటు అయ్యే మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
  • మీ పాస్​పోర్ట్, వీసా కాపీలను, ఫ్లైట్ టికెట్​లను కూడా జతచేయాలి.
  • నాలుగు పాస్​పోర్ట్ సైజు ఫొటోలను అప్లికేషన్​కు జత చేయాలి.
  • అలాగే అప్లికేషన్ ఫీజుగా రూ.1000 చెల్లించాలి.

ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వల్ల కలిగే లాభాలు
అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్​ ఓ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. కావాలంటే, తరువాత దానిని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏమిటంటే?

  • విదేశాల్లో మీకు ఒక గుర్తింపు కార్డుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్​ పనిచేస్తుంది.
  • విదేశాల్లో కారును అద్దెకు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని వల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి.
  • (విదేశాల్లో కారును అద్దెకు ఇచ్చే పలు ఏజెన్సీలు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్​ను​ తప్పనిసరి చేశాయి.)
  • విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడానికి కూడా ఈ ఇంటర్నేషనల్​ డ్రైవింగ్ పర్మిట్​ అవసరం అవుతుంది.

మీరు కాస్త పొట్టిగా ఉంటారా? మీకు సూట్​ అయ్యే టాప్​-10 బైక్స్ ఇవే! - Best Low Seat Height Bikes

మంచి జీప్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే - కొండలు, వాగుల్లోనూ రయ్​మని దూసుకుపోవచ్చు! - Best Jeeps In India

ABOUT THE AUTHOR

...view details