తెలంగాణ

telangana

ETV Bharat / business

ఐటీ​ రీఫండ్ స్టేటస్​ - ఆన్​లైన్​లో ఈజీగా చెక్ చేసుకోండిలా! - Income Tax Refund Status Check

How To Check Income Tax Refund Status Online : ఐటీ రిటర్నులు ఫైల్ చేశారా? రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. ఈజీగా ఆన్​లైన్​లో ఐటీ రీఫండ్ స్టేటస్​ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Income Tax Refund
How To Check Income Tax Refund Status Online (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 5:22 PM IST

How To Check Income Tax Refund Status Online : మీరు ఐటీఆర్​ దాఖలు చేసి రీఫండ్​ డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా? మీ రీఫండ్​ స్టేటస్​ ఎలా చెక్​ చేసుకోవాలో తెలియడం లేదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చాలా సులువుగా ఆన్​లైన్​లో మీ ఐటీఆర్ రీఫండ్ స్టేటస్​ను​ ఇలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఆన్​లైన్​​లో ఐటీ రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోండిలా!

  • ముందుగా మీరు ఆదాయ పన్ను శాఖ అధికారిక వెబ్​సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయాలి.
  • మీ యూజర్ ఐడీ (పాన్​ కార్డు నంబర్), పాస్​​వర్డ్​, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత 'వ్యూ రిటర్న్స్​ అండ్​ ఫార్మ్స్​'పై క్లిక్​ చేయాలి.
  • డ్రాప్​డౌన్​ మెనూలోని 'ఇన్​కమ్​ ట్యాక్స్​ రిటర్న్స్​' ఆప్షన్​ను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • అనంతరం మీ ఐటీఆర్​​కు సంబంధించిన 'అసెస్​మెంట్​ ఇయర్​'ను ఎంటర్​ చేసి సబ్​​మిట్​ బటన్ నొక్కాలి.
  • తరువాత 'ITR Acknowledgment Number'పై క్లిక్​ చేయాలి.
  • ఇందులో మీ ఐటీఆర్ రీఫండ్​ స్టేటస్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. అంతే సింపుల్!

మీ ఐటీఆర్​ను వెరిఫై చేయడం ఎలా?
మీరు దఖలు చేసిన ఐటీఆర్​ను కచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. లేదంటే మీఐటీఆర్ ఫైలింగ్ అసంపూర్తిగా ఉండిపోతుంది. దీని వల్ల మీ ఐటీఆర్​ చెల్లకుండా పోతుంది.

ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్​ చేసుకోవడం ఎలా?
ITR E-Verification Process :

  • ముందుగా ఆదాయపన్ను శాఖకు చెందిన e-filing పోర్టల్​ను ఓపెన్ చేయాలి.
  • పోర్టల్​లో e-verify return లింక్​పై క్లిక్ చేయాలి.
  • పాన్​ నంబర్​, అసెస్మెంట్​ ఇయర్ (2023-24)​, రసీదు సంఖ్యను నమోదు చేయాలి. లేదా
  • దీనికి ప్రత్యామ్నాయంగా పోర్టల్​లో మీ పాన్​, పాస్​వర్డ్​తో లాగిన్ కావాలి.
  • పోర్టల్​లోని My Account సెక్షన్​లోకి వెళ్లి, e-verify return ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • దీనితో ఓ సరికొత్త వెరిఫికేషన్​ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్పుడు మీరు ఆధార్​ ఓటీపీ ఎంటర్​ చేసి ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేయవలసి ఉంటుంది.
  • ఇందు కోసం మీ రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేసి, ఐటీఆర్ ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేయాలి.
  • ఐటీఆర్​ ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు మరో మార్గం కూడా ఉంది.
  • మీరు నేరుగా నెట్​ బ్యాంకింగ్ పోర్టల్​కు వెళ్లి, ఐటీఆర్​ సెగ్మెంట్​లో ఈ-వెరిఫికేషన్​ పూర్తి చేసుకోవచ్చు.

ఐటీఆర్ రీఫండ్ ఆలస్యం కావడానికి గల కారణాలను తెలుసుకోవడం ఎలా?
మీ ఐటీ రిఫండ్ ఆలస్యం కావడానికి పలు కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా మీరు ఫైల్ చేసినఐటీఆర్​లో బ్యాంక్ అకౌంట్ వివరాలు లేదా ఇతర వివరాలు తప్పుగా లేదా అసంపూర్తిగా ఉంటే, రీఫండ్ రాకపోవచ్చు. అందుకే మీరు ఐటీఆర్ ఫైల్​ చేసేటప్పుడు, మీ బ్యాంకు అకౌంట్ నంబరు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి.

టీడీఎస్
ఫారమ్ 26ఏఎస్​లో టీడీఎస్​ క్లెయిమ్ వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ టీడీఎస్ వివరాల్లో తేడాలు ఉంటే, ఐటీ రీఫండ్ ఆలస్యం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అదనపు డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. ఈ పత్రాలు ఇవ్వకపోయినా ఐటీ రిఫండ్ ఆలస్యం కావొచ్చు.

ఒకవేళ మీ ఐటీ రీఫండ్ స్టేటస్​లో 'నో రికార్డ్స్ ఫౌండ్' అని చూపిస్తే, మీ ఈ-ఫైలింగ్ ప్రాసెసింగ్ స్టేటస్​ను చెక్ చేసుకోవాలి. ఇందుకోసం ఈ-ఫైల్ > ఇన్​కమ్ ట్యాక్స్ రిటర్న్స్ > వ్యూ ఫైల్డ్ రిటర్న్స్ ఎంచుకోవాలి. మీ బ్యాంకు అకౌంట్​ వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే, వాటిని సరిచేసుకోవాలి.

అలర్ట్ - ఆధార్​తో పాన్ లింక్ చేసుకున్నారా? నేటి వరకే అవకాశం​ - లేకుంటే రెట్టింపు TDS కట్​! - Aadhaar PAN Link

బీ అలర్ట్ - జూన్​ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే - త్వరగా ఆ పనులు పూర్తి చేయండి! - Rules Changing From June 1

ABOUT THE AUTHOR

...view details