తెలంగాణ

telangana

ETV Bharat / business

డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? ఆన్​లైన్ & ఆఫ్​లైన్ విధానాల్లో అప్లై చేసుకోండిలా! - DrivingLicense apply offlineprocess

How To Apply For A Driving Licence : మీరు కొత్తగా బైక్ లేదా కారు డ్రైవింగ్ నేర్చుకున్నారా? డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్​, ఆఫ్​లైన్ విధానాల్లో డ్రైవింగ్​ లైసెన్స్ కోసం ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How to Apply for a Driving Licence Offline
How to Apply for a Driving Licence Online

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 3:48 PM IST

How To Apply For A Driving Licence :మనం బండి నడపాలంటే, కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్​ తీసుకోవాలి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండితో బయటకు వెళితే, ట్రాఫిక్ పోలీసులకు చిక్కే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసే వారి మీద చలాన్లతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రమాదాలు సంభవించినప్పుడు అరెస్టులు చేయడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ డ్రైవింగ్ లైసెన్స్‎ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్ విధానాల్లో అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‎లైన్‎లో అప్లై చేసే విధానం :

  • డ్రైవింగ్ లైసెన్స్ కోసం 'పరివహన్ సేవ' అధికారిక వెబ్​సైట్​ (https://parivahan.gov.in/parivahan/) ఓపెన్ చేయాలి.
  • అక్కడ ‘ఆన్‎లైన్ సర్వీసెస్’లో ఉన్న 'లైసెన్స్​ రిలేటెడ్ సర్వీసెస్' పైన క్లిక్ చేయాలి.
  • తర్వాత 'డ్రైవర్స్ / లెర్నర్స్ లైసెన్స్'ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • రాష్ట్రాల జాబితాలోని మీ రాష్ట్రాన్ని ఎంచుకోవాలి.
  • 'అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్' పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​లో అవసరమైన మీ వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
  • అందుబాటులో ఉన్న ఆన్​లైన్​ పేమెంట్ ఆప్షన్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్​ను సబ్మిట్ చేసిన తర్వాత, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం స్లాట్​ బుక్​ చేసుకోవాలి.
  • నిర్ణీత తేదీలో సంబంధిత ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలో పాల్గొనాలి.
  • మీరు టెస్ట్‎లో పాసైతే మీ డ్రైవింగ్ లైసెన్స్ జనరేట్ అవుతుంది.
  • ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ మెయిల్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్‎కు వచ్చేస్తుంది.
  • మీరు కావాలనుకుంటే, ఆన్‎లైన్‎లో కూడా డ్రైవింగ్ లైసెన్స్​ను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫ్​లైన్​లో అప్లై చేసే విధానం :

  • మీ రాష్ట్ర రవాణా శాఖ వెబ్​సైట్​ నుంచి ఫారం 4ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • లేదా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఫారం 4ను తీసుకోవాలి.
  • డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫారాన్ని జాగ్రత్తగా నింపాలి.
  • డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఆర్టీఓ ద్వారా డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్​మెంట్​ తీసుకోవాలి.
  • నిర్ణీత తేదీలో నిర్దేశిత ఆర్టీవోలో డ్రైవింగ్ టెస్ట్​కు హాజరు కావాలి.
  • మీరు టెస్ట్‎లో పాసైతే మీ డ్రైవింగ్ లైసెన్స్ జనరేట్ అవుతుంది.
  • ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ మెయిల్ ద్వారా మీ రిజిస్టర్డ్ అడ్రస్‎కు వచ్చేస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి కావాల్సిన అర్హతలు

  • డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే, కచ్చితంగా వ్యాలీడ్​ లెర్నర్స్ పర్మిట్​ ఉండాలి. దీని వల్ల మీరు అవసరమైన శిక్షణ పొందారని, ప్రాథమిక డ్రైవింగ్ పరిజ్ఞానం మీకు ఉందని తెలుస్తుంది.
  • ప్రైవేట్ వాహన లైసెన్స్ కోసం 18 సంవత్సరాలు, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ కోసం 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి.
  • దరఖాస్తుదారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు గుర్తులు, ఇతర ముఖ్యమైన అంశాలపైన అవగాహన ఉండాలి.
  • లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల్లోగా పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్ ఇవే!​ ఫీచర్స్​ అదుర్స్​ - ధర ఎంతో తెలుసా?

కార్ ఇన్సూరెన్స్​ను ఫ్యామిలీ మెంబర్​కు ట్రాన్స్​ఫర్ చేయాలా? ఈ విషయాలు తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details