తెలంగాణ

telangana

ETV Bharat / business

'వడ్డికాసుల' వాడికి ఏటా రూ.1600 కోట్ల వడ్డీ ఆదాయం - ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో? - Highest Earning Temple - HIGHEST EARNING TEMPLE

Highest Earning Temple In India : ఏటా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఫిక్స్​డ్ డిపాజిట్ల ద్వారా వడ్డీయే రూ.1600 కోట్ల ఆదాయం వస్తుందట. ఈ క్రమంలో పలు బ్యాంకుల్లో ఇప్పటివరకు టీటీడీ ఎంత ఫిక్స్​డ్ డిపాజిట్ చేసింది? టీటీడీ వద్ద బంగారం డిపాజిట్లు ఎంత ఉన్నాయో తెలుసుకుందాం.

Highest Earning Temple In India
Highest Earning Temple In India

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 5:24 PM IST

Highest Earning Temple In India :ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఏడాదికి రూ.1,600 కోట్ల మేర వడ్డీ వస్తుంది. ఫిక్స్​డ్ డిపాజిట్లకు వడ్డీలే ఇంత భారీ మొత్తంలో దేవాలయానికి వస్తున్నాయి. ఈ క్రమంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఇప్పటివరకు ఎంత మేర ఫిక్స్​డ్ డిపాజిట్లను చేసింది? ఏ బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేసిందో ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది(2024) అత్యధికంగా రూ.1,161 కోట్లను ఫిక్స్​డ్ డిపాజిట్ చేసింది. దేవస్థానం బలమైన ఆర్థిక నిర్వహణ వల్ల ఈ ఏడాది డిపాజిట్లు గత సంవత్సరాలతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. భారత్​లో గత 12 సంవత్సరాలుగా ఏటా రూ.500 కోట్లు కంటే ఎక్కువ డిపాజిట్లు చేస్తున్న హిందూ ధార్మిక సంస్థల్లో టీటీడీ ఒకటి. టీటీడీ 2013 నుంచి 2024 మధ్య రూ.8,467 కోట్లు ఫిక్స్​డ్ డిపాజిట్​లు చేసి బలమైన ఆర్థిక పథాన్ని కొనసాగించింది. 2013లో రూ.608 కోట్లు, 2024లో రికార్డు స్థాయిలో రూ.1,161 కోట్లు ఎఫ్​డీ చేసింది.

కొవిడ్ ప్రభావం
కొవిడ్ మహమ్మారి సమయంలో టీటీడీ సైతం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. 2021, 2022లో దేవస్థానానికి ఆదాయం తగ్గింది. దీంతో టీటీడీ ఫిక్స్​డ్ డిపాజిట్లు ఆశించిన మేర చేయలేకపోయింది. మళ్లీ పుంజుకుని ఈ ఏడాది రూ.1,161 కోట్ల ఎఫ్​డీలను చేసింది.

Tirumala Tirupati Diverse Trust Funds :శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నప్రసాదం, శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్​లకు కూడా భారీ స్థాయిలో భక్తుల నుంచి నిధులు అందుతూ ఉంటాయి. ఈ ట్రస్టులు మొత్తంగా రూ.5,529 కోట్ల నిధులను సేకరించాయి.

రికార్డు స్థాయిలో నగదు నిల్వలు, బంగారం డిపాజిట్లు
Tirumala Tirupati Gold Deposits :2024 ఏప్రిల్ నాటికి బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్​డ్ డిపాజిట్లు రూ.18,817 కోట్లకు చేరుకున్నాయి. ఇదే టీటీడీ చరిత్రలో అత్యధిక మొత్తం. టీటీడీ బంగారం డిపాజిట్లు 11,329 కిలోలకు పెరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఫిక్స్​డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో ఏటా రూ.1,600 కోట్లు సంపాదిస్తోంది.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వివాదాలు - ఆజ్యం పోస్తున్న బోర్డు

తిరుమల శ్రీవారికి విజయనగరం పంట ఉత్పత్తులు

ABOUT THE AUTHOR

...view details