Google Pay SoundPod To Launch In India : టెక్ దిగ్గజం గూగుల్ త్వరలో భారతదేశంలో సౌండ్పాడ్ డివైజ్‌ను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది వ్యాపారులకు చాలా బాగా ఉపయోగపడుతుందని పేర్కొంది. దీని ద్వారా క్యూఆర్ కోడ్ పేమెంట్స్ చాలా సులువుగా చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
Google Pay SoundPod Pilot Project :వాస్తవానికి గూగుల్ కంపెనీ గత ఏడాదే ఈ సౌండ్పాడ్ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చింది. దీనికి వ్యాపారుల నుంచి మంచి స్పందన వచ్చింది. అందుకే త్వరలో దీనిని భారత్‌లో ఆఫీషియల్‌గా లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రానున్న నెలల్లో భారతదేశమంతటా దీనిని క్రమంగా అందుబాటులోకి తెస్తామని కూడా ప్రకటించింది.
గూగుల్ కంపెనీ భారతదేశంలో డిజిటల్ పేమెంట్ ల్యాండ్‌స్కేప్‌ను పెంచడానికి, సులభంగా సురక్షిత లావాదేవీలు నిర్వహించడానికి కృషి చేస్తుందని, గతంలోనే గూగుల్ పే ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ అంబరీష్ కెంఘే చెప్పడం గమనార్హం.
Google Pay SoundPod Features :
- పేమెంట్ ప్రాసెస్ :కస్టమర్లు గూగుల్ పే ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. సింపుల్‌గా పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది.
- ఆడియో పేమెంట్ ట్రాకింగ్ :కస్టమర్లు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్ చేసిన వెంటనే, ఈ గూగుల్ సౌండ్పాడ్ ఆ విషయాన్ని ఆడియో ద్వారా వ్యాపారులకు తెలియజేస్తుంది. కనుక వ్యాపారులు ప్రతీసారి తమ గూగుల్ పే అకౌంట్లోకి వెళ్లి, పేమెంట్స్ గురించి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.