Gold Rate Today November 7th 2024 :దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,990గా ఉండగా, గురువారం నాటికి రూ.2,030 తగ్గి రూ.78,960గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.97,040గా ఉండగా, గురువారం నాటికి రూ.4,025 తగ్గి రూ.93,015గా ఉంది.
- Gold Price In Hyderabad November 7th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,960గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
- Gold Price In Vijayawada November 7th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,960గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 7th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,960గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015ఉంది.
- Gold Price In Proddatur November 7th 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,960గా ఉంది. కిలో వెండి ధర రూ.93,015గా ఉంది.
గమనిక :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 7 th2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2740 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 81 డాలర్లు తగ్గి 2659 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.07 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 7th 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడం వల్ల బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో దూసుకెళ్లిన సూచీలు గురువారం నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధాన స్టాక్‌లలో మదుపర్లు విక్రయాలకు దిగడం వల్ల సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 375 పాయింట్లు కుంగి 80,003 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లు తగ్గి 24,353 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్- టీసీఎస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా
- నష్టాల్లో ఉన్న స్టాక్స్- బజాజ్ ఫిన్‌సర్వ్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, నెస్లే ఇండియా, ఎస్‌బీఐ, ఎం అండ్ ఎం, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్.
రూపాయి విలువ
Rupee Open November 7th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.26గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 7th : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.