తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు- హైదరాబాద్​, విజయవాడలో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today February 22nd 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today February 22nd 2024
Gold Rate Today February 22nd 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 9:52 AM IST

Updated : Feb 22, 2024, 10:05 AM IST

Gold Rate Today February 22nd 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,087 ఉండగా, గురువారం నాటికి రూ.318 పెరిగి రూ.64,405కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.73,074 ఉండగా, గురువారం నాటికి రూ.744 తగ్గి రూ.72,330కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 22nd 2024 :హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
  • Gold Price In Vijayawada February 22nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 22nd 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.
  • Gold Price In Proddatur February 22nd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,405గా ఉంది. కిలో వెండి ధర రూ.72,330గా ఉంది.

గమనిక​ :పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 22nd 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో మాత్రం గోల్డ్​ రేట్లు స్వల్పంగా తగ్గాయి. బుధవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2030 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 4 డాలర్లు తగ్గి 2026 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.92 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 22nd 2024 :గురువారం టెథర్​, బైనాన్స్ కాయిన్​, యూఎస్​డీ కాయిన్​ మినహా మిగతా ప్రధాన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.42,61,714
ఇథీరియం రూ.2,36,600
టెథర్ రూ.82.89
బైనాన్స్ కాయిన్ రూ.31,038
యూఎస్​డీ కాయిన్ రూ.82.92

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 22nd 2024 : గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 11.85 పాయింట్లు నష్టపోయి 72,611 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 4.90 పాయింట్లు క్షీణించి 22,050 వద్ద కొనసాగుతోంది.

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : యాక్సిస్​ బ్యాంక్, విప్రో, టీసీఎస్​, టాటా స్టీల్​, ఐటీసీ, మారుతీ, ఎం అండ్​ ఎం, సన్​ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్​, ఎల్​ అండ్​ టీ, టాటా మోటార్స్

నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టైటాన్​, నెస్లే ఇండియా, ఇండస్​ఇండ్ బ్యాంక్​, రిలయన్స్, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, హెచ్​డీఎఫ్​సీ, కోటక్​ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్​

రూపాయి విలువ
Rupee Open February 22nd 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 4 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.92గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 22nd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.78గా ఉంది. డీజిల్​ ధర రూ.98.27గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices February 22nd 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 83.14 డాలర్లుగా ఉంది.

హెల్త్​ ఇన్సూరెన్స్​ పోర్టింగ్​ రిక్వెస్ట్​ రిజెక్ట్​ అయిందా? అసలు కారణాలు ఇవే!

మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ 8 లాభాలు గురించి తెలుసుకోండి!

Last Updated : Feb 22, 2024, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details