తెలంగాణ

telangana

ETV Bharat / business

గుడ్ న్యూస్ - తగ్గిన గోల్డ్ & సిల్వర్‌ రేట్లు - ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - GOLD RATE TODAY

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 12 hours ago

Updated : 12 hours ago

Gold Rate Today December 20th 2024 : దేశంలో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.78,000 ఉండగా, శుక్రవారం నాటికి రూ.264 తగ్గి రూ.77,736కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.89,130 ఉండగా, శుక్రవారం నాటికి రూ.1,404 తగ్గి రూ.87,726కు చేరింది.

  • Gold Price In Hyderabad December 20th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.77,736గా ఉంది. కిలో వెండి ధర రూ.87,726గా ఉంది.
  • Gold Price In Vijayawada December 20th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,736గా ఉంది. కిలో వెండి ధర రూ.87,726గా ఉంది.
  • Gold Price In Visakhapatnam December 20th 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,736గా ఉంది. కిలో వెండి ధర రూ.87,736గా ఉంది.
  • Gold Price In Proddatur December 20th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,736గా ఉంది. కిలో వెండి ధర రూ.87,736గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price December 20th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. గురువారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,611 డాలర్లగా ఉండగా, శుక్రవారం నాటికి 13 డాలర్లు తగ్గి 2,598 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 28.90 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 20th 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్ల ప్రకటనకు ముందు మదుపర్లు అప్రమత్తంగా ఉండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 79,066 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 23,928 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఏసియన్ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, టాటా మోటార్స్‌, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, మారుతి సుజుకి, రిలయన్స్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : యాక్సిస్ బ్యాంక్‌, ఎల్‌ అండ్ టీ, ఆల్ట్రాటెక్ సిమెంట్‌, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌, ఎస్‌బీఐ

రూపాయి విలువ
Rupee Value December 20th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 6 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.85.07 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices December 20th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices December 20th 2024 :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.69 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 72.38 డాలర్లుగా ఉంది.

Last Updated : 12 hours ago

ABOUT THE AUTHOR

...view details