Reasons Why Credit Card Application Rejected : ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక అవసరాలరీత్యా క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అలాగే మరికొందరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటారు. అయితే రుణ గ్రహీతలకు రుణ సంస్థలు క్రెడిట్ కార్డు, లోన్ ఇచ్చేముందు పలు విషయాలను పరిగణలోకి తీసుకుంటాయి. వీటి ఆధారంగానే లోన్లు, క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తాయి. అందుకే రుణదాతలు లోన్, క్రెడిట్ కార్డు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యేందుకు అవకాశం ఉన్న ముఖ్యమైన 8 కారణాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ తప్పులను చేయకపోతే ఈజీగాలోన్, క్రెడిట్ కార్డును పొందొచ్చు.
పేలవమైన క్రెడిట్ హిస్టరీ
క్రెడిట్ కార్డ్, లోన్ ప్రొవైడర్లు మీ అప్లికేషన్ పై నిర్ణయం తీసుకునే ముందు మీ క్రెడిట్ హిస్టరీని చెక్ చేస్తాయి. మీరు గతంలో రుణాన్ని తీసుకుని తిరిగి సరిగ్గా చెల్లించకపోవడం, అలాగే సమయానికి లోన్లు, బిల్లులు కట్టకపోవడం వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటాయి. అలాగే క్రెడిట్ స్కోర్ ను కూడా పరిశీలించి లోన్లు, క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. అందుకే క్రెడిట్ స్కోర్ 750 పాయింట్లకు పైగా ఉంటేటట్లు చూసుకోవడం ముఖ్యం. ఏదేమైనప్పటికీ లోన్, క్రెడిట్ కార్డ్ మంజూరుపై తుది నిర్ణయం మాత్రం వాటిని జారీ చేసే బ్యాంకులదేననే విషయం మాత్రం గుర్తుంచుకోండి. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ తగ్గకుండా మెరుగ్గా ఉంటుంది. అలాగే తక్కువ వ్యవధిలో ఎక్కువ క్రెడిట్ కార్డులు, లోన్ల కోసం దరఖాస్తు చేసినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని గుర్తుపెట్టుకోండి.
వయసు కూడా ముఖ్యమే
లోన్, క్రెడిట్ కార్డు పొందేందుకు కనీస వయసు 18 ఏళ్లు. అయినప్పటికీ రుణదాతలు 18-21 మధ్య వయసున్నవారికి చెల్లబాటు అయ్యే ఆదాయం, అలాగే దరఖాస్తుపై సాక్షి సంతకం లేని పక్షంలో దాన్ని తిరస్కరిస్తాయి.
అస్థిర ఉద్యోగాలు
అలాగే క్రెడిట్ కార్డు, లోన్ జారీ చేసే సంస్థలు మీ ఉద్యోగాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాయి. ఉద్యోగులు తిరిగి రుణం చెల్లించే సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. 1-2 ఏళ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తే ఫర్వాలేదు. ప్రతి ఆరునెలకొకసారి ఉద్యోగాలు మారుతుంటే మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
తక్కువ ఆదాయం
క్రెడిట్ కార్డు, లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురికావడంలో మీ ఆదాయం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు కనీస బకాయి మొత్తాన్ని చెల్లించగలరో లేదో చెక్ చేస్తాయి. మీరు లోన్, క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్న బ్యాంకు నిర్ణయించిన కనీస ఆదాయ ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే మీ అప్లికేషన్ తిరస్కరణకు గురికావచ్చు.