తెలంగాణ

telangana

రిటైర్​మెంట్ ప్లాన్​ - ఈ టిప్స్​ పాటిస్తే 'ఎక్స్​ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 1:38 PM IST

EPFO Pension Rules : మీరు రిటైర్​మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారా? సాధారణంగా వచ్చే దానికంటే, కాస్త ఎక్కువ పెన్షన్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈపీఎఫ్​ఓ పెన్షన్​ రూల్స్​ ప్రకారం, అధిక పెన్షన్ పొందే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

What is Employees' Pension Scheme
EPFO Pension Rules

EPFO Pension Rules :ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం 'ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్'​ (EPS) అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఉద్యోగ విరమణ చేసిన తరువాత పెన్షన్ పొందవచ్చు. మీరు కోరుకుంటే ముందస్తుగానే పెన్షన్ పొందే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే కాస్త ఆలస్యంగానూ క్లెయిమ్ చేసుకుని, అధిక మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

10 ఏళ్ల సర్వీస్ మస్ట్​!
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు కనీసం 10 ఏళ్లపాటు సర్వీస్​ చేస్తేనే పెన్షన్ పొందడానికి అర్హులు అవుతారు. ఇలా 10 ఏళ్ల పాటు కంట్రిబ్యూట్ చేసిన ఉద్యోగులు, తమకు 58 ఏళ్లు వచ్చిన తరువాత పెన్షన్​ పొందగలుగుతారు. కానీ రిటైర్డ్ ఉద్యోగులు తమకు 58 ఏళ్లు వచ్చిన వెంటనే పెన్షన్ తీసుకోకుండా, 60 ఏళ్ల వరకు వేచి ఉంటే, వారికి ఏటా వచ్చే పెన్షన్​ 8 శాతం పెరుగుతుంది. అంటే మరింత ఆర్థిక భద్రత చేకూరుతుంది.

ముందస్తు పెన్షన్​ :ఉద్యోగులు కోరుకుంటే, తమకు 50 ఏళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచే పెన్షన్​ తీసుకోవచ్చు. అయితే ఈ ముందస్తు పెన్షన్​ ప్లాన్​ను ఎంచుకుంటే, మీకు వచ్చే పింఛన్​ బాగా తగ్గుతుంది. పైగా మీ ప్రాథమిక జీతం నుంచి 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని పీఎఫ్ కోసం కంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం కచ్చితంగా గుర్తించుకోవాలి. ఉద్యోగులు తమ వంతుగా 12 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని స్వచ్ఛందంగా చెల్లించినప్పటికీ, కంపెనీలు మాత్రం తమ వంతుగా 12 శాతం వరకే చెల్లిస్తాయి. నిబంధనల ప్రకారం, అంత కంటే ఎక్కువ మొత్తాన్ని కంపెనీలు లేదా యాజమాన్యాలు కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు.

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ( EPS ) :ఈపీఎఫ్​ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 8.33 శాతాన్ని 'ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్' (EPS) కోసం కేటాయిస్తారు. ఇది సదరు ఉద్యోగి పదవీ విరమణ చేసిన తరువాత, పెన్షన్ ప్రయోజనాలను అందిస్తుంది.

ప్రావిడెంట్ ఫండ్ (PF) :ఈపీఎఫ్​ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 3.67 శాతాన్ని ఈపీఎఫ్​కు మళ్లిస్తారు. ఇది ఉద్యోగి చేసిన పొదుపుగా (సేవింగ్స్​) ఉంటుంది.

EPF గరిష్ఠ వేతన పరిమితి పెంపు!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి రూ.15,000 ఉండగా, ఆ మొత్తాన్ని రూ.21,000లకు పెంచనుందనే ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే, తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.

వాస్తవానికి ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితిని చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో ఇది రూ.6,500 ఉండగా, ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) ఇప్పటికే వేతన పరిమితిని రూ.21 వేలకు చేర్చింది. ఈపీఎఫ్​ను కూడా అంతే మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

లాగిన్ కాకుండానే LIC ప్రీమియం చెల్లించాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - Pay LIC Premium Without Login

సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ - ఇకపై మీకూ హెల్త్ ఇన్సూరెన్స్ - 65ఏళ్లు దాటినా నో ప్రోబ్లమ్​! - Health Insurance

ABOUT THE AUTHOR

...view details