తెలంగాణ

telangana

స్టార్టప్ పెడుతున్నారా? ఫండింగ్ కోసం ఇన్వెస్టర్లను ఆకట్టుకోండిలా! - Startup Business

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2024, 5:12 PM IST

Startup Business : ప్రస్తుతం స్టార్టప్​ల యుగం నడుస్తోంది. మన దేశంలో గత పదేళ్లలో పెద్ద సంఖ్యలో స్టార్టప్​లు ఏర్పాటయ్యాయి. మరి మీరు కూడా స్టార్టప్ పెట్టాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. స్టార్టప్స్ కోసం ఫండింగ్ ఎలా సంపాదించాలి? ఇన్వెస్టర్లను ఎలా ఆకట్టుకోవాలి? అనే విషయాలను ఈ స్టోరీలో చూద్దాం.

Startup Business
Startup Business (Getty Images)

Startup Business :భారతదేశంలో స్టార్టప్​​​లకు మంచి అనుకూల వాతావరణం ఉంది. అందుకే స్టార్టప్​​లను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సైతం సహకరిస్తోంది. అయితే వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఫండింగ్ చాలా అవసరం. వ్యాపార అభివృద్ధి, వస్తు, సేవల తయారీ, అమ్మకాలు, వ్యాపార విస్తరణ, మార్కెటింగ్, కార్యాలయ స్థలాలు ఇలా చాలా అవసరాల కోసం స్టార్టప్​లకు ఫండింగ్ అవసరం అవుతుంది. చాలా స్టార్టప్​లు థర్డ్ పార్టీల నుంచి నిధులు సేకరించవు. ఆ స్టార్టప్ వ్యవస్థాపకుడే వ్యాపారానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటారు. అయితే కొన్ని స్టార్టప్​లకు నిధులు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు కూడా మీ స్టార్టప్​ కోసం ఫండింగ్​ సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. పెట్టుబడిదారులను ఆకర్షించి మీ స్టార్టప్ కోసం ఏ విధంగా ఫండింగ్ సంపాదించాలో ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

స్టార్టప్స్​కు నిధులు ఎందుకు అవసరం?
స్టార్టప్ వ్యవస్థాపకులు పెట్టుబడిదారులను సంప్రదించడానికి ముందు వివరణాత్మకంగా ఆర్థిక, వ్యాపార ప్రణాళికను తయారు చేసుకోవాలి. ప్రోటో టైప్ క్రియేషన్, ప్రొడెక్ట్ డెవలప్​మెంట్, ఉద్యోగుల నియామకం, వర్కింగ్ క్యాపిటల్, లీగల్ అండ్ కన్సల్టింగ్ సర్వీసులు, ముడి పదార్థాలు, పరికరాలు, లైసెన్సులు, సర్టిఫికెట్లు, మార్కెటింగ్​ల గురించి, వాటికయ్యే ఖర్చుల గురించి పెట్టుబడిదారులకు స్పష్టంగా చెప్పగలగాలి. అప్పుడే మీకు ఫండింగ్ లభించే అవకాశం ఉంటుంది.

ఫండింగ్​లో రకాలు
స్టార్టప్ ఫండింగ్స్ 3 రకాలుగా ఉంటాయి. అవే ఈక్విటీ ఫైనాన్సింగ్, డెబిట్ ఫైనాన్సింగ్, గ్రాంట్స్.

బ్రీఫ్ వర్కింగ్ క్యాపిటల్ :

  • ఈక్విటీ ఫైనాన్సింగ్ అంటే పెట్టుబడిదారులు తాము ఇచ్చిన మూలధనానికి బదులుగా కంపెనీ ఈక్విటీ షేర్లలో కొంత భాగాన్ని తీసుకుంటారు.
  • డెట్ ఫైనాన్సింగ్ అంటే పెట్టుబడిదారుల నుంచి డబ్బును అప్పుగా తీసుకోవడం. దీనిని మీరు వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
  • మీ స్టార్టప్​ పనితీరును చూసి, ఇన్వెస్టర్లు మిమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఇచ్చే ఆర్థిక రివార్డే గ్రాంట్.

స్మార్టప్ దశలు, నిధులకు మార్గాలు

1. ఐడియా
స్టార్టప్ స్థాపన అనేది చిన్న ఐడియాతోనే ప్రారంభమవుతుంది. ఈ దశలో వ్యవస్థాపకుడికి నిధులు తక్కువగా అవసరం అవుతాయి.

2. వ్యాలిడేషన్
ఈ దశలో స్టార్టప్​ ఒక నమూనా రూపంలో ఉంటుంది. దీన్నే 'ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్' అంటారు. ఆ తర్వాత మార్కెట్లో స్టార్టప్ లాంఛ్ అవుతుంది.

3. ఎర్లీ ట్రాక్షన్
స్టార్టప్ ఉత్పత్తులు లేదా సేవలు మార్కెట్​లో ప్రారంభమవుతాయి. కస్టమర్ బేస్, రాబడి, యాప్ డౌన్​లోడ్స్ మొదలైన కీలక పనితీరు సూచికలు ఈ దశలో కనిపిస్తాయి.

4. స్కేలింగ్
ఇది స్టార్టప్ ఆదాయాన్ని అర్జించే దశ. వ్యాపారం వృద్ధిని నమోదు చేసే దశ అని చెప్పొచ్చు.

5. ఎగ్జిట్ ఆప్షన్స్
పెట్టుబడిదారుడు తన పోర్ట్​ఫోలియో కంపెనీని మార్కెట్​లోని మరో కంపెనీకి విక్రయించాలని నిర్ణయించుకోవచ్చు. లేదా మరో కంపెనీలో విలీనం చేయాలనుకోవచ్చు. లేదా స్టార్టప్ ట్రాక్ రికార్డుతో ఐపీఓకు వెళ్లొచ్చు. అలాగే ఇన్వెస్టర్లు తమ ఈక్విటీ షేర్లను ఇతర ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించవచ్చు.

ఇన్వెస్టర్లను ఆకర్షించడం ఇలా!
స్టార్టప్ వ్యవస్థాపకుడు తప్పనిసరిగా ఫండింగ్ సేకరణ విషయంలో చాలా ఓపికతో ఉండాలి. పెట్టుబడి అంచనా, పెట్టుబడిదారుల ఆసక్తి, శ్రద్ధను అంచనా వేసి ఇన్వెస్టర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. రాబోయే 10 ఏళ్లలో మీ స్టార్టప్ ద్వారా ఏం చేయాలనేదానిపై స్పష్టమైన ఆలోచనను కలిగి ఉండాలి. రాబడి అంచనాలను పెట్టుబడిదారులకు తెలిపాలి.

స్టార్టప్​లలో పెట్టుబడిదారులు ఏం గమనిస్తారు?
పేటెంట్ పొందిన ఆలోచనలు లేదా ఉత్పత్తులపై ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. స్టార్టప్​ను ముందుకు నడిపించడానికి వ్యవస్థాపకుడి అభిరుచి, అనుభవం, నైపుణ్యాలు సహా, మెనేజ్​మెంట్ టీమ్​ను కూడా పరిశీలిస్తారు. ఇలా పలు విషయాల గురించి స్టార్టప్​లో పెట్టుబడులు పెట్టేవారు ఆలోచిస్తారు.

స్టార్టప్ ప్రారంభించాలా? ఆన్​లైన్​లోనే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోండిలా! - Startup Registration Process

దేశంలో 1.4లక్షల స్టార్టప్స్ - నంబర్ 1 స్థానంలో మహారాష్ట్ర - టాప్ 5 లిస్టు ఇదే! - Registered Startups In India

ABOUT THE AUTHOR

...view details