తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏ కారు బెస్ట్ - డీజిల్? పెట్రోల్?? - Best Car in Budget

Diesel Car Vs Petrol Car Which is Best : కారు ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. కానీ.. ఏ కారు తీసుకోవాలో కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది. మరి.. ఏ కారు తీసుకోవాలో మీకు క్లారిటీ ఉందా? డిజిలా? పెట్రోలా??

Diesel Car Vs Petrol Car Which is Best
Diesel Car Vs Petrol Car Which is Best

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 3:00 PM IST

Diesel Car Vs Petrol Car Which is Best : కారు కొనుక్కోవడం చాలా మంది కల. అయితే.. కొనుగోలు చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా గట్టిగానే ఉంటుంది. ఇంధనం మొదలు ఇతర ఖర్చుల వరకు తడిసి మోపెడవుతుంది. కాబట్టి.. ఖర్చు తగ్గించుకునే ఆలోచన చేయడం మంచిది. మరి.. ఈ లెక్క ప్రకారం ఏ కారు తీసుకుంటే మంచిది? డీజిల్ కారు కొనాలా? పెట్రోలా??

కొనుగోలు కాస్ట్ : డీజిల్ కారుకన్నా పెట్రోల్ కారు ధర తక్కువ. డీజిల్ కారు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో.. మొదటిసారిగా కారుపై పెట్టే పెట్టుబడి చూసినప్పుడు పెట్రోల్ కారు సేఫ్ అనిపిస్తుంది.

ఇంధన ఖర్చు : ఫ్యూయల్ విషయానికి వస్తే డీజిల్ కార్లదే పైచేయి. పెట్రోల్‌ కార్లతో పోలిస్తే.. డీజిల్‌ కార్లు మంచి మైలేజ్‌ ఇస్తాయి. అంటే.. కొనుగోలు చేసిన తర్వాత నిత్యం పోసే పెట్రోల్ విషయం చూసుకుంటే డీజిల్ కారు బెస్ట్.

మెయింటెనెన్స్‌ ఖర్చు : డీజిల్ కారు మంచి మైలేజ్‌ ఇస్తుంది. కానీ.. దీని మెయింటెన్స్‌కి పెట్రోల్ కారుకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే.. డీజిల్ దగ్గర మిగిల్చిన సొమ్ము మెయింటెనెన్స్ వద్ద పోతుందన్నమాట.

పనితీరు :మంచి కండిషన్​లో ఉంటూ.. సూపర్ డ్రైవింగ్ ఎక్స్​పీరియన్స్ ఇచ్చే కారు ఏది అనే విషయం చూసినప్పుడు పెట్రోల్‌ కార్లకన్నా.. డీజిల్ కార్లకు ఓటు పడుతుంది. ఇవి మంచి టార్క్‌ను అందిస్తాయి. మరీ ముఖ్యంగా.. హైవేల మీద లాంగ్ డ్రైవ్‌ జర్నీ చేస్తున్నప్పుడు మీకు పెద్దగా అలసట అనిపించదు. సో.. ఈ యాంగిల్​లో చూసినప్పుడు డీజిల్ కారు మంచిది.

రీ-సేల్‌:మీరు కొంత కాలం కారు వాడిన తర్వాత.. తిరిగి అమ్మేయాలని అనుకున్నప్పుడు దేనికి మంచి ధర వస్తుంది? అన్నప్పుడు.. డీజిల్ కార్లకు రీ-సేల్ బాగుంటుంది. మీ డీజిల్ కారును సెకండ్‌ హ్యాండ్‌లో విక్రయిస్తే.. మంచి ధరే లభిస్తుంది. ఈ విషయంలో పెట్రోల్ కార్ రీసేల్ వాల్యూ తక్కువగానే ఉంటుంది.

కాలుష్యం :దేశంలో కర్బన ఉద్గారాల్లో కార్ల వాటా తక్కువేం కాదు. అయితే.. పెట్రోల్, డీజిల్ కార్లలో ఏది ఎక్కువగా పర్యావరణానికి హాని చేస్తుందంటే.. డీజిల్ కారు ఎక్కువగా పొల్యూషన్ వెదజల్లుతుంది. పెట్రోల్‌ కారు వాతావరణాన్ని తక్కువ పొల్యూట్ చేస్తుంది.

దేన్ని ఎంచుకోవాలి?

ఫైనల్​గా పెట్రోల్ కారు తీసుకోవాలా? డీజిల్ కారు తీసుకోవాలా? అన్నప్పుడు.. కొన్ని కీపాయింట్స్ దృష్టిలో పెట్టుకోవాలి. ముందుగా మీ బడ్జెట్ కీలకం. కారు కొనుగోలు చేయడం ఒకెత్తయితే.. ఆ తర్వాత మెయింటెనెన్స్ చేయడం మరో ఎత్తు. డీజిల్ కారు కొనుగోలు చేస్తున్నప్పుడు ధర ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా ఎక్కువే. కానీ.. ఫ్యూయల్ ఖర్చులు తక్కువ. రీసేల్ వాల్యూ బాగుంటుంది. పెట్రోల్ కారు విషయానికి వస్తే.. కొనుగోలు చేస్తున్నప్పుడు కాస్త ధర తక్కువ. ఫ్యూయల్ ఖర్చులు చాలా ఎక్కువ. రీ-సేల్ వాల్యూ సరిగా ఉండదు. మంచి డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ విషయంలో డీజిల్ కారుది పైచేయి. ఇవన్నీ పరిశీలనకు తీసుకొని.. మీ బడ్జెట్​ను మరోసారి సరిచూసుకొని మీకు నచ్చిన కారును సెలక్ట్ చేసుకోవడమే సరైన పని. ఎందుకంటే.. ఒక్కొక్కరి కోరికలు, ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. కొందరు మనీకి ఇంపార్టెన్స్ ఇస్తే.. మరికొందరు సౌకర్యానికి వాల్యూ ఇస్తారు. ఈ కోణంలో మీ ఛాయిస్​ తీసుకోవడం మంచిది.

ABOUT THE AUTHOR

...view details