December Financial Deadlines :మరో రెండు రోజుల్లో రానున్న డిసెంబర్- సంవత్సరానికి మాత్రమే చివరి నెల కాదు, కొన్ని ఆర్థిక సంబంధిత వ్యవహారాలకు కూడా డెడ్ లైన్. ఆధార్ ఉచిత అప్డేట్, స్పెషల్ ఎఫ్‌డీల గడువులు డిసెంబర్లోనే ముగియనున్నాయి. క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని మార్పులు రానున్నాయి. అందుకే ఓసారి డిసెంబర్‌తో ముగియనున్న ఆర్థిక సంబంధిత వ్యవహారాలేవో తెలుసుకుందాం.
ఆధార్ ఉచిత అప్డేట్కు డిసెంబరు 14 ఆఖరి తేదీ
ఆధార్ కార్డు యూజర్లకు myAadhaar పోర్టల్ ద్వారా తమ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు డిసెంబరు 14తో ముగియనుంది. లేదంటే గడువు తర్వాత ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఐడీబీడీ ఎఫ్డీ
300, 375, 444, 700 రోజుల గడువు ఉన్న స్పెషల్ డిపాజిట్ ఎఫ్డీలను ఐడీబీఐ అందిస్తోంది. ఆయా ఎఫ్డీలపై సాధారణ పౌరులకు వరుసగా 7.05, 7.25, 7.35, 7.20 శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు అదనంగా లభిస్తాయి. ఐడీబీఐ బ్యాంక్ తీసుకొచ్చిన ఉత్సవ్ స్పెషల్ డిపాజిట్ గడువు డిసెంబర్ 31తో ముగియనుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్డీ స్కీములు డిసెంబర్ 31తో ముగియనున్నాయి. సాధారణ పౌరులకు 222 రోజులకు 6.30శాతం, 333 రోజులకు 7.20 శాతం, 444 రోజులకు 7.30 శాతం, 555 రోజులకు 7.45శాతం, 777 రోజులకు 7.25 పర్సెంటెజీ, 999 రోజులకు 6.65శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.