తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎఫ్ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ - ఈపీఎఫ్​ఓ కీలక నిర్ణయం - ఇకపై ఆ కారణంతో మనీ విత్​డ్రా చేయలేరు! - EPFO Covid Advance Facility Update

EPFO Covid Advance Facility Update : పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్​డ్రా చేయాలనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. మనీ విత్​డ్రా విషయంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

EPFO Stops Giving Covid 19 Advance Facility
EPFO Covid Advance Facility Update (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 16, 2024, 11:08 AM IST

EPFO Stops Giving Covid 19 Advance Facility :ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO)లో పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారందరికీ అలర్ట్. మనీ విత్​డ్రా అంశానికి సంబంధించి సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వేళ పీఎఫ్ చందాదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు తమ ఫండ్​ నుంచి కొంతమేర విత్​డ్రా చేసుకునేందుకు వీలుగా ఈపీఎఫ్​ఓ.. 'కొవిడ్ అడ్వాన్స్(Covid Advance)' పేరిట సరికొత్త ఫెసిలిటీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు.. ఆ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటన వెలువరించింది ఈపీఎఫ్​ఓ. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

2020లో మన దేశంలో కొవిడ్ - 19 మహమ్మారి విపరీతంగా విజృంభించింది. ఆ టైమ్​లో ఈపీఎఫ్​ఓ.. పీఎఫ్ ఖాతాదారులు తమ వైద్య, ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు.. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకునేలా "కొవిడ్ అడ్వాన్స్" సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా.. కొవిడ్ టైమ్​లో మొత్తం రెండు సార్లు నగదు విత్​డ్రా చేసుకునేందుకు ఛాన్స్ కల్పించింది. మొదటిసారి కొవిడ్ ఫస్ట్​వేవ్ సందర్భంగా ఈ ఫెసిలిటీని తీసుకొచ్చిన ఈపీఎఫ్​ఓ.. ఆ తర్వాత రెండో వేవ్ వచ్చినప్పుడు మళ్లీ దీన్ని పునరుద్ధరించింది. అలా దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొవిడ్ అడ్వాన్స్ సదుపాయం అందుబాటులో ఉంది.

మొదట ఒకసారి మాత్రమే అడ్వాన్స్ పొందే వీలు కల్పించినా.. తర్వాత పలుమార్లు మనీ విత్​డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. మూడు నెలల బేసిక్‌+ డీఏ లేదా ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న 75 శాతం వరకు మొత్తం విత్‌డ్రాకు అనుమతించారు. అయితే, ఇప్పుడు ఈపీఎఫ్​ఓ దానిపై కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ అడ్వాన్స్ సదుపాయాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈపీఎఫ్​ఓ. ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

మీరు EPF చందాదారులా? ఈ 7రకాల పెన్షన్​లు గురించి తెలుసుకోవడం మస్ట్!

నిజానికి చాలా మందికి కొవిడ్‌ సమయంలో ఈ సౌకర్యం ఎంతగానో ఉపకరించింది. అయితే, మరికొందరు ఇతర అవసరాలకు కూడా ఈ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ సదుపాయాన్ని వాడుకున్నారని, దీనివల్ల వారి రిటైర్మెంట్‌ సేవింగ్స్‌పై ప్రభావం పడిందని చెబుతున్నారు నిపుణులు. అడ్వాన్స్‌ సదుపాయం నిలిచిపోయినప్పటికీ.. ఇంటి కొనుగోలు, వివాహం, పిల్లల ఉన్నత చదువులు, ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం వంటి సందర్భాల్లో ఈపీఎఫ్‌ ఖాతాలో ఉన్న మొత్తాన్ని నిర్దిష్ట పరిమితి మేరకు విత్​డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అలాగే.. ఇటీవల నగదు విత్​డ్రా పరిమితుల్లో కొన్ని కీలక మార్పులు చేసింది ఈపీఎఫ్‌ఓ. ఎడ్యుకేషన్, మ్యారేజ్ క్లెయిమ్ సహా హౌసింగ్ క్లెయిమ్స్‌కు కూడా ఆటో సెటిల్‌మెంట్ సదుపాయం తీసుకొచ్చినట్లు వెల్లడించింది.

EPF​ ఖాతాదారులకు గుడ్ న్యూస్​​ - ఇకపై డెత్​ క్లెయిమ్ చాలా ఈజీ - ఎలా అంటే?

పీఎఫ్​ ఖాతాదారులకు గుడ్​న్యూస్​​ - కేవలం 3 రోజుల్లోనే డబ్బులు! - EPF Advance Claim Limit Extend

ABOUT THE AUTHOR

...view details