ETV Bharat / business

దీపావళి డీల్స్‌ - ఆ స్కూటీపై రూ.25,000 డిస్కౌంట్‌ - హీరో, హోండా, టీవీఎస్‌ బైక్‌ ఆఫర్స్‌ ఎలా ఉన్నాయంటే? - BIKES DIWALI OFFERS 2024

దీపావళికి కొత్త బైక్ లేదా స్కూటీ కొనాలా? హీరో, హోండా, టీవీఎస్‌, బజాజ్‌ బైక్‌ & స్కూటీ ఆఫర్స్‌పై ఓ లుక్కేయండి!

Bikes
Bikes (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 1:51 PM IST

Bikes Diwali Offers 2024 : దీపావళి, ధంతేరాస్ సందర్భంగా కొత్త బైక్ లేదా స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్‌. హీరో, హోండా, టీవీఎస్‌ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ లేటెస్ట్ బైక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

1. TVS iQube Diwali Offer : టీవీఎస్‌ కంపెనీ ఐక్యూబ్ స్కూటీపై దీపావళి ఫెస్టివల్ డిస్కౌంట్ ఇస్తోంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.89,999గా ఉంది. కానీ ఈ దీపావళికి హెచ్‌డీఎఫ్‌సీ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డులతో పేమెంట్ చేస్తే ఈ టీవీఎస్‌ ఐక్యూబ్‌పై రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు దీనిపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు, క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్లు, విన్‌ ఆఫర్స్‌, ఫ్లెక్లిబుల్ నో-కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తోంది.

టీవీఎస్ మోటార్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కనుక ఈ ఐక్యూబ్‌ స్కూటీని కొనుగోలు చేస్తే, కస్టమర్‌కు కింద ఇచ్చిన లిస్ట్‌లోని ఏదో ఒక ప్రత్యేకమైన కానుక కూడా ఇస్తారు.

  • ప్రెస్టేజ్‌ పీజీఎంఎఫ్‌బీ 800 వాట్‌ గ్రిల్ శాండ్‌విచ్ టోస్టర్‌
  • వైల్డ్‌క్రాఫ్ట్‌ డబ్ల్యూఎల్‌యూఎల్‌3 బ్యాక్‌ప్యాక్‌
  • టెక్నోబైట్‌ 10000mAh పవర్‌బ్యాంక్‌ పాకో
  • ప్రెస్టేజ్‌ ఈ పీఈసీ4.0 ఎలక్ట్రిక్ చాపర్‌
  • బోట్ ఎయిర్‌డ్రాప్స్‌ 138 ఇయర్‌బడ్స్
  • బోట్ ఆస్ట్రా వాయిస్‌ స్మార్ట్‌వాచ్‌
  • డిజైనర్ హ్యాండ్‌బ్యాగ్‌

2. Hero Bike Festival Offers : హీరో కంపెనీ సూపర్‌ స్ల్పెండర్‌ Xtec, హెచ్‌ఎఫ్‌ డీలక్స్ బైక్‌లపై అదిరిపోయే డిస్కౌంట్స్ అందిస్తోంది. ప్రధానంగా రూ.5,500 వరకు క్యాష్ డిస్కౌంట్‌, రూ.5000 వరకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.

  • మార్కెట్లో హీరో సూపర్ స్ల్పెండర్‌ ఎక్స్‌టెక్ బైక్ ధర రూ.85,178 - రూ.89,078 ప్రైస్‌ రేంజ్‌లో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొంటే సుమారుగా రూ.10,500 వరకు ధర తగ్గుతుంది.
  • మార్కెట్లో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌ బైక్ ధర రూ.65,268 - రూ.70,348 ప్రైస్‌ రేంజ్‌లో ఉంటుంది. ఈ దీపావళికి దీనిని కొంటే రూ.10,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

3. Honda Activa 6G Diwali Offer : భారత్‌లోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.94,000 వరకు ఉంది. కానీ ఈ దీపావళికి దీనిపై రూ.5,500 వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.

4. Bajaj Pulsar 125 : మార్కెట్లో ఈ బజాబ్ పల్సర్ 125 బైక్‌ ధర రూ.82,883 వరకు ఉంటుంది. ఈ దీపావళికి దీనిపై రూ.10,000 డిస్కౌంట్ లభిస్తోంది.

5. Harley-Davidson X440 : దీపావళికి మంచి హై-ఎండ్ బైక్‌ కొనాలని అనుకున్నవారికి గుడ్ న్యూస్‌. హార్లే-డేవిడ్సన్ X440 బైక్‌పై రూ.23,000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనితో రూ.15,000 ఫ్లాట్ డిస్కౌంట్‌ కాగా, ఒక సంవత్సరం వరకు (రూ.8000 వరకు) ఫ్రీ రోడ్‌-సర్వీస్‌ అసిస్టెన్స్‌ ఇస్తారు. నవంబర్‌ 3 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో హార్లీ-డేవిడ్సన్ బైక్ ధర సుమారుగా రూ.2,39,500 - రూ.2,79,500 వరకు ఉంది.

6. Jawa-Yezdi Motorcycles : జావా యెజ్డీ మోటార్స్ సైకిల్స్ అన్నింటిపై రూ.12,500 వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనితో పాటు కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.10,000 వరకు క్యాష్‌ బ్యాక్ ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ బోనస్‌ కింద మరో రూ.10,000 ఆదా చేసుకోవచ్చు. ఒక వేళ ఈఎంఐ విధానంలో ఈ బైక్ కొంటే, కేవలం రూ.2,999 డౌన్‌పేమెంట్‌తో దీనిని సొంతం చేసుకోవచ్చు.

7. Ather 450 Range : ఏథర్ కంపెనీ దీపావళి సందర్భంగా 450S, 450X, 450అపెక్స్ బైక్‌లపై రూ.25,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

  • ఫ్లాట్‌ డిస్కౌంట్ - రూ.5000
  • ఎక్స్‌టెండెడ్‌ బ్యాటరీ వారెంటీ - రూ.5000
  • రోడ్‌సైట్ అసిస్టెన్స్‌ - రూ.5000
  • క్యాష్ బ్యాక్‌ - రూ.10,000
  • టోటల్ - రూ.25,000

Ather 450 Scooter Price :

  • మార్కెట్లో ఏథర్ 450ఎస్‌ ధర సుమారుగా రూ.1,55,600 వరకు ఉంటుంది.
  • మార్కెట్లో ఏథర్ 450ఎక్స్‌ ధర సుమారుగా రూ.1,40,00 - రూ.1,55,600 ప్రైస్‌ రేంజ్‌లో ఉంటుంది.
  • మార్కెట్లో ఏథర్ 450అపెక్స్‌ ధర సుమారుగా రూ.1,95,220 వరకు ఉంటుంది.

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? ఈ టాప్‌-10 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

కార్​ లోన్​ వడ్డీ ఏ బ్యాంక్​లో తక్కువ? లేటెస్ట్​ రేట్స్​ ఫుల్ డిటైల్స్ మీకోసం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.