Car Maintenance Checklist :కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. కారు కొనుగోలు చేయడం ఒక ఎత్తయితే, దానిని మంచి కండీషన్లో ఉంచుకోవడం మరో సవాలని చెప్పాలి. అయితే ఆ కారు ఎక్కువ కాలం మన్నిక రావాలంటే చాలా జాగ్రతగా మెయింటెన్ చేయాలి. అందుకోసం షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్, సీజనల్ చెకింగ్స్ చేయాలి.
కారు భాగాల్లో కొన్నింటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాల్సి ఉంటుంది. మరికొన్ని దీర్ఘకాలంలో చెక్ చేస్తే సరిపోతుంది. కారును మీరు సరిగ్గా మెయింటెన్ చేస్తే కండీషన్లో ఉంటుంది. అప్పుడు దాని రీసేల్ వ్యాల్యూ కూడా బాగుటుంది. అయితే కారు కండీషన్ తప్పడం, బోర్‌కు రావడం వల్ల భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
షార్ట్‌టర్మ్ చెకప్
- ఎయిర్ ఫిల్టర్ :కారు ఇంజిన్‌లో ఉండే ఎయిర్ ఫిల్టర్ చాలా ముఖ్యం. ఇది మీ ఇంజిన్లోకి వచ్చే గాలిని నియంత్రిస్తుంది. ధుమ్ము, ధూళి ఇంజిన్లోకి చొచ్చుపోకుండా కాపాడుతుంది. ఎయిర్ ఫిల్టర్ సక్రమంగా పనిచేస్తే కారు మంచి మైలేజ్ ఇస్తుంది. ఇంజిన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. కారు ఎయిర్ ఫిల్టర్ సరిగ్గా ఉందో లేదో ఇంట్లోనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు.
- టైర్ ప్రెషర్ :కారును ఎక్కువగా వాడితే ప్రధానంగా ఆ భారమంతా పడేది టైర్లపైనే. అందుకే టైర్లను మంచిగా ఉండేలా చూసుకోవాలి. అందుకే నెలకు ఒకసారైనా టైర్లలో గాలిని చెక్ చేసుకోవాలి. టైర్లలో గాలి ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి మీ దగ్గర టైర్ గేజ్‌ను ఉంచుకోవాలి. గాలి తక్కువగా ఉన్నా డ్రైవింగ్ చేస్తే టైర్ల లైఫ్ టైమ్ వేగంగా తగ్గిపోతుంది.
- కూలెంట్ లెవెల్స్ : ప్రతి నెలకొకసారి కారు ఇంజిన్, కూలెంట్ స్థాయిలను తనిఖీ చేయాలి. ముఖ్యంగా ట్రిప్స్‌కు వెళ్లే ముందు కారులో ఆయిల్, కూలెంట్ లెవెల్స్‌ను చెక్ చేసుకోవాలి. లేదంటే కారు దెబ్బతినే ప్రమాదం ఉంది.
- హెడ్, పార్కింగ్ లైట్లు, టర్న్ సిగ్నల్స్ :ఏ వావాహనికైనా లైట్లు చాలా ముఖ్యం. లైట్లు సరిగ్గా లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే కనీసం నెలకొకసారి హెడ్, పార్కింగ్ లైట్లు, టర్నింగ్ సిగ్నల్స్ లైట్స్‌ను తనిఖీ చేసుకోండి.
- ఆయిల్ అండ్ ఫిల్టర్ : ఏ వాహనానికికైనా క్రమం తప్పకుండా ఇంజిన్ ఆయిల్‌ను మార్చాల్సి ఉంటుంది. అప్పుడే ఆ కారు బాగా పనిచేస్తుంది. అలాగే మంచి మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ ఆయిల్ కారు ఇంజిన్‌ను చల్లబరుస్తుంది. ఇంజిన్ తుప్పు పట్టకండా నిరోధిస్తుంది. ప్రతి 3 నెలలకు లేదా 3000 మైళ్లకు ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్‌ను మార్చాల్సి రావచ్చు. అలాగే మీ వాహనాన్ని కడిగిన తర్వాత ప్రతి ఆరు నెలలకోసారి వ్యాక్స్ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మీ కారు కాంతివంతంగా మెరుస్తుంటుంది. అలాగే తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. వ్యాక్సింగ్‌తో కారు పెయింట్ పాడవకుండా ఉంటుంది.