Car Discounts February 2024 : భారతదేశంలో నేడు కార్ల వినియోగం విపరీతంగా పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కస్టమర్లను ఆకర్షించడానికి భారీ ఎత్తున డిస్కౌంట్లు, ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందిస్తున్నాయి. కొత్త కారు కొనాలని అనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్, హోండా లాంటి టాప్ బ్రాండెడ్ కంపెనీలు ఇస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Hyundai Car Offers :హ్యుందాయ్ కంపెనీ ఈ ఫిబ్రవరి నెలలో దాదాపు తమ కార్లు అన్నింటిపై కూడా భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వెర్నా, ఆల్కజార్, టక్సన్ మొదలైన కార్లపై క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్ ఇస్తోంది. ఓ మోడల్ కారుపై ఏకంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. అయితే కొత్తగా లాంఛ్ చేసిన క్రెటా, ఎక్స్టర్ లాంటి ఎస్యూవీ కార్లపై ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. ఇప్పుడు ఏయే కార్లపై ఎలాంటి డీల్స్ ఉన్నాయో చూద్దాం.
- Hyundai Verna Discounts :హ్యుందాయ్ వెర్నా 2023 మోడల్‌పై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు. హ్యుందాయ్ వెర్నా 2024 మోడల్‌పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.
- Hyundai Grand i10 Nios Discounts : ఈ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 2023 మోడల్‌పై రూ.48,000 డిస్కౌంట్ అందిస్తున్నారు. 2024 మోడల్‌పై రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అయితే అదనంగా మరో రూ.3,000 విలువైన బెనిఫిట్స్ ఇస్తున్నారు.
- Hyundai Alcazar Discounts : ఈ హ్యుందాయ్ అల్కజార్ కారు 2023 మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ.25,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 మొత్తం రూ.45,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. 2024 మోడల్‌పై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 ఇస్తున్నారు.
-
Hyundai Aura Discounts :ఈ హ్యుందాయ్ ఆరా కారుపై మొత్తంగా రూ.33,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా మరో రూ.3000 డిస్కౌంట్ కల్పిస్తున్నారు.
-
Hyundai Venue Discounts :హ్యుందాయ్ కంపెనీ ఈ వెన్యూ కారు 2023 మోడల్, 2024 మోడల్ రెండింటిపైనా రూ.30,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
-
Hyundai i20 Discounts : హ్యుందాయ్ ఐ20 కారుపై ఏకంగా రూ.30,000 వేరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.
-
Hyundai Tucson Discounts : ఈ హ్యుందాయ్ టక్సన్ కారుపై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కలిపి ఏకంగా రూ.2 లక్షల వరకు బెనిఫిట్ అందిస్తున్నారు.
Honda Car Offers 2024 : హోండా కంపెనీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో తమ టాప్ మోడల్ కార్స్‌పై మంచి ఆఫర్లను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
-
Honda City Discounts : హోండా కంపెనీ తమ 'సిటీ' సెడాన్ కారుపై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.26,947 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది. అంతేకాదు ఈ హోండా సిటీపై ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ.15,000 ఇస్తోంది. వీటితోపాటు లాయల్టీ బోనస్ రూ.4,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000, స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20,000 ఇస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ హోండా సిటీ కారు కొన్నవారికి ఏకంగా రూ.1.11 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాదు హోండా కంపెనీ VX, ZX వేరియంట్లపై రూ.13,651 విలువైన ఎక్స్టెండెడ్ వారెంటీ కూడా అందిస్తోంది. అలాగే హోండా సిటీ ఎలిగెంట్ ఎడిషన్‌పై రూ.36,500 వరకు స్పెషల్ బెనిఫిట్స్ అందిస్తోంది.
-
Honda Amaze Discounts : హోండా అమేజ్ కారుపై రూ.30వేలు క్యాష్ డిస్కౌంట్ లేదా రూ.36,346 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది. అమేజ్ VX వేరియంట్, ఎలైట్ ఎడిషన్లపై రూ.20వేలు డిస్కౌంట్ లేదా రూ.24,346 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ ఇస్తోంది.
-
Honda Dzire, Tigor Discounts :హోండా కంపెనీ డిజైర్, టిగోర్ కార్లపై ఫ్లాట్ డిస్కౌంట్ కింద గరిష్ఠంగా రూ.27,000; స్పెషల్ కార్పొరేట్ డిస్కౌంట్ రూ.20,000; కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000; కస్టమర్ లాయల్టీ బోనస్ రూ.4,000 ఇస్తున్నారు.