తెలంగాణ

telangana

ETV Bharat / business

మొదటిసారి కారు కొంటున్నారా? ఈ టాప్​-10 ఫీచర్స్​ మస్ట్​! - Car Buying Guide - CAR BUYING GUIDE

Car Buying Guide : కారు కొనేట‌ప్పుడు అందులో అన్ని ఫీచ‌ర్లు ఉండాల‌ని కోరుకుంటాం. కానీ వాస్త‌వానికి ఏమేం ఫీచ‌ర్లు కావాలో మ‌న‌కే స‌రిగ్గా తెలియదు. అందుకే కారు కొనేటప్పుడు కచ్చితంగా ఉండాల్సిన టాప్​-10 ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Popular Features to Consider When Buying a Car
Car Buying Guide

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 3:56 PM IST

Car Buying Guide : కార్ కొనాల‌ని అనుకునేవారు ముందుగా బ‌డ్జెట్, కలర్​, ఫీచ‌ర్స్​ తదితర అంశాల గురించి ఆలోచిస్తారు. కాస్త బ‌డ్జెట్ ఎక్కువైనా, అన్ని ఫీచ‌ర్లూ ఉండాలని ఆశిస్తారు. అయితే చాలా మందికి ఏయే ఫీచర్లు కచ్చితంగా ఉండాలో తెలియదు. అందుకే కారు కొనే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చెక్​ చేసుకోవాల్సిన టాప్​-10 రైడింగ్ అండ్ సేఫ్టీ ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్స్ (FCW)
ఫార్వార్డ్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్​నే యాంటీ-కొలిషన్​ వార్నింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశ‌ం ఉంటే, దృశ్య రూపంలో, శబ్ధరూపంలో, స్పర్శ రూపంలో ఇది వెంటనే డ్రైవ‌ర్​ను హెచ్చరిస్తుంది. ఈ సిస్టమ్​ వల్ల రియర్-ఎండ్ యాక్సిడెంట్స్​ అంటే వెనుక వైపు నుంచి కారు ఢీకొనే ప్రమాదాలు దాదాపు 27 శాతం వరకు తగ్గాయని కన్యూమర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

2. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB)
కారులో కచ్చితంగా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఉండేలా చూసుకోవాలి. ఏదైనా ప్ర‌మాదం జ‌రిగే సూచ‌న ఉంటే,ఇది డ్రైవ‌ర్ ప్ర‌మేయం లేకుండానే ఆటోమేటిక్​గా బ్రేకులు వేస్తుంది. అంతేకాదు ఒకవేళ డ్రైవర్ తగినంత బలంగా బ్రేకులు వేయకపోతే, ఇది బ్రేకింగ్ ఫోర్స్​ను పెంచుతుంది. ఏఈబీ వ్యవస్థ వాహనాలను, పాదచారులను, సైక్లిస్ట్​లను గుర్తించి, ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్​గా ఎమర్జెన్సీ బ్రేకులు వేస్తుంది. ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు లేదా డ్రైవ‌ర్ బ్రేక్స్ వేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌మాద తీవ్ర‌త‌ను త‌గ్గించ‌డ‌మే ఈ వ్య‌వ‌స్థ ప్ర‌ధాన ఉద్దేశం.

3. రిమోట్ స్టార్ట్ ఫీచ‌ర్
ఈ ఫీచ‌ర్ గురించి చాలా మందికి తెలియ‌దు. చ‌లికాలంలో వేడి కావాల‌న్నా, వేస‌వి కాలంలో చల్లగా ఉండాలన్నా, మ‌నం కార్ లోప‌లికి వెళ్లే ముందు రిమోట్​ స్టార్ట్​ ఫీచర్​ను ఎనేబుల్ చేయాలి. అప్పుడు ఇది వాతావ‌ర‌ణాన్ని బట్టి వాహ‌నం లోప‌లి ఉష్ణోగ్ర‌త‌ను స‌ర్దుబాటు చేస్తుంది.

4. 360 డిగ్రీ కెమెరాస్​
ఈ కాలంలో దాదాపు అన్ని వాహ‌నాల్లో కెమెరాలు కామ‌న్​గా ఉంటున్నాయి. కానీ 360 డిగ్రీ కెమెరాలు త‌క్కువనే చెప్పాలి. ఇది పార్కింగ్ చేసేట‌ప్పుడు చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వల్ల చుట్టుపక్కల ఉండే వస్తువులను, వ్యక్తులను గుర్తించవచ్చు.

5. ఆటో-డిమ్మింగ్ రియర్​ వ్యూ మిర్రర్
రాత్రిపూట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫొటో సెన్సర్లు కాంతిని గుర్తించి అందుకు అనుగుణంగా వోల్టేజ్​ను బట్టి ప్రతిబంబిస్తాయి. కారు ముందు నుంచి వచ్చే కాంతి కంటే, వెనుక వచ్చే కాంతి ఎక్కువగా ఉంటే, ఈ రియర్ వ్యూ మిర్రర్​ డిమ్ముగా మారిపోతుంది. దీని వల్ల మన వెనుక నుంచి వచ్చే వాహనాలను చాలా సులువుగా గుర్తించగలుగుతాము.

6. సీటింగ్​
కార్లలో హీటెడ్, కూలింగ్, వెంటిలేటెడ్ సీట్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి సీజన్​ను బట్టి ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తాయి.

7. హీటెడ్ స్టీరింగ్ వీల్స్
శీతల ప్రాంతాల్లో నివసించే వారు హీటెడ్ స్టీరింగ్ వీల్స్ ఫీచర్స్ ఉన్న కారు తీసుకుంటే బెస్ట్. వీటితో పాటు నావిగేషన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ ఫీచర్లు కూడా ఉండేలా చూసుకోవాలి.

8. యాక్టివ్ యాంటీ-రోల్ బార్​
యాక్టివ్ యాంటీ-రోల్ బార్‌లు మూల‌మ‌లుపులు తీసుకునేట‌ప్పుడు ఉప‌యోగ‌పడ‌తాయి. హెవీ బాడీ వెహికల్స్​కు, హై-రైడింగ్ SUVలకు ఈ ఫీచ‌ర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

9. పవర్​ లిఫ్టేజ్​
ప‌వ‌ర్ లిఫ్టేజ్ ఒక మంచి ఫీచ‌ర్. ముఖ్యంగా మీ చేతిలో లగేజ్​ ఉన్న‌ప్పుడు, ఈ ఫీచ‌ర్ ఉపయోగించి కార్ వెన‌క డోర్ ఓపెన్ చేయవచ్చు. కొన్ని కార్ల‌లో 'కీ'లోనే ఒక బ‌ట‌న్ ఉంటుంది.

10. ఈ ఫీచర్స్ కూడా
ప‌వ‌ర్​ను ఏసీ నుంచి డీసీగా మార్చే ప‌వ‌ర్ ఇన్వెస్ట‌ర్, వైఫై హాట్ స్పాట్, థ‌ర్డ్ రో సీటింగ్, బ్లూటూత్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిట‌రింగ్, టార్క్ వెక్టోరింగ్, స్మార్ట్ స‌స్పెన్ష‌న్ లాంటి ఫీచ‌ర్లు కూడా కారులో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల మీరు కంఫర్ట్​గా, సేఫ్​గా కారులో ప్రయాణం చేయగలుగుతారు.

త్వరలో విడుదల కానున్న టాప్-8​ బైక్స్ & స్కూటీస్ ఇవే! - Upcoming Bikes

రూ.10 లక్షల్లో క్రూయిజ్ కంట్రోల్ కార్లు కొనాలా? టాప్​ -5 మోడల్స్ ఇవే! - Best Cruise Control Cars In India

ABOUT THE AUTHOR

...view details