తెలంగాణ

telangana

ETV Bharat / business

బైక్​ వాషింగ్​కు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే మనీ సేవ్​! - bike washing tips - BIKE WASHING TIPS

Bike Maintenance Tips In Telugu : బైక్​ అంటే ఇష్టపడని వారెవరు! అయితే దీనిని మెయింటెయిన్​ చేసేందుకు చాలామంది నెలకో, 3నెలలకోసారో వాషింగ్​ కోసం సర్వీసింగ్​కు ఇస్తుంటారు. అలా తరచూ ఎక్కువ డబ్బులను చెల్లించి బైక్​ వాష్​ చేయించడం ద్వారా మీకు ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుందా? మరేం పర్వాలేదు. ఈ కింది టిప్స్​ ఫాలో అయితే మీ మనీని పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Bike Maintenance Tips In Telugu
Bike Maintenance Tips In Telugu

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 3:57 PM IST

Bike Maintenance Tips In Telugu :ఓ రైడర్​ బైక్‌ను ఎప్పుడూ తన ప్రాణంలా చూసుకుంటాడు. అది ఎప్పుడు తళతళ మెరవాలని దాని కోసం పడే శ్రమ అంతా ఇంతా కాదు. మొదట బైక్​ను కొన్నప్పుడు ఎలా ఉందో దానిని ఎన్ని రోజులు అయినా సరే అలానే ఉంచడానికి ప్రయత్నిస్తాడు. బైక్‌ను రోజూ ఎలా శుభ్రం చేసుకోవాలని దానిపై చేసే కసరత్తులు చెప్పక్కర్లేదు. బైక్‌ను కడగడం లేదా శుభ్రపరచడం అనేది బైక్​ మెయింటెనెన్స్​లో పరిగణించే మొదటి స్టేజీ. కార్బోరేటర్‌ను శుభ్రపరచడం, టైర్లలో సరైన ప్రెజర్​ను మెయింటెయిన్ చేయడం లాంటివి కూడా ముఖ్యమైనవే. ఈ నేపథ్యంలో బైక్‌ను కడగడానికి వర్తించే కొన్ని ప్రత్యేక పద్ధతులు, ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఫాలో అయితే మీరు బెస్ట్ రిజల్ట్స్​ పొందవచ్చు. మరి ఆ టిప్స్​ మీకోసం.

బైక్​ మెయింటెనెన్స్​ అంత కష్టమా?
బైక్​ ఏదైనా కావచ్చు, బైక్‌ను వాష్​ చేసే పద్ధతులు, విధానాలు ఫోర్-వీలర్‌ను కడిగే దానికంటే పూర్తి డిఫరెంట్​గా ఉంటాయి. కారుతో పోలిస్తే బైక్‌లో కొన్ని కీలక పార్ట్స్​ ఉంటాయి. వాటి 'ఓపెన్​-టు-ఎన్విరాన్‌మెంట్​' స్వభావం కారణంగా బైక్​ మెయింటెనెన్స్​ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఓ విధంగా చెప్పాలంటే వివిధ ప్లాస్టిక్​ ఫైబర్​, మెటల్​, రబ్బరు, క్రోమ్​, పెయింట్​ యూజ్​, క్వాలిటీ, లేఅవుట్​ లాంటివి కారులో పూర్తి భిన్నంగా ఉంటాయి. అలాగే ఒక బైక్‌లో వివిధ పరికరాలు ఉంటాయి. అవి అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.

వాషింగ్​ కిట్​!
తదుపరి స్టేజీ ఏమిటంటే- మీ బైక్‌ను కడగడానికి అవసరమైన అన్ని వస్తువులను మీరు సిద్ధంగా ఉంచుకోవాలి. వీటిల్లో బైక్​ భాగాలను తుడవడం, ఎండబెట్టడం, పాలిష్​ చేయడం కోసం శుభ్రమైన, మృదువైన పొడి బట్టలను మాత్రమే ముక్కలుగా చేసి తీసి ఉంచుకోవాలి. వీల్​ క్లీనర్​ సాల్వెంట్​, తుప్పు పట్టే అవకాశాలను నివారించడానికి ఉపయోగపడుతుంది. సీటు ఫాబ్రిక్​ కోసం లెదర్​ సాల్వెంట్​ లేదా లెదర్​ లేదా ఫాబ్రిక్​ను ఉపయోగించడానికి ఏదైనా భాగాన్ని ఉంచుకోవాలి. శుభ్రంగా, పొడిగా, మంచి పరిమాణంలో ఉన్న స్పాంజ్​ ముక్కలను వాడాలి. బైక్‌ను క్లీన్​ చేసే సాల్వెంట్​. సాల్వెంట్​ అంటే సబ్బు లేదా డిటర్జెంట్​ సాల్వెంట్​ ఏదైనా కావచ్చు. దీంతో పాటు వీటినీ పాటించండి.

  • వాషింగ్​ చేసేటప్పుడు మీ చేతులకు హ్యాండ్ గ్లోవ్స్​ను వాడండి. ఇవి మీ చేతులు మురికిగా మారకుండా అడ్డుకుంటాయి.
  • గ్రీజు, ఆయిల్ క్లీనర్​లను వాడండి.
  • వీల్స్​ను శుభ్రపరిచే బ్రష్​ను వాడండి.
  • క్లీన్​ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బకెట్​ను ఉంచుకోండి.

రెండు బకెట్లను ఉపయోగించడం!
రెండు బకెట్లను ఉంచుకోవడం ద్వారా మీ బైక్​ వాషింగ్​ ప్రక్రియ మరింత ఈజీగా అవుతుంది. మొదటి బకెట్‌ను మీరు శుభ్రపరిచే సాల్వెంట్​ లేదా లిక్విడ్స్​ను వేయడానికి వాడండి. రెండో దాంట్లో మీరు కొంత మంచినీటిని మాత్రమే నింపుకోవడానికి ఉంచుకోవాలి.

క్లీనింగ్​ ప్రాసెస్​!
ప్రీ-వాష్​ చేయడం- మీ బైక్‌ను షాంపూ లేదా క్లీనింగ్​ ఏజెంట్​/సాల్వెంట్‌తో శుభ్రం చేసే ముందు, మురికి, దుమ్మును ప్రాథమిక పద్ధతిలో తొలగించండి. ఇందుకోసం కొంచెం మంచినీటిని వాడవచ్చు.

​వీల్స్​- ఇతర వాహనాల వీల్స్​తో పోలిస్తే బైక్​ వీల్స్​ శుభ్రం చేయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని. దీనికోసం ముందుగా వీల్​ క్లీనర్​ సాల్వెంట్​ను బయటకు తీసి, నాజిల్‌ను ప్రెస్​ చేయాలి. తద్వారా సాల్వెంట్​ స్ప్రెడ్​ పద్ధతిలో బయటికి వస్తుంది. ఆపై ఇప్పటికే నీటితో కడిగిన వీల్స్​పై ఈ సాల్వెంట్​ను కోటింగ్​ లాగా వేయాలి.

ఎగ్జాస్ట్​- మీరు బైక్​ను కడిగేటప్పుడు ఎగ్జాస్ట్​ అనేది అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాస్ట్‌లపై అసలు షైనింగ్​ను తిరిగి తీసుకురావడానికి బైక్​ క్లీనింగ్ సాల్వెంట్‌లను ఉపయోగించడం ఉత్తమ మార్గం.

చైన్​- బైక్​ చైన్​లో మట్టి పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇప్పటికే ఆయిల్​/గ్రీజుతో ఉండడం వలన మురికిని ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే జాగ్రత్తగా దీనిని శుభ్రం చేయాల్సి ఉంటుంది(How To Keep Bike Chain Clean).

షాంపూతో కడగండి- బైక్​ బాడీ ప్యానెల్‌నూ శుభ్రపరచడం చాలా అవసరం. ఎందుకంటే మీ బైక్‌ మొత్తంలో హైలైట్​ పార్ట్​ ఇదే. బాడీపై పడ్డ దుమ్మును పూర్తిగా తొలగించాలి. తద్వారా సూర్యుని నుంచి వచ్చే కాంతి దానిపై పడినప్పుడు మెరుస్తుంది.

డ్రయింగ్​
ఇక బైక్​ వాషింగ్​ ప్రాసెస్​లో చిట్టచివరిగా చెప్పుకునే అంశం డ్రయింగ్​. మీరు మీ బైక్‌ను కడగడం పూర్తి చేసిన తర్వాత దానిని ఆరబెట్టాలి. లేదంటే మిగిలి ఉన్న వాటర్‌మార్క్స్ మీ బైక్​కు కావలసిన షైనింగ్​ను ఇవ్వకపోవచ్చు. వీటిని తుడిచి వేయడానికి శుభ్రమైన, పొడి వస్త్రాన్ని ఉపయోగించాలి.

ఆ ఎక్స్ యూజర్స్​కు ఎలాన్​ మస్క్ బంపర్​ ఆఫర్​-​ ప్రీమియం ఫీచర్లన్నీ ఫ్రీ! - elon musk

జీ5 ప్రీమియం స‌బ్​స్క్రిప్ష‌న్​పై అదిరిపోయే ఆఫర్స్​​- ఏడాది ప్లాన్​పై 40% డిస్కౌంట్! - ZEE5 SUBSCRIPTION offers

ABOUT THE AUTHOR

...view details