తెలంగాణ

telangana

ETV Bharat / business

'పన్ను చెల్లింపుదారులకు అలర్ట్ - ఫేక్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జర జాగ్రత్త' - ఐటీ శాఖ హెచ్చరిక - ITR Refund Scam

ITR Refund Scam : ఐటీఆర్ రీఫండ్ స్కామ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులను ఐటీ శాఖ హెచ్చరించింది. ఫేక్ కాల్స్, పాప్‌అప్ నోటిఫికేషన్లు, మేసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ట్యాక్స్ పేయర్స్‌కు ఫేక్ మెసేజ్‌లు వస్తే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, అధికారిక ఛానళ్ల ద్వారా వెరిఫై చేసుకోవాలని పేర్కొంది.

ITR refund scam
ITR refund scam (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 11:56 AM IST

ITR Refund Scam :ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఐటీఆర్ రీఫండ్ స్కామ్‌ల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ హెచ్చరించింది. పన్ను చెల్లింపుదారులు ఫేక్ కాల్స్, పాప్‌అప్ నోటిఫికేషన్లు వంటి ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒకవేళ పన్ను చెల్లింపుదారులకు ఫేక్ మెసేజ్‌లు వస్తే గుడ్డిగా నమ్మి మోసపోవద్దని, అధికారిక ఛానళ్ల ద్వారా వెరిఫై చేసుకోవాలని ఎక్స్ వేదికగా హెచ్చరించింది.

"అనధికార, అనుమానాస్పద ఈ-మెయిల్స్‌పై క్లిక్ చేయవచ్చు. అలాగే వాటికి ఎలాంటి సమాధానం ఇవ్వవద్దు. మీ క్రెడిట్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అడిగే వెబ్‌సైట్లను ఓపెన్ చేయవద్దు. ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఈ-మెయిల్ చిరునామా ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి" అని ఐటీ విభాగం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఇలాంటి మెసేజ్‌లు వస్తే జాగ్రత్త సుమా
స్కామర్ల నుంచి వచ్చే సందేశాలు ఎలా ఉంటాయో కూడా ఐటీ శాఖ తెలిపింది. "‘మీకు రూ.15000 ఆదాయపు పన్ను రీఫండ్ అప్రూవ్ అయ్యింది. ఈ మొత్తం త్వరలో మీ ఖాతాకు జమ అవుతుంది. దయచేసి మీ ఖాతా నంబర్ 5XXXXXX6777ను ధ్రువీకరించండి. ఇది సరైనది కాకుంటే, ఇక్కడ ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయండి" అని ఆ సైబర్ నేరగాళ్ల నుంచి మెసేజ్ లేదా మెయిల్ రావచ్చని ఆదాయపు పన్ను విభాగం హెచ్చరించింది. అలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించింది.

ఫిర్యాదు చేయండి ఇలా!
మోసపూరిత ఈ-మెయిల్ వస్తే, మీరు దానిని webmanager@incometax.gov.in ఫార్వర్డ్ చేయాలి. ఒక కాపీని incident@cert-in.org.in కూడా పంపవచ్చు. మీకు ఫిషింగ్ మెయిల్ వస్తే, దానిని incident@cert-in.org.in కు ఫార్వర్డ్ చేయండని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఆదాయపు పన్ను శాఖ అని చెప్పుకునే ఎవరి నుంచైనా ఈ-మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తే వాటికి సమాధానం ఇవ్వవద్దని సూచించింది. అలాగే, ఈ- మెయిల్‌లో ఏదైనా అటాచ్‌మెంట్‌లు ఉంటే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని, మెసేజ్ లింక్‌ను కట్ చేసి మీ బ్రౌజర్లలో పేస్ట్ చేయవద్దని హెచ్చరించింది.

ఐటీ రీఫండ్ ఎప్పుడు వస్తుంది అంటే?
పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను ఈ-వెరిఫై చేసిన తర్వాత, ఆదాయపు పన్ను రీఫండ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాధారణంగా, రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావడానికి సుమారుగా 4-5 వారాల సమయం పడుతుంది. ఒక వేళ'డిఫెక్టివ్ ఐటీఆర్'నోటీస్​ వస్తే, దానిని మళ్లీ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

రీఫండ్ కోసం చూస్తుంటే - 'డిఫెక్టివ్ ఐటీఆర్' నోటీస్​ వచ్చిందా? సింపుల్​గా కరెక్ట్ చేసుకోండిలా! - How To Correct Defective ITR

మీరు తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నచ్చలేదా? సింపుల్​గా రద్దు చేసుకోండిలా! - Free Look Period In Insurance

ABOUT THE AUTHOR

...view details