Best Upcoming Cars Under 10 Lakhs : మన దేశంలో కార్లకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. దీంతో అనేక మంది కారును కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు త్వరలోనే కొనేందుకు ప్లాన్ కూడా చేస్తుంటారు. మరి రూ.10 లక్షల బడ్జెట్లో త్వరలో ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న టాప్-5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Citroen Basalt Plus Turbo AT : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ బసాల్ట్ ప్లస్ టర్బో AT కారును ఆగస్టు 15వ తేదీన లాంఛ్ చేయనునట్లు తెలుస్తోంది. మార్కెట్ ధర రూ.7.99 లక్షలుగా ఉండనునట్లు సమాచారం. ఈ కారులో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్తోపాటు సెంట్రల్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలు ఉన్న వారికి ఈ కారు సేఫ్ అనే చెప్పాలి.
- ఇంజిన్ : ప్యూర్ టెక్ 110
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్
- గ్యేర్ బాక్స్: 6-స్పీడ్
- సీటింగ్ కెపాసిటీ : 5
- మైలేజ్ : 19.05 కి.మీ/ లీటర్
- ఫ్యూయల్ కెపాసిటీ: 45 లీటర్లు
2. Citroen Basalt Max Turbo :సిట్రోయెన్ సంస్థ బసాల్ట్ మాక్స్ టర్బో పేరుతో మరో కారును కూడా త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఈ కారు కూడా ఆగస్టు 15వ తేదీన లాంఛ్ చేయనుందట. బసాల్ట్ మాక్స్ టర్బో వెహికల్లో కూడా మంచి సేఫ్టీ ఫీచర్లను తీసుకురానుంది. రూ.7.99 లక్షలకు సేల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
- ఇంజిన్ : ప్యూర్ టెక్ 110- 1199సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మన్యువల్
- గ్యేర్ బాక్స్: 6-స్పీడ్
- సీటింగ్ కెపాసిటీ : 5
- మైలేజ్ : 19.05 కి.మీ/ లీటర్
- ఫ్యూయల్ కెపాసిటీ: 45 లీటర్లు
3. Toyota Belta :ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా బెల్టా మోడల్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 21వ తేదీన మార్కెట్లోకి రూ.10 లక్షల ధరతో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి సియాజ్, హోండా సిటీ, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా వంటి పలు కార్లకు గట్టీ పోటీనివ్వనుంది.
- ఇంజిన్ : 1462 సీసీ
- ఫ్యూయెల్ టైప్ : పెట్రోల్
- ట్రాన్స్మిషన్ : మన్యువల్