Best Tips For Protect Bike From Thefts :బైక్స్ అంటే యూత్‌కు పిచ్చి. రోడ్ల మీద రయ్ రయ్ మంటూ దూసుకెళ్తుంటారు. ఆఫీసుకు వెళ్లడం మొదలు. వేరే ఇతర అవసరాల కోసం ఎక్కడికి వెళ్లాలన్నా బైక్ బెస్ట్ ఆప్షన్. మరి అంతగా ఇష్టపడే బైక్‌ను దొంగలు ఎత్తుకెళ్తే? అది కూడా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా అయితే చాలా బాధ పడతాం. మరి అలాంటివి జరగకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. దాంతో ప్రతి పని స్మార్ట్ అయింది. ఉన్న చోటు నుంచే క్షణాల్లో పని కంప్లీట్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ క్రమంలోనే దేశంలో జరుగుతున్న దొంగతనాలను ఆపేందుకు ప్రభుత్వాలు ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ, నూతన టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. అయినా నిత్యం ఏదో ఒక చోట బంగారు ఆభరణాల దొంగతనాలు, బైక్ చోరీలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అందుకు కారణం దొంగలు కూడా నయా టెక్నాలజీ యూజ్ చేయడమే. దాంతో బైక్ , ఇతర వాహనాలు లాక్ చేసినా దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. కాబట్టి మీకు ద్విచక్రవాహనం ఉంటే లాక్ చేయడంతో పాటు ఈ టిప్స్ పాటిస్తే మీ వాహనం సేఫ్ అవ్వడమే కాకుండా ఎవరైనా దొంగిలిస్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. ఇంతకీ ఆ టిప్స్ ఏంటంటే.
సరైన ప్లేస్‌లో పార్క్ చేయడం :మీ వెహికల్ దొంగతనానికి గురికాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన మొదటి పని బైక్‌ను సరైన ప్లేస్‌లో పార్క్ చేయడం. ఎప్పుడూ చాలా సురక్షితంగా, బహిరంగ ప్రదేశాల్లో మీ వాహనం పార్క్ చేయండి. ఒకవేళ మీరు ఎక్కువ సేపు వాహనాన్ని పార్కింగ్‌లో ఉంచాలంటే జనాలు తిరిగే చోట, సెక్యూరిటీ ఉన్న చోట నిలపడం ఉత్తమం. ఆ ఫెసిలిటీ లేకపోతే పెయిడ్ పార్కింగ్ బెటర్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.
చైన్ లాక్
మీ బైక్ సురక్షితంగా ఉండాలంటే చైన్ లాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందుకోసం స్టీల్ చైన్, లాక్ కొనుగోలు చేయండి. ఇది చాలా వరకు ద్విచక్రవాహనం దొంగతనానికి గురికాకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా బయటకువెళ్లినప్పుడు మీ వెంట దీనిని తీసుకెళ్లండి. పార్కింగ్ చేసే చోట ఏదైనా స్తంభానికి లేదా గట్టి సపోర్టింగ్ ఇచ్చే దానికి చైన్ లాక్‌తో లాక్ చేయండి.