Best Scooters Under 1.5 Lakh :ఇండియాలో స్కూటీలకు ఉన్న క్రేజే వేరు. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ వినియోగించడానికి ఇవి అనువుగా ఉంటాయి. పైగా ఇరుకైన రోడ్లలో కూడా సులువుగా దూసుకుపోవచ్చు. చిన్న చిన్న లగేజ్‌లను కూడా హాయిగా మీతో పాటు తీసుకెళ్లిపోవచ్చు. ఇక కాలేజ్‌కు, ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు కూడా ఇవి ఎంతో అనువుగా ఉంటాయి. అందుకే వీటికి భారత మార్కెట్లో మంచి క్రేజ్ ఉంటోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో, అదిరిపోయే డిజైన్‌తో, ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటీలను మార్కెట్లోకి తెస్తున్నాయి. అందులో రూ.1.5 లక్షల బడ్జెట్లో ఉన్న టాప్-10 స్కూటర్స్ గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
1. Honda Activa 6G :భారతదేశంలోని టాప్-5 బెస్ట్ సెల్లింగ్ స్కూటీల్లో హోండా యాక్టివా 6జీ ఒకటి. ఒక లక్ష బడ్జెట్లోపు మంచి స్కూటీ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కూటీ 3 వేరియంట్లలో, 6 రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ - 109.51 సీసీ
- పవర్ - 7.79 PS
- టార్క్ - 8.84 Nm
- మైలేజ్ - 59.5 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 106 కేజీ
- బ్రేక్స్ - డ్రమ్
Honda Activa 6G Price :మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.79,285 - రూ.84,285 వరకు ఉంటుంది.
2. TVS Jupiter :టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన వాటిలో ది బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ జూపిటర్. దీనిలో కొత్తగా హైబ్రిడ్ ఇంజిన్ కూడా అమర్చారు. దీని వల్ల స్కూటీ పెర్ఫార్మెన్స్, మైలేజ్ రెండూ పెరుగుతాయని కంపెనీ చెబుతోంది. ఈ స్కూటీ 4 వేరియంట్లలో, 6 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ - 113.3 సీసీ
- పవర్ - 8.02 PS
- టార్క్ - 9.8 Nm
- మైలేజ్ - 47 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 105 కేజీ
- బ్రేక్స్ - డ్రమ్
TVS Jupiter Price : మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర సుమారుగా రూ.77,100 - 88,850 వరకు ఉంటుంది.
3. Suzuki Access 125 : భరతదేశంలోని మోస్ట్ పాపులర్ స్కూటర్లలో సుజుకి యాక్సెస్ 125 ఒకటి. ఈ టూ-వీలర్ 4 వేరియంట్లలో, 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 124 సీసీ
- పవర్ - 8.7 PS
- టార్క్ - 10 Nm
- మైలేజ్ - 45 కి.మీ/లీటర్
- కెర్బ్ వెయిట్ - 104 కేజీ
- బ్రేక్స్ - డ్రమ్
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.82,991 - రూ.93,592 వరకు ఉంటుంది.
4. Bajaj Chetak :ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకునేవారికి బజాజ్ చేతక్ మంచి ఛాయిస్ అవుతుంది. ఈ స్కూటీ 7 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తుంది.
- మోటార్ - BLDC
- మోటార్ పవర్ - 4.2 కిలోవాట్
- రేంజ్ - 123 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ - 2.88 Kwh
- కెర్బ్ వెయిట్ - 134 కేజీ
- టాప్ స్పీడ్ - 63 కి.మీ/గంట
Bajaj Chetak Price :మార్కెట్లో ఈ బజాజ్ చేతక్ స్కూటర్ ధర సుమారుగా రూ.99,998 - రూ.1.56 లక్షలు ఉంటుంది.
5. Ola S1 Pro :ఇండియాలోని బెస్ట్ సెల్లింగ్ ఈవీ స్కూటర్లలో ఓలా ఎస్1 ప్రో ఒకటి. ఇది సింగిల్ వేరియంట్‌లో, 5 డిఫరెంట్ కలర్స్‌లో లభిస్తుంది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 181 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. పైగా దీనిలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ కన్సోల్ ఉంటుంది. ఫలితంగా నావిగేషన్ చాలా ఈజీ అవుతుంది.
- రేంజ్ - 195 కి.మీ/ ఫుల్ ఛార్జ్
- బ్యాటరీ కెపాసిటీ - 4 Kwh
- కెర్బ్ వెయిట్ - 116 కేజీ
- టాప్ స్పీడ్ - 115 కి.మీ/గంట
- బ్యాటరీ వారెంటీ - 8 సంవత్సరాలు
Ola S1 Pro Price : మార్కెట్లో ఈ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ధర సుమారుగా రూ.1.15 లక్షల వరకు ఉంటుంది.