Best Scooters For Working Women And College Students :వర్కింగ్ ఉమెన్ ఇంట్లో పనులు అన్నీ పూర్తి చేసి, ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కాలేజీ అమ్మాయిలు సమయానికి క్లాస్‌లకు వెళ్లకతప్పదు. బస్సులు, రైళ్లలో ప్రయాణం చేయాలంటే, విపరీతమైన రద్దీగా ఉంటుంది. ఒక్కోసారి వాటి వల్ల ఆఫీసుకు, కాలేజీలకు వెళ్లడం ఆలస్యం అవుతుంది. దీనితో బాస్‌తో, టీచర్లతో తిట్లు తినాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మహిళలు మంచి టూ-వీలర్ కొనాలని ఆశపడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్‌లో కాలేజీ అమ్మాయిలకు, ఉద్యోగం చేసే మహిళలకు ఉపయోగపడే టాప్-10 స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
1. Honda Activa 6G Features : ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్లో 109.50 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 7.68 PS పవర్, 5250 rpm వద్ద 8.79 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్కూటర్లలో హోండా యాక్టివా 6జీ కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్‌కు బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
Honda Activa 6G Price : మార్కెట్లో ఈ హోండా యాక్టివా 6జీ స్కూటర్ ధర సుమారుగా రూ.63,912 నుంచి రూ.65,412 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
2. Yamaha Fascino 125 Features : ఈ యమహా ఫాసినో 125 స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 6500 rpm వద్ద 8.2 PS పవర్, 5000 rpm వద్ద 9.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 58 కి.మీ మైలేజ్ ఇస్తుంది. తక్కువ బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని అనుకునే వర్కింగ్ ఉమెన్‌కు, కాలేజీ అమ్మాయిలకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Yamaha Fascino 125 Price : మార్కెట్లో ఈ యమహా ఫాసినో స్కూటర్ ధర సుమారుగా రూ.66,430 నుంచి రూ.68,930 వరకు ఉంటుంది.
3. Suzuki Access 125 Features : ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 6750 rpm వద్ద 8.6 PS పవర్, 5500 rpm వద్ద 10 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 53 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు, కాలేజీ అమ్మాయిలకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
Suzuki Access 125 Price : మార్కెట్లో ఈ సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ధర సుమారుగా రూ.64,800 నుంచి రూ.69,500 వరకు ఉంటుంది.
4. TVS Jupiter Features : ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో 109.7 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 7.89 PS పవర్, 5500 rpm వద్ద 8.4 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. రూ.70 వేలు బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలని అనుకునే మహిళలకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
TVS Jupiter Price :మార్కెట్లో ఈ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధర రూ.61,449 నుంచి రూ.67,911 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.
5. Piaggio Vespa Features : ఈ పియాజియో వెస్పా స్కూటర్లో 125 సీసీ సామర్థ్యం ఉన్న ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 9.52 PS పవర్, 6250 rpm వద్ద 9.9 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్స్. ఈ స్కూటర్ లీటర్‌కు 45 కి.మీ మైలేజ్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్ ఈ స్కూటర్‌పై ఓ లుక్కేయవచ్చు.
Piaggio Vespa Price :మార్కెట్లో ఈ పియాజియో వెస్పా స్కూటర్ ధర రూ.74,831 నుంచి రూ.1,07,781 ప్రైస్ రేంజ్లో ఉంటుంది.