Best Saving Schemes In India 2024 :'ధనమేరా అన్నింటికీ మూలం - ఈ ధనం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం' అని ఓ సినీ కవి అద్భుతంగా పాట రాశారు. ఇది నిజ జీవితానికి చక్కగా అన్వయం అవుతుంది. డబ్బు ఆదా చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా సుఖంగా జీవించడానికి వీలవుతుంది. మీ ఆర్థిక లక్ష్యం కూడా సులువుగా నెరవేరుతుంది. అందుకే ఈ వరల్డ్ సేవింగ్స్ డే (అక్టోబర్ 30) రోజున భారతదేశంలో ఉన్న టాప్-10 పొదుపు పథకాలపై ఓ లుక్కేద్దాం రండి.
1. ఫిక్స్‌డ్ డిపాజిట్లు :ఎలాంటి నష్టభయం లేకుండా, మంచి రాబడులు సంపాదించాలని ఆశించేవారికి ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఛాయిస్ అవుతాయి. ఇన్‌కం ట్యాక్‌స్ రూల్, సెక్షన్ 80సీ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
2. యులిప్ :బీమా, పెట్టుబడుల కలయికగా యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ (ULIP) ఉంటాయి. బీమా కంపెనీ ఈ పథకంలో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని జీవిత బీమా కోసం కేటాయిస్తుంది. మిగతా డబ్బును ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంది. దీని వల్ల మీకు ఇన్సూరెన్స్‌తో పాటు, దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉంటుంది.
3. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ELSS) :ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. అయితే దీని లాకిన్ పీరియడ్ కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. మీరు ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిలో 80 శాతాన్ని ఈక్విటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్ల మీకు మంచి రాబడితోపాటు, పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
4. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) :పదవీ విరమణ తరువాత నెలనెలా పింఛన్ కావాలని ఆశించే వారికి నేషనల్ పెన్షన్ స్కీమ్ చాలా బాగుంటుంది.
5. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) :60 ఏళ్లు పైబడిన వారి కోసం బ్యాంకులు, పోస్టాఫీస్‌ల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే, వడ్డీ రూపంలో కచ్చితమైన ఆదాయం వస్తుంది.
Govt Savings Schemes In India
6.సుకన్య సమృద్ధి యోజన:10 ఏళ్లలోపు ఆడబిడ్డల కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ప్రభుత్వ పథకం ఇది. తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు గరిష్ఠంగా ఇద్దరు ఆడ పిల్లల కోసం 2 వేర్వేరు ఖాతాలు తెరవవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్ల తరువాత గానీ, లేదా ఆడబిడ్డకు 18 ఏళ్లు నిండిన తరువాత వివాహ ఖర్చుల కోసం గానీ ఈ పథకం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.
7. ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) :60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు పెన్షన్ అందించడం కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టినవారికి సంవత్సరానికి 8 శాతం వడ్డీ రేటు చొప్పున లెక్క వేసి పెన్షన్ ఇస్తుంటారు. అయితే ఇన్వెస్టర్లు నెల/ 3నెలలు/ 6నెలలు/ 12నెలల వ్యవధితో ఈ పెన్షన్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది.
8. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :భారతదేశంలోని మోస్ట్ పాపులర్ పథకాల్లో పీపీఎఫ్ ఒకటి. ఈ పథకంలో సంవత్సరానికి 7.1% వడ్డీ రేటు ఇస్తారు. పైగా ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉంటాయి. అసలుపైనే కాదు, వడ్డీపై కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.
9. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ :ఎలాంటి రిస్క్ లేకుండా, మంచి రాబడి ఇచ్చే పథకాల కోసం చూసేవారికి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ ఒక మంచి ఛాయిస్ అవుతుంది. దేశంలోని ఏదైనా పోస్టాఫీస్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకం ద్వారా పొందిన రాబడిపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
10. Post Office Savings Schemes :బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, సాధారణంగా మధ్యలో ఉపసంహరించుకోవడానికి వీలు పడదు. కానీ పోస్టాఫీస్ స్కీమ్‌ల్లో అలా ఉండదు. అవసరమనుకుంటే చిన్న నోటీస్ ఇచ్చి, పాక్షికంగా లేదా పూర్తిగా పథకంలోని డబ్బులను తీసుకోవచ్చు. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ పోస్టాఫీస్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (ఎస్‌బీ)
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (పీపీఎఫ్)
- సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్ (ఎస్‌సీఎస్‌ఎస్)
- సుకన్య సమృద్ధి అకౌంట్ (ఎస్‌ఎస్ఏ)
- కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
- మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్
- పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్, 2021
నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
లేడీస్ స్పెషల్ - 'రివెంజ్ సేవింగ్స్' చేయండి - భవిష్యత్‌లో కోటీశ్వరురాలు అవ్వండి! - Revenge Savings Trend
మీ దగ్గర చాలా సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయా? ఈ 7 టిప్స్ మీ కోసమే! - Savings Account Manage Tips