Best Credit Cards 2024 : మన జీవితంలో అకస్మాత్తుగా అనేక ఆర్థిక అవసరాలు వస్తుంటాయి. అటువంటి అత్యవసర పరిస్థితుల్లో మన దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు అనేక బ్యాంకులు అందించే ఫీచర్లను సరిపోల్చుకోవాలి. రివార్డ్ పాయింట్లు, అర్హత, రెన్యూవల్ ఫీజు, ఉచిత లాంజ్ యాక్సెస్ వంటి ఇతర ప్రయోజనాలను పరిశీలించాయి. ఈ స్టోరీలో హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా, స్టాండర్డ్ చార్టర్డ్, ఐడీబీఐ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై అందించే ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం పదండి.
1. HDFC Bank Diners Club Millennia Card
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డినర్స్ క్లబ్ మిల్లినీయా కార్డు కావాలకునేవారు రూ.1,000 జాయినింగ్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. కార్డు రెన్యువల్ ఫీజు కూడా అంతే మొత్తంలో ఉంటుంది. అలాగే అదనంగా పన్నులు కట్టాల్సి ఉంటుంది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డినర్స్ క్లబ్ మిల్లినీయా కార్డు తో ఏడాది వ్యవధిలో రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే, వచ్చే ఏడాది ఫ్రీగా మెంబర్ షిప్ రెన్యువల్ అవుతుంది.
- రివార్డ్ పాయింట్ల రూపంలో క్యాష్ బ్యాక్ అందుతుంది. వీటిని స్టేట్మెంట్ బ్యాలెన్స్‌కు వ్యతిరేకంగా రిడీమ్ చేసుకోవచ్చు. అందుకు కనీసం 500 రివార్డు పాయింట్లు ఉండాలి.
- ఒక రివార్డు పాయింట్‌కు 30 పైసలు లభిస్తాయి. ఈ రివార్డు పాయింట్లను ఎయిర్ మైళ్లకు రీడీమ్ చేసుకోవచ్చు.
- స్టేట్మెంట్ బ్యాలెన్స్‌కు వ్యతిరేకంగా రిడెంప్షన్ 1 రివార్డ్ పాయింట్‌కు ఒక రూపాయి వస్తుంది.
- రిడీమ్ చేయని రివార్డ్ పాయింట్లు రెండేళ్ల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి.
2. ICICI Bank
ఐసీఐసీఐ బ్యాంకు ఎమరాల్డే ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డ్, ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్, సప్ఫిరో క్రెడిట్ కార్డ్, రూబిక్స్ క్రెడిట్ కార్డ్ సహా పలు క్రెడిట్ కార్డులను అందిస్తోంది. వాటి ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.
Emeralde Private Metal Credit Card
- ఎమరాల్డే ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు సభ్యత్వ రుసుము రూ.12,500 వరకు ఉంటుంది. అదనంగా జీఎస్టీ పడుతుంది.
- ఈ కార్డు హోల్డర్లకు కాంప్లిమెంటరీ ఈజీడైనర్ ప్రైమ్ మెంబర్ షిప్ 12 నెలలు ఫ్రీ.
- అలాగే ఎపిక్యుర్ మెంబర్ షిప్ వస్తుంది (ఏడాది ఫ్రీ). ఒకరాత్రి హోటల్ లో ఫ్రీగా బస చేయవచ్చు.
- కార్డు యాక్టివేషన్ తర్వాత బోనస్ గా 12,500 ఐసీఐసీఐ రివార్డు పాయింట్లు.
- కార్డ్ హోల్డర్స్‌కు మొదటి రూ.4లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చులపై రూ.3,000 విలువైన రెండు ఈజీ మై ట్రిప్ ఎయిర్ ట్రావెల్ వోచర్లు లభిస్తాయి.
- అపరిమిత కాంప్లిమెంటరీ దేశీయ, అంతర్జాతీయ లాంజ్ యాక్సెస్.
- భారతదేశంలోని విమానాశ్రయాలలో అపరిమిత కాంప్లిమెంటరీ స్పా యాక్సెస్.
- గరిష్ఠంగా రూ.750 విలువైన సినిమా టికెట్లపై బయ్ వన్ గేట్ వన్ టికెట్. నెలకు నాలుగుసార్లు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చు.
Sapphiro Credit Card
- ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.6,500. అదనంగా జీఎస్టీ
- ఈ కార్డుతో రూ.9,000 విలువైన వెల్కమ్ వోచర్లు పొందవచ్చు
- ఏడాదికి రెండు కాంప్లిమెంటరీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్
- మూడు నెలలకు నాలుగు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్
Rubyx Credit Card
- ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.3000. అదనంగా జీఎస్టీ
- ఈ కార్డుతో రూ.5,000 విలువైన వెల్కమ్ వోచర్లు పొందవచ్చు.
- బుక్ మైషో, ఐనాక్స్ లో సినిమా టికెట్ లపై నెలకు రెండుసార్లు 25 శాతం తగ్గింపు.
- రూ. కోటి విలువైన విమాన ప్రమాద బీమా.
- నెలకు రెండు గోల్ఫ్ కాంప్లిమెంటరీ రౌండ్లు
Coral Credit Card
- ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ.3000. రెన్యూవల్ ఫీజు కూడా అంతే మొత్తంలో ఉంటుంది.
- బుక్ మైషో, ఐనాక్స్ లో సినిమా టికెట్లపై నెలకు రెండుసార్లు 25 శాతం తగ్గింపు.
- త్రైమాసికానికి ఒక కాంప్లిమెంటరీ రైల్వే, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్.
- హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంపుల వద్ద ఒక శాతం ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు.