ETV Bharat / bharat

స్త్రీలకే కాదు, పురుషులకు కూడా గౌరవ మర్యాదలుంటాయి: కేరళ హైకోర్టు - KERALA HIGH COURT ABOUT MEN PRIDE

మలయాళం సీనియర్‌ నటుడు, దర్శకుడు బాలచంద్ర మేనన్‌కు ఊరట - బెయిల్ మంజూరు చేసిన కేరళ హైకోర్ట్​

Kerala High Court
Kerala High Court (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2024, 9:10 PM IST

Kerala High Court About Men Pride : సమాజంలో మహిళలకే కాదు, పురుషులకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయని కేరళ హైకోర్ట్ వ్యాఖ్యానించింది. ఓ నటితో అసభ్యంగా ప్రవర్తించారన్న అభియోగాలపై సీనియర్‌ నటుడు, దర్శకుడు బాలచంద్ర మేనన్‌పై నమోదైన కేసు విచారణ సందర్భంగా కేరళ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఈ కేసులో సదరు నటుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక వెలుగులోకి వచ్చిన అనంతరం, గతంలో తామూ వేధింపులు ఎదుర్కొన్నామంటూ అనేక మంది నటీమణులు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2007లో ఓ సినిమా షూటింగ్‌లో దర్శకుడు బాలచంద్ర మేనన్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఓ నటి ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఐపీసీలోని పలు సెక్షన్‌ల కింద ఆయనపై కేసు నమోదయ్యింది.

అతని వాదనలో బలం ఉంది!
2007లో జరిగిన ఘటనకు సంబంధించి 17 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని, కేవలం తన ప్రతిష్ఠను దెబ్బతీయడమే వారి ఉద్దేశమని పేర్కొంటూ మేనన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన జస్టిస్‌ పీవీ కున్హికృష్ణన్‌ నటుడి వాదనలో బలం ఉందన్నారు. 40 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన రెండు జాతీయ అవార్డులు అందుకోవడంతో పాటు ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీతో సత్కరించిందన్నారు.

17 ఏళ్ల తర్వాత ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైందని, దానిపై విచారణ కొనసాగుతోందని న్యాయమూర్తి పేర్కొన్నారు. గౌరవ మర్యాదలు కేవలం మహిళలకే కాకుండా పురుషులకూ ఉంటాయన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా పిటిషనర్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నామని చెప్పారు. మరోవైపు, కేసుకు సంబంధించి విచారణ అధికారి ముందు హాజరు కావాలని మేనన్‌ను ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తు తర్వాత ఒకవేళ మేనన్‌ను అరెస్టు చేయాలని దర్యాప్తు అధికారి ప్రతిపాదిస్తే రూ.50,000 బాండ్​, ఇద్దరు పూచీకత్తుతో అతడిని విడుదల చేయాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.