ETV Bharat / state

కుంట్లూరు​ చెరువులో నుంచి రహదారి ఎలా వేస్తారు? - రంగనాథ్ సీరియస్ - AV RANGANATH IPS IN PEDDAAMBERPET

కుంట్లూర్ పెద్ద చెరువు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్​ - పెద్ద అంబర్​పేట్ మున్సిపల్ కమిషనర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన రంగనాథ్

HYDRA IN KUNTLOOR
AV RANGANATH IPS IN PEDDAAMBERPET (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 10:23 PM IST

Hydra Commissioner in Pedda Amberpet : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట్​లోని కుంట్లూరు పెద్ద చెరువు కబ్జా జరుగుతుందన్న ఆరోపణలపై స్పందించిన హైడ్రా అధికారులు నిన్నటి నుంచి సర్వే ప్రారంభించారు. హైడ్రా అధికారులు సర్వే చేస్తున్న కుంట్లూరు​ పెద్ద చెరువు స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు పరీశీలించారు. చెరువులో ఏకంగా మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేయడంపై పెద్ద అంబర్​పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డిపై రంగనాథ్ తీవ్ర​ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కమిషనర్​పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

చెరువు ఎఫ్​టీఎల్​(ఫుల్​ ట్యాంక్​ లెవల్​)లో రోడ్డు వేసేందుకు నిధులు ఎలా కేటాయిస్తారని రంగనాథ్​ నిలదీశారు. సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేసి చెరువు పట్టా, భూమి బార్డర్​లో రోడ్డు ఫిక్స్​ చేయాలని హైడ్రా సిబ్బందికి ఆయన సూచించారు. చెరువుకు సంబంధించిన భూమిలో రోడ్డు వేస్తే మాత్రం వెంటనే తొలగించాలని హైడ్రా సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.

ఏకంగా 96 ఎకరాల చెరువునే! : చెరువులో రోడ్డు నిర్మాణం థర్డ్ పార్టీ చేశారని పెద్ద అంబర్​పేట్ మున్సిపల్ కమిషనర్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి హైడ్రా కమిషనర్​కు నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోడ్డు వ్యవహారం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ పార్టీ రోడ్డును ఏర్పాటు చేసినప్పుడు వారిపై కేసులు పెట్టాలి. యాక్షన్​ తీసుకోవాలి కదా? ఇవన్ని ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కుంట్లూరులోని 185వ సర్వే నెంబర్లలోని దాదాపు 96 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోందంటూ హైడ్రాకు స్థానికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు నిన్ననే హైడ్రా అధికారులు అక్కడకు చేరుకుని సర్వే పనులు ప్రారంభించారు.

కుంట్లూరులోని 185వ సర్వే నెంబర్​లోని 95 ఎకరాల చెరువు భూమిలో మున్సిపాలిటీ నుంచి రూ. 20 లక్షలు కేటాయించి దాని తర్వాత ఉన్న వ్యవసాయ భూమి వద్దకు రోడ్ వేసేందుకు మున్సిపల్ వైస్​ ఛైర్​పర్సన్, బంధువులు, కమిషనర్ రవీందర్ రెడ్డిలు సర్వసభ్య సమావేశంలో ఇటీవల తీర్మానించారు.

హైడ్రా మరో కీలక నిర్ణయం - కొత్త ఏడాది నుంచి ప్రతి సోమవారం ప్రజలకు ఆ అవకాశం

చెరువుల పునరుద్ధరణ బాధ్యత తీసుకున్న హైడ్రా - ముందు ఆ 8 చెరువులే టార్గెట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.