Best Commercial Cars In 2024 :భారతదేశంలో నేడు కమర్షియల్ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రయాణికులను, వస్తువులను గమ్యస్థానాలకు చేర్చుతూ, చాలా మంది బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. మరి మీరు కూడా మంచి కమర్షియల్ కార్‌ను కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియాలో నేడు చాలా మంచి బ్రాండెడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు ట్యాక్సీలుగా, క్యాబ్‌లుగా వాడుకుని, డబ్బులు సంపాదించవచ్చు.
ఎలాంటి కారు ఎంచుకోవాలి?
కమర్షియల్ వెహికల్స్‌లో ట్యాక్సీల నుంచి పికప్ ట్రక్కుల వరకు చాలా రకాలు ఉంటాయి. అయితే వీటిలో దేనిని ఎంచుకోవాలనేదే అసలు ప్రశ్న. మీరు కనుక వస్తువులను బట్వాడా చేయాలని అనుకుంటే, పికప్ ట్రక్కులను ఎంచుకోవడం మంచిది. అలాకాకుండా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చి, డబ్బులు సంపాదించాలంటే క్యాబ్, ట్యాక్సీలుగా పనికి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్‌ను (కార్స్, వ్యాన్స్) కొనుగోలు చేయాలి.
ఇండియాలోని టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే!
ఇండియన్ మార్కెట్లో చాలా రకాల కార్లు ఉన్నాయి. అయితే కమర్షియల్ యుసేజ్ కోసం హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎస్‌యూవీలు బాగుంటాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో తక్కువ బడ్జెట్లో, మంచి మైలేజ్, ఫీచర్స్, స్పెక్స్ సహా విశాలమైన బూట్‌స్పేస్ ఉన్న టాప్-10 కార్ల గురించి తెలుసుకుందాం.
1. Maruti Suzuki XL6 :పెళ్లిళ్లకు, ఫ్యామిలీ ట్రిప్‌లకు కార్ అద్దెకు ఇవ్వాలంటే మారుతి సుజుకి ఎక్స్ఎల్6 మంచి ఆప్షన్ అవుతుంది. ఇది ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. లెగ్‌రూమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. రఫ్ రోడ్లపై, ఎంత స్పీడ్‌గా వెళ్లినా కారు స్టేబుల్‌గా ఉంటుంది. కనుక ప్యాసింజర్లు ప్రయాణించడానికి ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. కనుక మంచి కమర్షియల్ కార్ కొనాలని అనుకునేవారు దీనిని తీసుకోవచ్చు.
Maruti Suzuki XL6 Specs :
- ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ - 1462 సీసీ
- మ్యాక్స్ పవర్ - 101.65 bhp@6000rpm
- మ్యాక్స్ టార్క్ - 136.8 Nm@4400rpm
- సీటింగ్ కెపాసిటీ - 6
- బాడీ టైప్ - ఎంయూవీ
Maruti Suzuki XL6 Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి కారు ధర సుమారుగా రూ.13.57 లక్షల నుంచి రూ.17.35 లక్షల వరకు ఉంటుంది.
2. Renault Triber : రెనో ట్రైబర్ బోల్డ్ ఎక్స్టీరియర్తో, బ్యూటిఫుల్ ఇంటీరియర్‌తో వస్తుంది. దీనిలో చాలా మంచి ఫీచర్లు, స్పెక్స్ ఉన్నాయి. దీనిలో మంచి మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు ఆనందించేలా మంచి సంగీతాన్ని మీరు వినిపించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఇది ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. ఈ బండి ఫెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
Renault Triber Specs :
- ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ - 999 సీసీ
- మ్యాక్స్ పవర్ - 71.01 bhp@6250rpm
- మ్యాక్స్ టార్క్ - 96 Nm@3500rpm
- సీటింగ్ కెపాసిటీ - 7
- బాడీ టైప్ - ఎంయూవీ
Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్ కారు ధర సుమారుగా రూ.7.04 లక్షల నుంచి రూ.10.49 లక్షల వరకు ఉంటుంది.
3. Maruti Suzuki Ciaz : సిటీలో కంఫర్టబుల్‌గా డ్రైవ్ చేయడానికి మారుతి సుజుకి సియాజ్ చాలా బాగుంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి దీనిలో చాలా స్పేస్ ఉంటుంది. దీనిలోని నోయిస్ లెస్ ఇంజిన్ ఉంటుంది. ఇది స్టైలిష్ డిజైన్‌తో, ఎక్స్లెంట్ పికప్‌తో వస్తుంది.
Maruti Suzuki Ciaz Specs :
- ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ - 1462 సీసీ
- మ్యాక్స్ పవర్ - 103.25 bhp@6000rpm
- మ్యాక్స్ టార్క్ - 138 Nm@4400rpm
- సీటింగ్ కెపాసిటీ - 5
- బాడీ టైప్ - సెడాన్
Maruti Suzuki Ciaz Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి సియాజ్ కారు ధర సుమారుగా రూ.10.74 లక్షల నుంచి రూ.14.56 లక్షలు ఉంటుంది.
4. Maruti Suzuki Dzire :తక్కువ బడ్జెట్లో మంచి కమర్షియల్ కారు కొనాలని అనుకునేవారికి మారుతి సుజుకి డిజైర్ మంచి ఛాయిస్ అవుతుంది. దీనిలో చాలా మంచి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. కనుక ప్యాసింజర్లు కూర్చోవడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. పైగా ఇది ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తుంది. దీనిని మెయింటైన్ చేయడం కూడా తేలిక. అన్నింటికంటే ప్రధానంగా దీని రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది.
Maruti Suzuki Dzire Specs :
- ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ - 1197 సీసీ
- మ్యాక్స్ పవర్ - 88.50 bhp@6000rpm
- మ్యాక్స్ టార్క్ - 113 Nm@4400rpm
- సీటింగ్ కెపాసిటీ - 5
- బాడీ టైప్ - సెడాన్
Maruti Suzuki Dzire Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి డిజైర్ కార్ ధర సుమారుగా రూ.7.65 లక్షల నుంచి రూ.10.94 లక్షలు ఉంటుంది.
5. Honda Amaze : రూ.10 లక్షల్లోపు మంచి కారు కొనాలని అనుకునేవారికి హోండా అమేజ్ చాలా బాగుంటుంది. దీని డిజైన్ చాలా యూనిక్‌గా ఉంటుంది. దీనితో సిటీలోని హైవీ ట్రాఫిక్‌లోనూ దూసుకుపోవచ్చు. ట్యాక్సీగా, క్యాబ్‌గా వాడుకోవడానికి ఇది చాలా బాగుంటుంది.
Honda Amaze Specs :
- ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ - 1199 సీసీ
- మ్యాక్స్ పవర్ - 88.50 bhp@6000rpm
- మ్యాక్స్ టార్క్ - 110 Nm@4800rpm
- సీటింగ్ కెపాసిటీ - 5
- బాడీ టైప్ - సెడాన్