Best Cars Under 10 Lakhs :రూ.10 లక్షల్లో మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? మైలేజ్ అధికంగా ఇచ్చే కారు కోసం చూస్తున్నారా? బడ్జెట్ కారు అయినప్పటికీ ఫీచర్ల విషయంలో రాజీ పడకూడదని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ లిస్ట్. మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా వంటి దిగ్గజ కంపెనీలు రూ.10 లక్షలకు కాస్త అటూఇటుగా అదిరిపోయే మోడల్స్‌ను అందిస్తున్నాయి. వాటిపై ఓసారి లుక్కేద్దాం పదండి.
Hyundai Creta Features :హ్యుందాయ్ క్రెటా 1482-1497సీసీ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఐదు సీట్లతో ఉండే ఈ కారులో ఆటోమెటిక్, మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అందుబాటులో ఉంది. యూజర్ల ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఈ కారు 17- 18 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Hyundai Creta Price :హ్యుందాయ్ క్రెటా ప్రారంభ ధర రూ.11 లక్షలు. గరిష్ఠంగా రూ.13.39 లక్షల వరకు లభిస్తుంది.
Tata Punch EV Features :ఎలక్ట్రిక్ మోడల్ అయిన టాటా పంచ్ ఈవీలో 5 సీట్లు ఉంటాయి. 25-35 kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ కారులో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 340 కిలోమీటర్ల వరకు నాన్‌స్టాప్ దూసుకెళ్తుంది.
Tata Punch EV Price :ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు. వేరియంట్‌ను బట్టి ధర రూ.12.49 లక్షల వరకు ఉంటుంది.
Maruti Grand Vitara Features :మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్, సీఎన్జీ మోడళ్లలో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తున్న ఈ 5-సీటర్ కారు 20.58 నుంచి 28 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Maruti Grand Vitara Price :మారుతి గ్రాండ్ విటారా బేస్ మోడల్ ధర రూ.10.70 లక్షలుగా ఉంది. ఎక్స్ షోరూంలను బట్టి టాప్ మోడల్ ధర రూ.19.92 లక్షల వరకు ఉంటుంది.
Kia Seltos Features :3 స్టార్ సేఫ్టీ స్టాండర్డ్ కలిగిన కియా సెల్టోస్ 5 సీట్లతో వస్తుంది. మ్యాన్యువల్, క్లచ్‌లెస్ మ్యాన్యువల్, ఆటోమెటిక్ అనే మూడు ట్రాన్స్మిషన్ వ్యవస్థలు ఉన్నాయి. 1482-1497 సీసీ ఇంజిన్‌తో ఉండే కియా సెల్టోస్ గరిష్ఠంగా 20.7 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.
Kia Seltos Price :కియా సెల్టోస్ బేస్ మోడల్ ధర రూ.10.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ రూ.20.30 వరకు ఉంది. మొత్తం ఈ మోడల్లో 32 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
Toyota Rumion Features :పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో టొయోటా రుమియాన్ అందుబాటులో ఉంది. 1462 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు 26.11 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది. మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు ఉంటాయి.
Toyota Rumion Price :టొయోటా రుమియాన్ బేస్ మోడల్ ధర రూ.10.29లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.13.68 వరకు ఉంటుంది. ఆరు వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.
Kia Carens Features :3 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కియా కారెన్స్ 1484-1497 సీసీ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మ్యాన్యువల్, ఆటోమెటిక్, క్లచ్‌లెస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థలు కలిగి ఉంది. 6, 7 సీట్లతో ఇది అందుబాటులో ఉంది.
Kia Carens Price :కియా కారెన్స్ బేస్ మోడల్ ధర రూ.10.45 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. టాప్ మోడల్ ధర రూ.19.45 లక్షల వరకు ఉంటుంది. 23 వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.