Best Cars Under 10 Lakh :మీ ఫ్యామిలీ కోసం మంచి కారు కొనాలని అనుకుంటున్నారా? లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, స్పెక్స్ ఉండాలా? మంచి మైలేజ్ కూడా ఇవ్వాలా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.6 లక్షల - రూ.10 లక్షల బడ్జెట్లో లభిస్తున్న టాప్-9 కార్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Tata Punch : భారత్‌లో ఉన్న బెస్ట్ ఫ్యామిలీ కార్లలో టాటా పంచ్ ఒకటి. పట్టణాల్లో, చిన్న ఫ్యామిలితో కలిసి ప్రయాణించడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇది హ్యాచ్‌బ్యాక్ కారు అయినప్పటికీ, ఎస్‌యూవీ లాంటి స్టైలింగ్‌తో వస్తుంది. ఈ కారు ఇంటీరియర్ చాలా విశాలంగా, మోడ్రన్ ఫీచర్లు కలిగి ఉంటుంది. సేఫ్టీపరంగా చూస్తే, దీనికి 5-స్టార్ క్రాస్ టెస్ట్ రేటింగ్ ఉంది. పైగా దీని ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ చాలా బాగుంటుంది. దీనిలో సీఎన్‌జీ వెర్షన్ కూడా ఉంది. ఈ కారు మొత్తం 35 వేరియంట్లలో, 8 భిన్నమైన రంగుల్లో లభిస్తుంది.
- ఇంజిన్ - 1199 సీసీ
- పవర్ - 72-87 bhp
- టార్క్ - 103 -115 Nm
- ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్/ ఆటోమేటిక్
- డ్రైవ్ టైప్ - FWD
- గ్రౌండ్ క్లియరెన్స్ - 187 mm
- గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్ - 5 స్టార్
- మైలేజ్ - 18.8-20.9 కి.మీ/లీటర్
Tata Punch Price : మార్కెట్లో ఈ టాటా పంచ్ కారు ధర రూ.6.13 లక్షలు - రూ.10.15 లక్షలు వరకు ఉంటుంది.
2. Maruti Swift :మారుతి స్విఫ్ట్ అనేది ఒక మిడ్‌సైజ్ హ్యాచ్‌బ్యాక్. మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది 18 వేరియంట్లు, 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 1197 సీసీ
- పవర్ - 68.8-80.46 bhp
- టార్క్ - 101.8 -111.7 Nm
- ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ - 24.8 - 25.75 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ - పెట్రోల్/సీఎన్‌జీ
Maruti Swift Price : మార్కెట్లో ఈ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.6.49 లక్షల నుంచి రూ.9.60 లక్షలు ఉంటుంది.
3. Maruti Baleno :ఇండియాలోని మోస్ట్ పాపులర్ కార్లలో మారుతి సుజుకి బాలెనో ఒకటి. ఈ కారు 13 వేరియంట్లలో, 8 అందమైన రంగుల్లో లభిస్తుంది. నలుగురు ఉండే చిన్న కుటుంబానికి ఇది చాలా బాగుంటుంది.
- ఇంజిన్ - 1197 సీసీ
- పవర్ - 76.43-88.5 bhp
- టార్క్ - 98.5 -113 Nm
- ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్/ ఆటోమేటిక్
- మైలేజ్ - 22.35 - 22.94 కి.మీ/ లీటర్
- ఫ్యూయెల్ - పెట్రోల్/సీఎన్‌జీ
Maruti Baleno Price : మార్కెట్లో ఈ మారుతి బాలెనో కారు ధర సుమారుగా రూ.6.66 - 9.84 లక్షల వరకు ఉంటుంది.
4. Toyota Taisor : టయోటా టైసర్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. సేఫ్టీ పరంగా ఇది బెస్ట్ కారు అని చెప్పుకోవచ్చు. హైవేల్లో, సిటీల్లో ప్రయాణించడానికి ఇది బాగుంటుంది. ఈ టైసర్ కారు ఇంటీరియర్ చాలా విశాలంగా ఉంటుంది. పైగా దీనిలో చాలా లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ కారు 16 వేరియంట్లలో, 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
- ఇంజిన్ - 998 - 1197 సీసీ
- పవర్ - 76.43-98.69 bhp
- టార్క్ - 98.5 -147.6 Nm
- సీటింగ్ కెపాసిటీ - 5
- మైలేజ్ - 20 - 22.8 కి.మీ/ లీటర్
Toyota Taisor Price : మార్కెట్లో టయోటా టైసర్ కారు ధర సుమారుగా రూ.7.74 లక్షలు - రూ.13.08 లక్షల వరకు ఉంటుంది.
5. Mahindra Bolero : ఇండియాలోని మోస్ట్ పాపులర్ కార్లలో మహీంద్రా బొలెరో ఒకటి. ఎలాంటి రోడ్లపై అయినా సుఖంగా ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది. ఈ కారు 3 వేరియంట్లలో, 3 కలర్లలో లభిస్తుంది. సేఫ్టీ పరంగానూ ఇది అద్భుతంగా ఉంటుంది.
- ఇంజిన్ - 1493 సీసీ
- పవర్ - 74.96 bhp
- టార్క్ - 210 Nm
- ట్రాన్స్‌మిషన్ - మాన్యువల్
- గ్రౌండ్ క్లియరెన్స్ - 180 mm
- మైలేజ్ - 16 కి.మీ/ లీటర్