తెలంగాణ

telangana

ETV Bharat / business

కాలేజ్​ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే! - best tvs bikes Under 1 Lakh

Best Bikes Under 1.5 Lakh For College Students In Telugu : మీరు కాలేజ్ స్టూడెంట్సా? మంచి బైక్​ కొనాలని ఆశపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. రూ.1.5 లక్షల బడ్జెట్లో, మంచి లుక్స్​, బెస్ట్ ఫీచర్స్​, సూపర్​ మైలేజ్​ ఇచ్చే టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 10 Bikes Under 1.5 Lakh for college students
Best Bikes Under 1.5 Lakh for college students

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 2:40 PM IST

Best Bikes Under 1.5 Lakh For College Students : కాలేజ్ లైఫ్ అంటేనే ఒక జోష్ ఉంటుంది. మంచి బైక్​పై స్నేహితులతో కలిసి చక్కర్లు కొట్టాలని కుర్రకారుకు ఆశగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రముఖ టూ-వీలర్ కంపెనీలు అన్నీ మంచి లుక్స్​, బెస్ట్ ఫీచర్స్ ఉండే బైక్​లను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.1.5 లక్షల బడ్జెట్లోని, కాలేజ్ స్టూడెంట్స్​కు సూట్​ అయ్యే టాప్​-10 బైక్స్​పై ఓ లుక్కేద్దాం.

1. Hero Xtream 125R Features : ఈ హీరో ఎక్స్​ట్రీమ్ 125ఆర్​ బైక్​లో 124.7 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8250 rpm వద్ద 11.4 bhp పవర్​, 6000 rpm వద్ద 10.5 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 66 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Hero Xtream 125R Price :మార్కెట్లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్ బైక్ ధర రూ.95,000 నుంచి రూ.99,500 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

2. Royal Enfield Hunter 350 Features : ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ హంటర్​ 350 బైక్​లో 349.34 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 6100 rpm వద్ద 20.2 bhp పవర్​, 4000 rpm వద్ద 27 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 36 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Royal Enfield Hunter 350 Price :మార్కెట్లో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ.1,49,900 నుంచి రూ.1,74,430 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

3. Bajaj Pulsar NS 200 Features : ఈ బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​200 బైక్​లో 199.5 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 9750 rpm వద్ద 24.13 bhp పవర్​, 8000 rpm వద్ద 18.74 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 36 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 8 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Bajaj Pulsar NS 200 Price :మార్కెట్లో ఈ బజాజ్​ పల్సర్ ఎన్​ఎస్​ 200 బైక్ ధర సుమారుగా రూ.1,42,055 నుంచి రూ.1,50,686 వరకు ఉంటుంది.

4. TVS Ronin Features :ఈ టీవీఎస్​ రోనిన్​ బైక్​లో 225.9 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7750 rpm వద్ద 20.1 bhp పవర్​, 3750 rpm వద్ద 19.93 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 42 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 7 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

TVS Ronin Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రోనిన్​ బైక్ ధర సుమారుగా రూ.1,49,195 నుంచి రూ.1,72,700 వరకు ఉంటుంది.

5. Honda CB200X Features :ఈ హోండా సీబీ200ఎక్స్​ బైక్​లో 184.4 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 17.03 bhp పవర్​, 6000 rpm వద్ద 15.9 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 43 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Honda CB200X Price : మార్కెట్లో ఈ హోండా సీబీ200ఎక్స్ బైక్ ధర రూ.1,46,999 నుంచి రూ.1,48,560 ప్రైస్​ రేంజ్​లో ఉంటుంది.

6. Yamaha FZ X Features :ఈ యమహా ఎఫ్​జెడ్ ఎక్స్​ బైక్​లో 149 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7250 rpm వద్ద 12.2 bhp పవర్​, 5500 rpm వద్ద 13.3 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 48 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Yamaha FZ X Price : మార్కెట్లో ఈ యమహా ఎఫ్​జెడ్​ ఎక్స్ బైక్ ధర సుమారుగా రూ.1,37,087 నుంచి రూ.1,38,089 వరకు ఉంటుంది.

7. Revolt RV 400 Features :ఈ రివోల్ట్​ ఆర్​వీ 400 అనేది ఒక ఎలక్ట్రిక్​ బైక్​. దీని రేటెడ్ పవర్​ 3000 వాట్స్. దీనిని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4.5 గంటలు పడుతుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 150 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. దీనిపై గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు.

Revolt RV 400 Price :మార్కెట్లో ఈ రివోల్ట్ ఆర్​వీ 400 బైక్ ధర సుమారుగా రూ.1,37,950 నుంచి రూ.1,47,950 ప్రైస్ రేంజ్​లో ఉంటుంది.

8. Suzuki Gixxer Features : ఈ సుజుకి గిక్సర్​​ బైక్​లో 155 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 13.41 bhp పవర్​, 6000 rpm వద్ద 13.8 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 45 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 6 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Suzuki Gixxer Price : మార్కెట్లో ఈ సుజుకి గిక్సర్ బైక్ ధర సుమారుగా రూ.1,30,792 నుంచి రూ.1,43,538 వరకు ఉంటుంది.

9. Kawasaki W175 Features : ఈ కవాసకి డబ్ల్యూ175​​ బైక్​లో 177 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 7500 rpm వద్ద 12.8 bhp పవర్​, 6000 rpm వద్ద 13.2 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 45 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Kawasaki W175 Price : మార్కెట్లో ఈ కవాసకి డబ్ల్యూ175 బైక్ ధర సుమారుగా రూ.1,22,018 నుంచి రూ.1,35,000 రేంజ్​లో ఉంటుంది.

10. Bajaj Avenger Cruise 220 Features :ఈ బజాజ్ అవెంజర్​ క్రూజ్​​​ బైక్​లో 220 cc సామర్థ్యం గల ఇంజిన్ ఉంటుంది. ఇది 8500 rpm వద్ద 18.76 bhp పవర్​, 7000 rpm వద్ద 17.55 Nm టార్క్​ జనరేట్ చేస్తుంది. ఈ బైక్​ 40 kmpl మైలేజ్ ఇస్తుంది. ఇది 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Bajaj Avenger Cruise 220 Price : మార్కెట్లో ఈ బజాజ్​ అవెంజర్ క్రూజ్​ 220 బైక్ ధర సుమారుగా రూ.1,40,841 ఉంటుంది.

కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్​కు సూట్​ అయ్యే టాప్​-10 స్కూటర్స్ ఇవే!

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details