Bank Holidays In May 2024 : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2024 మే నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం, దేశంలోని వివిధ బ్యాంకులకు ఏకంగా 11 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో జాతీయ సెలవులు సహా, కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి. అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.
List Of Bank Holidays In May 2024
2024 మే నెలలో బ్యాంక్ సెలవుల జాబితా ఇదే!
- మే 1 (బుధవారం) : మే 1న అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బ్యాంక్‌లకు పబ్లిక్ హాలీడే ఉంటుంది.
- మే 5 (ఆదివారం) : మే 5న ఆదివారం కనుక బ్యాంక్‌లకు సాధారణ సెలవు ఉంటుంది.
- మే 8 (బుధవారం) :రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (బంగాల్లో బ్యాంక్‌లకు సెలవు)
- మే 10 (శుక్రవారం) : అక్షయ తృతీయ. అందువల్ల ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.
- మే 11 (శనివారం) : మే నెలలో రెండో శనివారం ఇది. అందుకే బ్యాంకులకు సాధారణ సెలవు.
- మే 12 (ఆదివారం) : సాధారణ సెలవు
- మే 16 (గురువారం) : సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. అందుకే సిక్కింలో ఉన్న బ్యాంకులకు ఆ రోజు సెలవు.
- మే 19 (ఆదివారం) : బ్యాంకులకు సాధారణ సెలవు
- మే 23 (గురువారం) : బుద్ధ పూర్ణిమ. ఉత్తర్‌ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోన్ని బ్యాంకులకు ఆ రోజు సెలవు ఉంటుంది.
- మే 25 (శనివారం) : నజ్రుల్ జయంతి, నాలుగో శనివారం. అందువల్ల బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది.
- మే 26 (ఆదివారం) : ఆదివారం బ్యాంకులకు సాధారణ సెలవు.
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు జరపడం ఎలా?
How To Make Transactions In Bank Holidays :మే నెలలో 11 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. అలాగే యూపీఐ, ఏటీఎం సేవలు కూడా ఎప్పటిలానే నడుస్తాయి. కనుక బ్యాంక్‌లకు వెళ్లకుండానే సులువుగా మీ ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టుకోవచ్చు.