Bajaj Pulsar NS400Z Launch : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ శుక్రవారం పల్సర్ ఎన్ఎస్400 జెడ్ బైక్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. స్టన్నింగ్స్ లుక్స్‌తో ఇది బైక్ లవర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటోంది.
Bajaj Pulsar NS400Z Features
- ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్‌లో 373సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 8,800 rpm వద్ద 40హెచ్‌పీ పవర్, 6,500 rpm వద్ద 35 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
- ఈ బైక్‌పై గరిష్ఠంగా గంటకు 154 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
- ఈ బజాజ్ పల్సర్ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌తో వస్తుంది. అలాగే ఇది స్లిప్-అండ-అసిస్ట్ క్లచ్ కలిగి ఉంది.
- 43ఎంఎం యూఎస్డీ ఫోర్క్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్లు సస్పెన్షన్ డ్యూటీని నిర్వహిస్తాయి.
- 4-పిస్టన్ గ్రిమెకా యాక్సియల్ కాలిపర్‌తో జతచేసిన 320 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 230 ఎంఎం బ్యాక్ డిస్క్‌లు బ్రేకింగ్ వ్యవస్థను కంట్రోల్ చేస్తాయి.
- ఈ పల్సర్ బైక్‌లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది.
- ఈ బైక్ మొత్తం బరువు 174 కిలోలు ఉంటుంది. అంటే డొమినార్ బైక్ కంటే 19 కిలోలు తక్కువ బరువుతో వస్తుంది.
- ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్‌లో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి: స్పోర్ట్స్, రోడ్, రెయిన్, ఆఫ్‌రోడ్.
- ఈ బైక్‌లో 3 లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ (ఆఫ్-రోడ్ రైడింగ్ మోడ్‌లో మాత్రమే) ఉన్నాయి. అయితే ఈ రైడర్ ఎయిడ్స్ అన్నింటినీ కలర్ ఎల్సీడీ డ్యాష్ నియంత్రిస్తుంటుంది.
- ఈ బైక్‌లో నావిగేషన్ డేటాను చూపడానికి ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది. దీనిలో ల్యాప్ టైమర్ ఉంటుంది.
- ఈ బజాజ్ పల్సర్ ఎన్ఎస్400జెడ్ బైక్ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.