తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏథర్‌ నుంచి ఫ్యామిలీ స్కూటర్‌ - సింగిల్‌ ఛార్జ్‌తో 160 కి.మీ రేంజ్​ - ధర ఎంతంటే? - Ather Rizta Electric Scooter Launch

Ather Rizta Electric Scooter Launch : ఏథర్‌ సంస్థ రిజ్తా పేరుతో సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్‌ను లాంఛ్​ చేసింది. దీనిని ఫుల్​ రీఛార్జ్​ చేస్తే 160 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. ఈ నయా ఎలక్ట్రిక్ స్కూటర్​ ఫీచర్స్​, స్పెక్స్, ధర వివరాలు మీ కోసం.

Ather Rizta ev Scooter Launched
Ather Rizta electric scooter launched

By ETV Bharat Telugu Team

Published : Apr 7, 2024, 10:21 AM IST

Ather Rizta Electric Scooter Launch : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ (Ather) రిజ్తా పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్​ను లాంఛ్ చేసింది. ఇది ఒక ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పవచ్చు.

Ather Rizta Electric Scooter Features :
మునుపటి ఏథర్​ 450 మోడల్స్‌లా కాకుండా లుక్‌ పరంగా ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో పలు మార్పులు చేశారు. వైడ్ లెగ్‌స్పేస్‌, పెద్ద సీటుతో దీన్ని తీసుకొచ్చారు. ఇది​ రిజ్తా ఎస్‌, రిజ్తా జడ్‌ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. రిజ్తా ఎస్​లో 2.9 కిలోవాట్‌ బ్యాటరీ, రిజ్తా జడ్‌లో 3.7 కిలోవాట్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఉన్నాయి.

ఏథర్​ రిజ్తా ఎస్‌ 3 కలర్ ఆప్షన్లలో, రిజ్తా జడ్‌ 7 రంగుల్లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్లలో స్మార్ట్ ఎకో, జిప్‌ మోడల్‌లు కూడా ఉన్నాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, థెఫ్ట్‌ డిటెక్ట్‌, మ్యాజిక్‌ ట్విస్ట్, ఆటో హోల్డ్‌, రివర్స్‌ మోడ్‌ లాంటి బెస్ట్ ఫీచర్లు వీటిలో ఉన్నాయి.

ఏథర్​ రిజ్తా బేస్‌ వేరియంట్‌లో 7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే అమర్చారు. మిగిలిన రెండు వేరియంట్లలో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లేను పొందుపరిచారు. ఈ స్కూటర్లలో 56 లీటర్ల స్టోరేజ్‌ స్పేస్​ ఉంటుంది. ఏథర్ కంపెనీ ఈ స్కూటర్లతో పాటు ఏథర్‌ హాలో, హాలో బిట్‌ పేరిట రెండు స్మార్ట్‌ హెల్మెట్లను కూడా తీసుకొచ్చింది. హాలో హెల్మెట్‌ ధర రూ.14,999; హాలో బిట్‌ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది.

Ather Rizta Electric Scooter Price :

  • మార్కెట్​లో రిజ్తా ఎస్‌ ధర రూ.1.10 లక్షలుగా (ఎక్స్‌-షోరూం) కంపెనీ నిర్ణయించింది. దీనిపై​ సింగిల్‌ ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది.
  • రిజ్తా జడ్‌ మోడల్‌ ధరను రూ.1.25 లక్షలుగా ఏథర్​ కంపెనీ నిర్ణయించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ కూడా 123 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. ఇందులోని టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.45 లక్షల వరకు ఉంటుంది. దీనిపై గరిష్ఠంగా 160 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఈ మూడు ఏథర్ ఈవీ స్కూటర్ల టాప్‌ స్పీడ్‌ గంటకు 80 కిలోమీటర్లు.

బెస్ట్​ సన్​రూఫ్ కారు కొనాలా? రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Sunroof Cars Under 10 Lakh

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? టాప్​-10 పవర్​ఫుల్​ మోడల్స్​ ఇవే! - Best Bikes Under 1 Lakh

ABOUT THE AUTHOR

...view details